Jharkhand CM Files Defamation Against BJP MP చౌకబారు అరోపణలకు మూల్యం.. రూ.100 కోట్ల దావా.!

Jharkhand cm files rs 100 crore defamation case against bjp mp nishikant dubey

Nishikant Dubey, Jharkhand Hemant Soren, Jharkhand CM Hemant Soren, jharkhand news, hemant soren news, hemant soren files defamation case against nishikant dubey, hemant soren latest news, defamation case against BJP MP, jharkhand defamation case news, jharkhand chief minister hemant soren

Jharkhand Chief Minister Hemant Soren has filed a ₹ 100 crores defamation suit in Ranchi Civil Court against BJP MP Dr Nishikant Dubey for allegedly hurting his image through social media.

చౌకబారు అరోపణలకు మూల్యం.. రూ.100 కోట్ల దావా.!

Posted: 08/09/2020 12:56 AM IST
Jharkhand cm files rs 100 crore defamation case against bjp mp nishikant dubey

జార్ఖండ్ ముఖ్యమంత్రి జేఎంఎం అధినేత హేమంత్‌ సోరెన్‌ బీజేపి పార్లమెంటు సభ్యుడితో పాటు సామాజిక మాద్యమాలకు షాక్ ఇచ్చారు. అధికార పార్టీకి చెందిన నాయకులను ఒకలా, విపక్షాలకు చెందిన నేతలను మరోలా చూస్తూ వారి పోస్టులపై కూడా అభ్యంతరాలను లేవనెత్తని నేపథ్యంతో సోషల్ మీడియాగా కూడా వత్యాసం చూపించడంతో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వాటిపై కూడా న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించారు. బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబేపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. సోషల్ మీడియాలో బీజేపీ ఎంపీ డాక్టర్ నిషికాంత్ దూబే తనపై తప్పుడు ఆరోపణలు చేశారని పరువు నష్టం దావాలో సోరెన్‌ తెలిపారు.

ఈ మేరకు రాంచీ సివిల్ కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశారు. ఈ దావాలో బీజేపీ ఎంపీతో పాటు ట్విటర్ కమ్యూనికేషన్సు ఇండియా ప్రైవేటు లిమిటెడ్, ఫేస్ బుక్ ఇండియా ఆన్ లైన్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్‌లను రెస్పాండెంట్‌ 2, 3 లుగా పేర్కొంటూ పార్టీలుగా సీఎం చేర్చారు.

సీఎం సోరెన్ పై బీజేపీ ఎంపీ సోషల్ మీడియాలో పలు ఆరోపణలు చేశారు. 2013లో సోరెన్ ముంబైలో ఓ మహిళపై అత్యాచారం చేశారని బీజేపీ ఎంపీ దూబే ట్విటర్‌లో ఆరోపించారు. తన పరువును దెబ్బ తీసేలా జులై 27న సోషల్ మీడియాలో దూబే ఆరోపణలు చేశారని సీఎం పేర్కొన్నారు. తనపై చేసిన ఆరోపణల పోస్టింగులను ట్విటర్, ఫేస్ బుక్ తొలగించలేదని.. అందువల్ల వారిని కూడా పార్టీలుగా చేర్చానని సీఎం చెప్పారు.

ఈ పరువు నష్టం దావాను ఆగస్టు 4న వేయగా కోర్టు ఆగస్టు 5న వాదనలు వింది. కేసు విచారణను ఆగస్టు 22కి వాయిదా వేసింది.  

పరువునష్టం దావా వేసిన తరువాత కూడా బీజేపీ ఎంపీ హేమంత్‌ సోరెన్‌పై ట్విటర్‌ వేదికగా బాణాలు కురిపిస్తునే ఉన్నారు. ‘మీపై ముంబైలో ఒక యువతి రేప్‌ చేశారంటూ ఫిర్యాదు చేసింది. మీరు ఆమెపై న్యాయ పోరాటం చేయాలి. మీరు నా మీద కాకుండా ఆమె మీద కేసుపెట్టాలి. ఏది ఏమైనా సరయూ రాయ్‌లాగా ఒక సీఎంతో పోరాడేందుకు నాకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు’ అంటూ ఆయన హిందీలో ట్వీట్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles