Woman miraculous escape in accident వాణిశ్రీ మృత్యుంజయురాలు: పైనుంచి కారు దూసుకెళ్లినా..

Woman miraculous escape in accident at kadri kambla junction

accident at kadri kambla junction, woman miraculous escape at kadri kambla junction, woman miraculous escape, Kadri Kambla Junction, accident, miraculous escape, mangaluru, karnataka, crime, viral video

A woman sustained injuries following a car-scooter collision at Kadri Kambala junction here on Friday, August 7. The woman identified as Vanishri, a resident of BC Road has been admitted to a private hospital.

ITEMVIDEOS: వాణిశ్రీ మృత్యుంజయురాలు: పైనుంచి కారు దూసుకెళ్లినా..

Posted: 08/09/2020 12:47 AM IST
Woman miraculous escape in accident at kadri kambla junction

మరణం అంచుల వరకు వెళ్లివచ్చాను అని పలు సందర్భాలలో అనుభవాలను  పంచుకుంటూ చెప్పేవారు వుంటారు. అలాంటి అనుభవమే ఇప్పుడు ఓ ద్విచక్రవాహన చోదకురాలికి ఎదురైంది. మరోలా చెప్పాలంటే ఈమెకు ఇంకా భూమి శివుడాజ్ఞ  రాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఈమె ఏకంగా  మృత్యు ముఖంలోకి వెళ్లి ప్రాణాలతో బయటపడింది. ఈ ప్రమాదాన్ని కళ్లారా చూసినవారు కారు కింద పడిన మహిళ ప్రాణపాయ స్థితిలోకి జారుకుని వుంటుంది లేదా.. ఊహించనిదే జరిగివుంటుదని బావించడంలో తప్పులేదు.

ఈ విస్తుగోలిపే ఘటన కర్నాటక రాష్ట్రంలోని మంగుళూరు పరిధిలోగల కాద్రి కంబ్లా జంక్షన్‌ వద్ద చోటుచేసుకుంది. ఈ రహదారి ప్రధాన కూడలి మీదుగా స్కూటర్‌ వెళ్తున్న వాణిశ్రీ అనే మహిళను ఓ కారు అడ్డుగా వచ్చింది. వామనాన్ని నిలిపే లోపు కారు డీకోనడంతో పాటు అమెపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ఆమె ఒక్కసారిగా ఎగిరి కారు బానెట్ పై పడి.. అక్కడి నుంచి కింద పడింది. అయితే అమెను గమనించ లేదో.. లేక హైరానా చెందాడో తెలియదు కానీ కారు డ్రైవర్‌ తన వాహనాన్ని ముందుకే పోనిచ్చాడు. దాంతో కారు ఆమె మీదుగా వెళ్లింది.

అయితే, ద్విచక్ర వాహానాన్ని కారు డీకొనడంతో శబ్దం విన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై కారును అడ్డుకున్నారు. డ్రైవర్ కారు నిలపడంతో స్థానికులు వెంటనే కారును వెనక్కి నెట్టి.. కారు కిందకు పడిపోయిన మహిళను రక్షించేందుకు ప్రయత్నంలో భాగంగా కారుని అమాంతం పెకెత్తి మహిళను బయటకు తీశారు. ఆస్పత్రికి తరలించారు. వాణిశ్రీకి ఎలాంటి అపాయం లేదని, చిన్న గాయాలే తగిలాయని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. కారు డ్రైవర్‌ నిర్లక్ష్యంపై కామెంట్ల వర్షం కురుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kadri Kambla Junction  accident  miraculous escape  mangaluru  karnataka  crime  viral video  

Other Articles