Pranab Mukherjee Tested Positive For COVID-19 మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్.!

Former president pranab mukherjee tested positive for covid 19

COVID-19, coronavirus, corona positive, cororna Tpr rate, Pranab Mukherjee, coronavirus, India coronavirus cases

Former President Pranab Mukherjee this afternoon said that he has tested positive for the coronavirus while on a hospital visit for a separate procedure. In a tweet, Pranab Mukherjee, who was India's president between 2012 and 2017, urged all those who has come in contact with him in the last week to isolate themselves as a precaution and get tested for COVID-19.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్.!

Posted: 08/10/2020 09:18 PM IST
Former president pranab mukherjee tested positive for covid 19

యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 7 లక్షల 32 వేల మందిని కబళించి వేసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన నిఫుణులు, అనేక మంది ప్రముఖులను కూడా కబళించింది. ఎందరెందరో నటులు, వివిధ దేశాల రాజకీయ నేతలను కూడా కరోనా కబళించి వేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రెండు కోట్ల మందికి పైగా కరోనా భారిన పడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇటు మన దేశంలోనూ పలువురు ప్రముఖులు కరోనా భారిన పడ్డిన విషయం తెలిసిందే.

ఇప్పటికే ఏపీ మాజీ మంత్రి మాణిక్యాల రావు, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య, సహా పలువురు రాజకీయ నేతలు కూడా కరోనా బారిన పడి అసువులు బాసిన విషయం తెలిసిందే. కాగా, దేశంలో కరోనా విజృంభణ పెరిగిపోతోంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ప్రముఖులు కూడా కొవిడ్‌-19 బారినపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

వేరే పరీక్షల కోసం తాను ఆసుపత్రికి వెళ్లానని, ఈ సందర్భంగా కరోనా పరీక్ష చేయించుకోగా తనకు వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఆయన ప్రకటించారు. ఇటీవల తనను కలిసిన వారు కూడా ఐసొలేషన్‌లో ఉండి, పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు ఐసోలేషన్‌లో ఉంటూ ప్రణబ్‌ ముఖర్జీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles