CoronaVirus Positive Case in Ayodhya రామ జన్మభూమిలో కరోనా కలకలం..

Priest 14 cops involved in ayodhya ram temple event test covid positive

Ayodhya Ram temple, Ram Temple Priest Coronavirus Positive, Police Coronavirus Positive, ayodhya priest, Ayodhya ram mandir, coronavirus, ayodhya priest corona positive, ram temple event, up police, cops test corona positive, priest tests corona positive, PM Modi, CM Yogi Adithyanath, Uttar Pradesh

A priest and 14 policemen on duty at Ayodhya's Ram Janambhoomi complex, where the groundbreaking ceremony for the Ram temple is expected to be held on August 5, have tested positive for coronavirus. Prime Minister Narendra Modi is expected to attend the ceremony along with 50 VIPs.

అయోధ్యలో కరోనా కలకలం.. పూజారీ సహా పోలీసు సిబ్బందికీ..

Posted: 07/31/2020 12:34 AM IST
Priest 14 cops involved in ayodhya ram temple event test covid positive

(Image source from: Ndtv.com)

అయోధ్యలో రమ్య రామ మందిరం నిర్మాణానికి భూమిపూజ ముహూర్తం సమీపిస్తున్న వేళ ఆ నగరం మొత్తం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా వచ్చే నెల ఐదవ తేదీ నిరవ్హించే భూమి పూజకు శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు సిద్దం చేస్తున్నారు. ఈ క్రమంలో అయోధ్య నగరంలో కరోనా వైరస్‌ కలకలం రేపుతోంది. అంతా సిద్దమని.. ఎలాంటి విఘ్నాలు లేకుండా శ్రీరాముల వారి ఆలయ నిర్మాణం కోసం చకచకా ఏర్పాట్లు పూర్తైన తరుణంలో రామ మందిరంలో ఆర్చకులకు కరోనా సోకింది. అర్చకులతో పాటు ఆలయ శంకుస్థాపన కార్యాక్రమానికి బందోబస్తుగా వచ్చిన పోలీసులకు కూడా కరోనా మహమ్మారి సోకింది.

ఇవాళ ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న నేపథ్యంలో అనువణువూ పరిశీలిస్తున్న అధికారులు.. అక్కడి బందోబస్తుకు వచ్చిన పోలీసులతో పాటు ఆలయంలోని సిబ్బంది అందరికీ రాష్ట్ర వైద్యాధికారులు నిర్వహించిన పరీక్షలలో ఈ విషయం నిర్థారణ అయ్యింది. అయోద్య శ్రీరామాలయంలో ప్రధాన పూజారి సహాయకుడిగా ఉన్న పూజారి ప్రదీప్ దాస్‌ కొవిడ్‌ బారిన పడ్డారు. దీంతో ఆయన్ను హోం క్వారంటైన్ కు తరలించారు. అలాగే, ఆలయం వద్ద విధులు నిర్వహిస్తున్న 14 మంది పోలీసు సిబ్బందికి సైతం పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ట్రస్టు వెల్లడించింది.

ప్రధాని నరేంద్ర మోదీ సహా 50మంది ప్రముఖులు విచ్చేస్తున్న సందర్భంగా భారీ బందోబస్తు నెలకొంది. ఇక శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో అన్ని భద్రతా చర్యలు తీసుకొని కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నట్టు ఆలయ ట్రస్ట్‌ తెలిపింది. కొందరు అతిథులు, పూజారులు, భద్రతా సిబ్బంది, స్థానికులతో కలిపి మొత్తం 200 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles