(Image source from: English.sakshi.com)
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. మే నెల చివరి వారం నుంచి వేగాన్ని పుంజుకున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజుకు వందలాది మందిని తన ప్రభావానికి గురిచేస్తూ ఏకంగా లక్ష కరోనా కేసులు దాటింది, ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసులు లక్ష మార్కు ను దాటి 30 వేలకు పైకి చేరాయి. ఇక పక్షం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. దాదాపుగా పక్షం రోజులుగా ప్రతీ రోజు ఐదు వేల మార్కుకు పైగానే కరోనా పాజిటివ్ కేసుల నమోదు ఇవాళ అత్యధిక స్థాయిలో వరుసగా రెండో పర్యాయం పది వేలకు పైబడి కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు నిర్థారణతో ఏకంగా లక్ష ముఫై వేల మార్కును అధిగమించింది, ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటున్నా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఇటీవల రోజరోజుకూ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే వున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో పది వేల పైబడిన సంఖ్యలో కేసులు నమోదు కావడం ఆందోళన వ్యక్తమైంది.
తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఏకంగా లక్షా ముఫై వేల మార్కును అధిగమించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజాగా 10167 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో మొత్తంగా 1,30,557 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు పోరుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఎవరూ లేకపోవడం గమనార్హం. ఇవాళ నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, విశాఖ, అనంతపూర్, కర్నూలు, గుంటూరు ల్లోనే నమోదయ్యాయి. అత్యధికంగా ఏకంగా పదహారు వందల సంఖ్యలో ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే నమోదు కావడం అక్కడ తీవ్రతను తెలియజేస్తోంది.
ఇక రాష్ట్రంలో జిల్లాలవారీగా పరిశీలిస్తే.. ఆనంతపురంలో 954, చిత్తూరు జిల్లాలో 509, తూర్పు గోదావరి జిల్లాలో 1441, గుంటూరు జిల్లాలో 946, కడప జిల్లాలో 753, కృష్ణా జిల్లాలో 271, కర్నూలు 1252. నెల్లూరు జిల్లాలో 702, ప్రకాశం జిల్లాలో 318 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, శ్రీకాకుళం జిల్లాలో 586, విశాఖపట్నం జిల్లాల్లో 1223, విజయనగరంలో 214, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ 998 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, దీంతో జిల్లా వైద్యశాఖ అధికారులు కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేసి.. వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకునన్నారు. ఇక పురపాలక సంఘాలు, గ్రామపంచాయితీల ఆధ్వర్యంలో కంటైన్ మెంట్ జోన్లలో రసాయనాలు చల్లారు. ఆయా ప్రాంతాలను సానిటైజ్ చేశారు.
కాగా, రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి 68 మంది అసువులు బాసారు. గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పు గోదావరి, గుంటూరు, అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం జిల్లాలో అత్యధిక మరణాలు సంభవించాయి. తూర్పుగోదావరిలో 9, గుంటూరులో తొమ్మిది, అనంతపురం 8, కర్నూలులో 8, విశాఖపట్నంలో ఎనమిది, చిత్తూరు, కడప జిల్లాలో ఆరుగురి చోప్పున, ప్రకాశం, విజయనగరం జిల్లాలో నలుగురి చోప్పున, కృష్ణ లో ముగ్గురు, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిగోదావరి జిల్లాలో ఒక్కక్కరు చోప్పున మృత్యువాత పడ్డారు. కరోనాతో ఇప్పటి వరకు 1,281 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. దీంతో కోరాన వైరస్ బారిన పడి చికిత్స పోందుతూ అసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 60,024కు చేరడం రాష్ట్రప్రజలకు, వైద్య సిబ్బందికి కొంత ఊరటనిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత్తం యాక్టివ్ గా వున్న కరోనా కేసులు 69,252కు చేరాయి. ఇక కరోనా బారిన పడి.. విదేశాల నుంచి వచ్చి.. చికిత్స పోందుతున్న వారి సంఖ్య 434గా నమోదు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల సంఖ్య కూడా ఏకంగా 2461కు చేసింది.
(And get your daily news straight to your inbox)
Jan 19 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయిలో ఎన్నికల నిర్వహణ పంచాయితీ హైకోర్టుకు చేరిన తరుణంలో ఎన్నికల నిర్వహణ వుంటుందా.? లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల... Read more
Jan 19 | అనునిత్యం దేశం కోసం.. దేశభక్తి కోసం ప్రసంగాలు గుప్పించే వ్యక్తుల నుంచి దేశానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారం ఓ జర్నలిస్టుకు లీక్ కావడంపై కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా... Read more
Jan 19 | హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ లిమిటెడ్ సంస్థ రూపోందించిన కరోనా వాక్సీన్ కోవాక్సీన్ ను మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే అత్యవసర వినియోగం కోసం లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. అయితే... Read more
Jan 19 | నాగార్జునసాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీని సాధించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో తమకు ఎదురులేదని.. మోనార్క్ ముద్రను వేసుకున్న టీఆర్ఎస్ ఇకపై ఎన్నికలంటే... Read more
Jan 19 | కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని భయం గుప్పెట్లోకి నెట్టిన తరువాత రెండో వేవ్ అంటూ భయాలు ఉత్పన్నమైన వేళ.. సెకెండ్ స్ట్రెయిన్ కూడా పలు దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత... Read more