8 time MLA Penumatsa dies in Visakhapatnam మాజీ మంత్రి పెన్మత్స సాంబశిరావు కన్నుమూత

Former minister penumatsa sambasiva raju dies in visakhapatnam

Penumatsa Sambasiva Raju, Former Minister, YCP Leader, Congress, Penmatsa no more, penmatsa passes away, Penmatsa Sambasiva Raju dead, AP CM YS Jagan, Gajapathinagaram, Visakhapatnam, andhra pradesh

Veteran politician, 8 time MLA, Penmatsa Sambasiva Raju is no more. He breathed his last in the early hours of Monday at a private hospital in Visakhapatnam.Raju started his political carers as Samithi President in 1958 and became MLA from Gajapathinagaram.

మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పెన్మత్స కన్నుమూత

Posted: 08/10/2020 04:53 PM IST
Former minister penumatsa sambasiva raju dies in visakhapatnam

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడు పెన్మత్స సాంబశివరాజు(89) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో భాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక నేత ఆయన. 1989-94లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1968లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గజపతినగరం, సతివాడ శాసనసభ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించారు.

1994 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన  రాజకీయ కురువృద్ధుడిగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత వైకాపాలో చేరారు. పెన్మత్స సాంబశివరాజు మృతిపట్ల ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఐదు దశాబ్దాలకుపైగా ప్రజాసేవలో మచ్చలేని నాయకుడిగా ఉన్నారని కొనియాడారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన నాయకుడు అని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles