Final year students worry over UGC decision డిగ్రీలను గుర్తించం: యూజీసీ అల్టిమేటం..

Final year students worry over ugc decision

University grants commission, final year Students, promoted students, Universities, Degrees, university students, AICTE final Year Students, Telangana Engineering students, Telangana MBA students, Telanagana MCA students, Telangana Pharmacy students, Telanagana professional graduate students, Telangana under graduates, Osmania University, promoted students, Universities, university students, JNTUH University, Telangana

While the students of final year are trying to reach the court in conducting the university exams risking their lives, the University Grants Commission decided to conduct the exams and said that it will not identify.. the degrees issued without exams.

యూజీసీ అల్టిమేటం.. డిగ్రీలను గుర్తించం.. విద్యార్థుల్లో నిరుత్సాహం..

Posted: 08/10/2020 08:58 PM IST
Final year students worry over ugc decision

(Image source from: India.timesofnews.com)

కరోనా మహమ్మారి విశ్వాన్నే వణికిస్తోది. ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిపై తన ప్రభావాన్ని చాటిన నేపథ్యంలో, అన్ని రకాల పరీక్షలు వాయిదా పడగా, గత విద్యాసంవత్సరంలో విద్యార్థులందరినీ పై తరగతులకు ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారిలో ఫైనలియర్ పరీక్షలు మాత్రం జరుగుతాయని ఇప్పటికే స్పష్టతను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అయితే దీనిపై చివరి విద్యా సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా ఓ పిటీషన్ తయారు చేసి దానిని ప్రధాని మంత్రి నరేంద్రమోడీ దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి అన్ని రాష్ట్రాల చివరి విద్యా సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తుండగా, ఇక మరికొంత మంది ఈ విషయంలో ఏకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తలుపును కూడా తట్టారు.

అయితే ఫైనల్ ఇయర్ విద్యార్థులు అటు ప్రధాని దృష్టికి ఇటు న్యాయస్థానంలో పోరాటానికి సిద్దమవుతున్న క్రమంలో.. యూజీసీ విద్యార్థులకు అల్టిమేటం జారీ చేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తి ఉధృతంగా ఉన్నప్పటికీ, చివరి సంవత్సరం విద్యార్థులకు పరీక్షల నిర్వహణ తప్పనిసరి అని.. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్ (యూజీసీ) స్పష్టం చేసింది. అలా కాని పక్షంలో సదరు డిగ్రీలను గుర్తించబోమని కూడా హెచ్చరించింది. వివరాలు ఇలా ఉన్నాయి... డిగ్రీ, పీజీ చివరి సంవత్సర విద్యార్థులకు సెప్టెంబరు 30 లోగా పరీక్షలు నిర్వహించాలని యూజీసీ, విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. కాగా, కొవిడ్‌-19 నేపథ్యంలో చివరి సంవత్సరం పరీక్షలు కూడా రద్దు చేయాలని దిల్లీ, మహారాష్ట్ర విశ్వవిద్యాలయాలు నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు సుప్రీం వద్ద అఫిడవిట్‌ను దాఖలు చేశాయి.

అంతేకాకుండా,  కమిషన్‌ ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు కేసులు నమోదయ్యాయి. ఈ అంశంపై విచారణను జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం  చేపట్టింది. ఈ నేపథ్యంలో, పరీక్షలను రద్దు చేయటం విద్యార్థులకు మేలు చేయదని.. యూజీసీ తరపున సొలిసిటర్ జనరల్‌ తుషార్‌ మెహతా సర్వోన్నత న్యాయస్థానానికి నేడు విన్నవించారు. కాగా, కమిషన్‌ నిర్ణయం రాజ్యాంగం, చట్టానికి అనుగుణంగా లేదని ఆయా విశ్వవిద్యాలయాలు వాదించాయి. ఈ అంశంపై ప్రత్యుత్తరమిచ్చేందుకు కమిషన్‌కు వ్యవధినివ్వాల్సిందిగా తుషార్‌ మెహతా కోర్టును కోరారు. ఇందుకు సమ్మతించిన సర్వోన్నత న్యాయస్థానం, కేసు విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles