(Image source from: Telugu.news18.com)
తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకూ రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు తాజాగా ఎనభై వేల మార్కుకు చేరువలో వున్నాయి. వీటికి తోడు మరణాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. తెలంగాణ వాసులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా నమోదైన మరణాలతో తెలంగాణ.. ఏకంగా మరణాలలో 600 మార్కును అందుకోవడం కూడా అందోళన రేకెత్తిస్తోంది. ఇదివరకే దేశంలో ఐదువందలకుపైగా మరణాలు నమోదు చేసుకున్న ఏడవ రాష్ట్రంగా నమోదైన తెలంగాణ.. ఇక ఇటు కరోనా కేసులలోనూ పైకి ఎగబాకుతోంది. ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, పోలీసుల సమిష్టి కృషితో రాష్ట్రంలో తగ్గినా.. మళ్లీ పెరుగుతున్న కేసులు, మరణాలు వారి పనితీరుకు సవాల్ విసిరేలా తయరావుతున్నాయి.
తెలంగాణలో మే నెల 7 నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోన్నాయి. కాగా జూన్ నెలలో కేంద్రం దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కు పలు సడలింపులు తీసుకురావడంతో జనజీవనం వేగాన్ని అందుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని నగరంలో కరోనా పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సి వున్నా.. అటు ప్రభుత్వం కానీ, ఇటు ప్రజలు కానీ జాగ్రత్త చర్యలు పాటించకపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా విజృంభన కోనసాగుతోంది. హైదరాబాద్ నగరం చుట్టూరా కరోనా మహమ్మారి మాటు వేయడం అందోళన రేపుతోంది. అయితే గ్రేటర్ లో కరోనా నియంత్రణకు కఠినమై చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. కరోనా వ్యాప్తి మాత్రం అగడం లేదు. తాజాగా ఏకంగా 1256 కరోనా కేసులు నమోదుకాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అత్యధికంగా 389లకు పైగా కేసులు నమోదు కావడంతో నగరవాసుల్లోనూ ఆందోళనకు దారి తీస్తోంది.
గత పక్షం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోనూ పెరుగుతూ వచ్చిన కరోనా పాజిటివ్ కేసులు ఇవాళ కాసింత తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా తెలంగాణలో అంతకంతకూ పెరుగుతున్న కేసులు తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో నమోదైన కేసులతో కలిపి మొత్తంగా డెబైఐదు వేల మార్కును చేరింది, దీంతో ఈ స్థాయిలో కరోనా కేసుల నమోదు చేసుకున్న 7వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తాజాగా రాష్ట్రంలో 1256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ లో ఇదివరకు ఎన్నడూ నమోదు కాని అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఏకంగా 389 కోరానా పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, ఇవాళ గ్రేటర్ పరిధితో పాటు రంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్, వరంగల్ అర్భన్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లోనూ కరోనా కేసులు అధికసంఖ్యలో నమోదయ్యాయి.
అయితే గతవారం రోజులుగా నమోదవుతున్న కేసుల తెలంగాణవాసులను కలవరానికి గురిచేస్తోంది. హైదరాబాద్ లో పంజా విసురుతున్న కరోనా.. ఇక జిల్లాల్లోనూ మహమ్మారి తన ఉద్దృతిని చాటుకుంటోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసులు మొత్తంగా 80000 మార్కును దాటిన విషయం తెలిసిందే, ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులెవరికీ కరోనా పాజిటివ్ నిర్థారణ కాలేదని, అన్ని రాష్ట్రానికి చెందిన వారివేనని రాష్ట్ర వైద్య అరోగ్యశాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో మరణాల సంఖ్య మళ్లీ పెరిగింది. రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో కరోనా బారిన పడి అసుపత్రులలో చికిత్సపోందుతూ పన్నెండు మంది అసువులు బాసారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 637కు చేరింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా ఉగ్రరూపం దాల్చింది. కరోనా ఉద్దృతి ధాటికి తెలంగాణలో వ్యాపారాలు, నివాసాలు ఏర్పర్చుకున్న వలస కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు తమ లగేజీ సర్దేసుకుంటున్నారు.
తాజాగా నమోదైన ఇవాళ నమోదైన 1256 కేసులతో మొత్తంగా రాష్ట్రంలో 80,751 కేసులు నమోదయ్యాయి. కాగా, తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 389 కేసులు నమోదయ్యయి. ఇక జిల్లాల్ల వారీగా నమోదైన కేసులు వివరాలు ఇలా వున్నాయి. అదిలాబాద్ లో 63, భద్రాద్రి కొత్తగూడెం 7, జగిత్యాలలో 13, జనగాంలో 20, జయశంకర్ భూపాలపల్లిలో 6, జోగులాంబ గద్వాలలో 14, జోగులాంబ గద్వాల జిల్లాలో 14, కామారెడ్డిలో 8, కరీంనగర్ లో 73, ఖమ్మంలో 28, మహబూబ్ నగర్ 21, మహబూబాబాద్ 19, మంచిర్యాల 11, మేడ్చల్ మల్కాజ్ గిరి 34, ములుగు 3, నగర్ కర్నూల్ లో 38, నల్టొండో 58 కరోనా కేసులు నిర్థారణ అయ్యాయి.
ఇక నారాయణపేట్ జిల్లాలో 12, నిర్మిల్ లో 19, నిజామాబాద్ 33, పెద్దపల్లి 23, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 31, రంగారెడ్డి జిల్లాలో 86, సంగారెడ్డి 74, సిద్దిపేట్ 45, సూర్యాపేట్ 20, వికారాబాద్ 6, వనపర్తిలో 12, వరంగల్ అర్భన్ 67, వరంగల్ రూరల్ 11, యాదాద్రి భువనగిరి జిల్లాలో 3లో కరోనా కేసుుల నమోదయ్యాయి. ఇక కరోనా బారిన పడిన బాధితులు కోలుకొన్న పలువురు రోగులను అధికారులు ఇవాళ డిశ్చార్జ్ చేశారు. దీంతో మొత్తంగా 57,586 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,528 యాక్టివ్ కేసులు వున్నాయని, ఇక హోమ్ ఐసోలేషన్ లో 15,789 మంది చికిత్స పోందుతున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
(And get your daily news straight to your inbox)
Feb 27 | సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వెలసినన ఇల వైకుంఠపురంగా భక్తుల కొంగుబంగారంగా నిలిచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ తిరువేంకటేశ్వరుడికి ఆర్జిత సేవలు నిర్వహించేందుకు భక్తులు అసంఖ్యాకంగా పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు... Read more
Feb 27 | నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మూడు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాన్ని ఒక రకంగా, పశ్చిమ బెంగాల్ ను మరో రకంగా చూడటం... Read more
Feb 27 | తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వంపై మరోమారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరుల త్యాగాల మీద అడుగులు వేసుకుంటూ అధికారాన్ని చేపట్టిన కేసీఆర్.. తెలంగాణ అంటే తానొక్కడే అన్న చరిత్రను... Read more
Feb 26 | నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు తాజా షెడ్యూల్ ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నారు. పశ్చిమ... Read more
Feb 26 | యావత్ దేశం ఇంధన ధరల పెంపుపై భగ్గుమంటోంది. ప్రజలను ఇంధన ధరల పెంపుపై పెదవి విరుస్తుండగా, ఈ ధరాఘాతాన్ని విపక్షాలు తమ తమ స్థాయిలో కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంపై అస్త్రాలుగా సంధించుకుంటున్నాయి. ఈ క్రమంలో... Read more