(Image source from: Eenadu.net)
ప్రజాగాయకుడు, విప్లవ రచయిత, జానపద కళాకారుడు, ఉత్తరాంధ్ర జానపద శిఖరం, ఉత్తరాంధ్ర జనం పాట ఊపిరి వంగపండు ప్రసాదరావు కన్నుమూశారు. ఇవాళ తెల్లవారు జామున విజయనగరం జిల్లాలోని స్వస్థలమైన పార్వతీపురంలోని స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రజల్ని చైతన్యపరిచే విధంగా వందలాది పాటలు రాసిన వంగపండుకు ఉత్తరాంధ్ర గద్దర్ గా పేరు ఉంది. వంగపండు మృతితో ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఉత్తరాంధ్ర కళాభిమానులతో పాటు తెలుగు రాష్ట్రాల సాహీతి వేత్తలు కూడా ఆయన మరణం పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.
వంగపండు 1943 జూన్ లో జగన్నాథం, చిన్నతల్లి దంపతులకు పార్వతీపురం పెందబొండపల్లిలో జన్మించారు. జగన్నాథం, చిన్నతల్లి దంపతులకు ఆరుగురు సంతానం. అందులో ముగ్గురు అక్కాచెళ్లెల్లు, ముగ్గురు అన్నాదమ్ములు. అన్నదమ్ములలో పెద్దవాడే వంగపండు. ఆయన ఎస్ఎస్ఎల్ సీ ఫెయిల్ కావడంతో.. బొబ్బిలో ఐటీఐ చేశారు. ఉద్యమంలో చేరిన ఏడాదికే ఆయనకు విశాఖ షిప్ యార్డులో ఫిట్టర్ మెన్ గా ఉద్యోగం వచ్చింది. ఆయినా కూడా ఆయన ఉద్యమమే ఎక్కువ అనుకొని ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. వంగపండు 1972లో గద్దర్ తో కలిసి జన నాట్యమండలిని స్థాపించారు. ఆయన మూడు దశాబ్ధాలలో 300లకు పైగా పాటలు రాశారు. ఆయన రాసిన కొన్ని పాటలు పది బాషలలోకి అనువదించబడ్డాయి. యంత్రమెట్లా నడుస్తుందంటే అనే పాట ఇంగ్లీష్ లో కూడా అనువదించబడి.. అమెరికా, ఇంగ్లాండ్ లలో విడుదలయింది. వంగపండు సాహీతీ సేవలకు మెచ్చిన ప్రభుత్వం చంద్రునికో నూలుపోగు అన్న చందంగా 2017లో కళారత్న పురస్కారాన్ని అందించి సత్కరించింది. వంగపండు శ్వాస, నిశ్వాసలు జనపదన్నే నమ్మాయి.. జానపదమై నలిచాయి.
ప్రజాకవి వంగపండు ప్రసాదరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. వంగపండు ఇక లేరన్న వార్త ఎంతో బాధించిందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఉత్తరాంధ్ర ఉద్యమానికి వంగపండు అక్షర సేనాధిపతిగా పనిచేశారని గుర్తు చేశారు. తెలుగువారి సాహిత్య కళారంగాల చరిత్రలో మహాశిఖరంగా నిలిచిపోతారని కొనియాడారు. వంగపండు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. వంగపండు మృతి పట్ల తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ సంతాపం తెలిపారు. ‘‘వంగపండు తన సాహిత్యం ద్వారా తెలుగు ప్రజలను జాగృతం చేశారు. తన గొంతు, పదాలతో అశేష ప్రజానీకాన్ని ఉర్రూతలూగించారు. ప్రజా చైతన్యానికి వంగపండు ఎనలేని కృషి చేశారు. ఆయన సాహిత్యం అనేక భాషల్లోకి అనువదించడం తెలుగు జాతికే గర్వకారణం. వంగపండు మృతి తెలుగు జానపద సాహిత్య లోకానికి తీరని లోటు. చివరి శ్వాస వరకు గొంతెత్తి వదల జానపదాలకు గజ్జెకట్టారు. ఆయన మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 18 | మహారాష్ట్రలో ఒంటరిగా అధికారంలోకి రావడానికి ప్రస్తుతం అపసోపాలు పడుతున్న శివసేన పార్టీ.. త్వరలోనే జాతీయ పార్టీగా మాత్రం ఎదగాలని యోచనలో వుంది. అందుకు అనుగూణంగా పలు రాష్ట్రాలలో తమ సత్తాను చాటాలని ఉవ్విళ్లూరుతుంది. మహారాష్ట్రలోని... Read more
Jan 18 | కోటి రూపాయాల లంచం డిమాండ్ చేసిన రైల్వే సీనియర్ అధికారిని సీబీఐ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేసింది. ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగుతూ ఇంతటి భారీ మోత్తాన్ని లంచంగా డిమాండ్ చేసి అడ్డంగా... Read more
Jan 12 | కరోనా మహమ్మారి విజృంభనతో గత మార్చి నుంచి నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఓవైపు ఉన్న ఉద్యోగాలే గాలిలో దీపాలుగా మారుతున్న క్రమంలో ఏ ఉద్యోగం దొరికినా ఫర్యాలేదని నిరుద్యోగ యువత భావిస్తున్నారు. కరోనా... Read more
Jan 12 | కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హస్తినలో రైతన్నల ఉద్యమం ఊపందుకున్న వేళ.. ఎనమిది విడతలుగా కేంద్రం అన్నదాతలతో చర్చలు జరిపినా.. అడుగుముందుకు పడక,. ప్రతిష్టంభన కొనసాగుతుంది, ఈ నేపథ్యంలో నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా,... Read more
Jan 12 | ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నగరా మ్రోగిన నేపథ్యంలో దానిని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం రిట్... Read more