CPI (M) leader Sunnam Rajaiah dies of COVID-19 మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్యను కాటేసిన కరోనా

Ex cpm mla from telangana sunnam rajaiah dies of covid 19

coronavirus, covid-19, Sunnam Rajaiah, bhadrachalam, former mla, three time mla, cpi m mla, simplicity leader, vijayawada, telangana, andhra pradesh

Three-time MLA and CPM state secretariat member Sunnam Rajaiah known for his simplicity and unwavering commitment to the cause of the people's issues, died of COVID-19 while undergoing treatment at a hospital in Vijaywada shortly after last midnight.

మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్యను కాటేసిన కరోనా

Posted: 08/04/2020 04:03 PM IST
Ex cpm mla from telangana sunnam rajaiah dies of covid 19

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి వేగాన్ని అంతకంతకూ పెంచుతూ ప్రజల ప్రానణాలతో చెలగాటం ఆడుతోంది. ఇన్నాళ్లు సామాన్యుల ప్రాణాలను టార్గెట్ చేసుకుని కబళించిన కరోనా.. ఇటీవల కాలంలో ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. ఇటీవలే మాజీ మంత్రి మాణిక్యాల రావును బలి తీసుకున్న కరోనా మహమ్మారి తాజాగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా సేవలందించిన మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీకి చెందిన భద్రచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సున్నం రాజయ్యను కూడా కబళించింది. ప్రజల్లో ఒక్కడిలా వుంటూ సాధారణ జీవినాన్ని వీడని ఆయన మరణంలో భద్రాచలం నియోజకవర్గంలో విషాధచాయలు అలుముకున్నాయి.

కరోనా మహమ్మారి ఆయనను కూడా బలితీసుకుందని తెలిసిన సీపీఎం పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆయన మరణంతో దు:ఖసాగరంలోకి మునిగిపోయారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్యకు అనుమానంతో కుటుంబ సభ్యులు నిన్న కరోనా పరీక్ష చేయించారు. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో భద్రాచలం నుంచి విజయవాడ ఆసుపత్రికి తరలించారు. అక్కడి అసుపత్రితో చికిత్స పోందుతూ ఆయన మరణించారు. అయితే పలువురు మాత్రం ఆయన మార్గమధ్యంలో కన్నుమూశారు. అయితే దీనిపై వైద్యులు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజకవర్గం నుంచి 1999, 2004లలో రెండు పర్యాయాలు గెలిచిన ఆయన ఆ తరువాత 2009లో ఓటమిని చవిచూశారు. ఆ తరువాత 2014లో తెలంగాణ రాష్ట్రానికి తొలిసారిగా జరిగిన ఎన్నికల్లోనూ ఆయన విజయఢంకా మ్రోగించారు. సీపీఎం పార్టీ తరఫున మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా, గత ఎన్నికల్లోనూ ఆయన కొద్దిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కొద్దికాలంగా తూర్పుగోదావరి జిల్లా వరరామచంద్రాపురం మండలం సున్నంవారిగూడెంలో రాజయ్య ఉంటున్నారు. ఆయన ఇద్దరు కుమారులు, అల్లుడికి కరోనా సోకింది. వారు రాజమహేంద్రవరం దగ్గర బొమ్మూరులో చికిత్స పొందుతున్నారు.

రాజయ్య మృతికి ప్రముఖుల సంతాపం

 

మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం తెలిపారు. నిరాడంబర రాజకీయ నేతగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రాజయ్య తన జీవితాంతం కృషి చేశారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సున్నం రాజయ్య నిబద్ధత కలగిన వామపక్షవాది అని సీపీఐ సీనియర్‌ నేత సురవరం సుధాకర్‌రెడ్డి  అన్నారు. రాజయ్య ఆకస్మికమృతి దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా పార్టీ పట్ల అంకితభావంతో నిలబడ్డారని కొనియాడారు. రాజయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజయ్య మరణం పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సీపీఎం నేత వైవీ ఆవేదన వ్యక్తం చేశారు. త్యాగ నిరతితో కూడిన ఉద్యమ సహచరుడిని కోల్పోవడం బాధాకరంగా ఉందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunnam Rajaiah  Sunnam Rajaiah death  COVID-19  Coronavirus  CPM  Telangana CPM  

Other Articles

Today on Telugu Wishesh