Police hunts a gold treasure in anantapur of AP ప్రభుత్వ ఉధ్యోగి ఖజానా చూసి.. ఖంగుతిన్న అధికారులు

Andhra police unearth eight trunk boxes of gold silver cash

police unearthed manoj khazana, police hunts govt employee khazana, huge quantity of gold, huge quantity of silver, bundles of cash, trunk boxes, jewellery, cash, Govt employee, khazana, gold, silver, trunk boxes, bukkarayasamudram, ananthapur, andhra pradesh, crime

In a major catch, police unearthed a huge quantity of gold, silver and cash stuffed in eight trunk boxes from a house in SC Colony at Bukkarayasamudram in the district on Tuesday night. An air pistol was also seized from the house.

ప్రభుత్వ ఉధ్యోగి ఖజానా చూసి.. ఖంగుతిన్న అధికారులు

Posted: 08/19/2020 05:07 PM IST
Andhra police unearth eight trunk boxes of gold silver cash

ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగాన్ని అక్షయపాత్రలా మలుచుకుని చేసిన అక్రమ సంపాదనను చూసి అధికారులు ఖంగుతున్నారు, ఔరా అనుకోవడం తప్ప మరేమీ చేయలేని స్థితిలోకి జారుకున్నారు, కళ్లు జిగేల్ మనేలా బంగారం, వెండి ఆభరణాలు.. ఒకటి రెండు కాదు ఏకంగా ఎనమిది ట్రంకు పెట్టలనిండా వీటిని భద్రపర్చాడంటే అతడు ఏ స్థాయి అధికారో అని భావించాల్సిన అవసరం లేదు. ఒక సర్వసాదారణ ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే. అయితే అతని అక్రమాలు మాత్రం అంతకుమించి అన్న రేంజ్ లో వున్నాయి. అనంతపద్మనాభ స్వామి నేలమాళిగల్లో లభించిన అనంత సంపద మాదిరిగా పెద్ద ఎత్తున డబ్బు, బంగారు వెంఢి అభరణాలను సమకూర్చుకున్న ప్రభుత్వ ఉద్యోగిని సంపద చూసి పోలీసులు కూడా విస్మయంచెందారు.

వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలోని ఓ ఇంట్లో పోలీసులు భారీ గోల్డ్ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో బంగారంతో పాటు భారీగా నగదు, వెండి ఇతరత్రా వస్తువులు బయటపడ్డాయి. బుక్కరాయ సముద్రం పోలీసులకు వచ్చిన రహస్య సమాచారంతో పట్టణంలోని ఎస్సీ కాలనీలో ఉన్న బాలప్ప అనే వ్యక్తి ఇంట్లో సోదాలు జరిపారు. అనుమానంతో ఇంట్లో తవ్వకాలు జరపగా 8 పురాతన ట్రంకు పెట్టెలు బయటపడ్డాయి. అందులో దాదాపు 15 కిలోల బంగారం,వెండి,నగదు ఇతర వస్తువులను గుర్తించారు.బాలప్పను విచారించగా... అతని అల్లుడు నాగలింగ ఆ పెట్టెలను తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టినట్లు చెప్పాడు. దీంతో నాగలింగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగలింగ ప్రభుత్వ ట్రెజరీ ఉద్యోగి మనోజ్ పేరును బయటపెట్టాడు.

మనోజే ఆ పెట్టెల్ని తనకు ఇచ్చినట్లు పోలీసులతో వెల్లడించాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఓ రివాల్వర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. బయటపడ్డ బంగారం, వెండి, నగదును తహశీల్దార్, రెవెన్యూ అధికారుల సమక్షంలో లెక్కిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మనోజ్‌ ఈ నిధి ఎక్కడినుంచి వచ్చిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దొంగల ముఠాతో సంబంధాలున్నాయా... లేక ఇవి గుప్త నిధులా అన్నది ఆరా తీస్తున్నట్లు తెలిపారు. పెట్టెలకు పంచానామా నిర్వహించామని... కౌంటింగ్ మెషిన్లతో క్యాష్‌ను లెక్కిస్తున్నామని చెప్పారు. ఆదాయపన్ను సహా సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. కాగా,మనోజ్‌పై గతంలోనూ అవినీతి ఆరోపణలున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Govt employee  khazana  gold  silver  trunk boxes  cash  bukkarayasamudram  ananthapur  andhra pradesh  crime  

Other Articles