Govt exempts hand sanitisers from licence for sale శానిటైజర్ల ధరలపై నియంత్రణ చేపట్టిన కేంద్రం.. నో లైసెన్స్..

Licence for stocking and sale of hand sanitiser no longer required govt

hand sanitiser, union health ministry, coronavirus, covid 19, Central Government, New rules, Sanitisers, Hand sanitisers recall, stock, sales

The Union Health Ministry has done away with the requirement of a licence for stocking and sale of hand sanitiser to make it more widely available for the public amid the COVID-19 pandemic.

శానిటైజర్ల ధరలపై నియంత్రణ చేపట్టిన కేంద్రం.. నో లైసెన్స్..

Posted: 07/31/2020 01:25 AM IST
Licence for stocking and sale of hand sanitiser no longer required govt

ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా రెండు కోట్ల మందిని తన ప్రభావానికి గురిచేసి.. లక్షల మందిని కబళించి వేసిన కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న క్రమంలో తాజాగా కేంద్రం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. కరోనా మహమ్మారి భారిన పడకుండా తప్పించుకునేందుకు ఇప్ప‌టికీ స‌రైన టీకా, మందులు లేకపోవడంతో కేంద్రం తీసుకున్న పలు కీలక నిర్ణయాలను దేశ ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. క‌రోనా క‌ట్ట‌డికి భౌతిక‌దూరం పాటించ‌డం, మాస్క్ ధ‌రించ‌డం, వ్య‌క్తిగ‌త శుభ్ర‌ద‌త పాటించ‌డ‌మే దివ్య ఔషదాలుగా నిలుస్తున్నాయి, వ్యక్తుల పరిశుభ్ర‌త‌లో ప్ర‌ధాన‌మైన వీలైన‌న్ని ఎక్కువ‌సార్లు చేతులు శుభ్రం చేసుకోవ‌డం.. ఇక బయటకు వెళ్లిన సమయంలో చేతులను శానిటైజర్ చుక్కలతో శుభ్రపర్చుకోవడం.

బ‌య‌ట‌కు వెళ్లి ఇతరులను కలసిన‌ప్పుడు.. వారి చేతుల్లోని వస్తువులు తీసుకున్న నేపథ్యంలోనూ చేతులు శానిటైజ్ చేసుకోవడం తప్పనిసరి. దీంతో.. ఒక్క‌సారిగా శానిటైజ‌ర్ల‌కు డిమాండ్ పెరిగిపోయింది.. క‌రోనా వైరస్ నుంచి తప్పించుకునేందుకు ఇది కీల‌క‌మైన అస్త్రంగా మారిపోయింది.. ఎవ్వ‌రి బ్యాగులో చూసినా హ్యాండ్ శానిటైజర్ వుండితీరాల్సిందే. ఏ జేబులో చూసినా అదే.. ఏ వాహ‌నంలోనైనా ఉండాల్సిందే.. ఇక కార్యాల‌యాలు, షాపింగ్ మాల్స్.. ఇలా వేటి ముందైనా శానిటైజ‌ర్ ద‌ర్శ‌న‌మిస్తోంది.. నిత్యావ‌స‌ర వ‌స్తువుల్లో కూడా శానిటైజర్ భాగ‌మైపోయింది.. ఎందుకంటే.. ప్ర‌తీ ఇంట్లోనూ వాడేస్తున్నారు... దీంతో.. కొరత ఏర్పడకుండా కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది కేంద్రం.

వాటిలో ముఖ్యంగా.. శానిటైజర్ అమ్మడానికి, నిల్వ ఉంచేందుకు ఇకపై అనుమతులు అవసరం లేదని ప్రకటించింది. ఈ నిబంధన వెంటనే అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. దేశంలో శానిటైజర్‌ కొరత తలెత్తకుండా కొత్తగా 600 సంస్థలకు తయారీకి అనుమతులు కూడా ఇచ్చేశారు... ఇక‌, శానిటైజర్ ధరల‌పై కూడా కేంద్రం కీలక ప్రకటన చేసింది. 200 ఎంఎల్ శానిటైజ‌ర్ ధర ఎట్టి పరిస్థితుల్లోనూ రూ.100 కంటే అధికంగా ఉండరాదని ఆదేశించింది. ఎక్స్‌పైరీ డేట్ దాటిన శానిటైజర్‌ నిల్వలను తమ వద్ద ఉంచుకోరాదని.. అమ్మకూడదని కీల‌క ఆదేశాలు జారీ చేసింది. మ‌రోవైపు.. శానిటైజర్‌ విక్రయించేందుకు ఇప్పటివరకు లైసెన్సు తప్పనిసరి అనే నిబంధన ఉండ‌గా.. దానిపై వ‌స్తున్న విజ్ఞ‌ప్తుల‌తో.. ఆ నిబంధ‌న కూడా ఎత్తివేసింది కేంద్రం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles