CBI team interrogates devireddy shiv shanker reddy in Y S Viveka’s case వైఎస్ వివేకా హత్యకేసు: దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి విచారించిన సీబిఐ.!

Cbi team interrogates devireddy shiv shanker reddy in y s vivekananda reddy murder case

CBI, Y S Vivekananda Reddy, Y S Viveka Murder case, YS Sunitha, YS Sowbhagyamma, DeviReddy Shiva Shanker Reddy, YSRCP, TDP, YS Sunitha, Kadapa SP, K K Anburajan, Pulivendula, High court, Andhra Pradesh, Crime, Politics

The CBI investigation into the macabre murder of Y S Vivekananda Reddy, brother of late YS Rajasekhara Reddy and uncle of Andhra Pradesh Chief Minister Y S Jagan Mohan Reddy, and Interrogated DeviReddy Shiva Shanker Reddy the key follower of YS Avinash Reddy.

వైఎస్ వివేకా హత్యకేసు: దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి విచారించిన సీబిఐ.!

Posted: 07/29/2020 09:33 PM IST
Cbi team interrogates devireddy shiv shanker reddy in y s vivekananda reddy murder case

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ చేస్తోన్న సీబీఐ స్పీడు పెంచింది. రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు శరవేగంగ దర్యాప్తు చేస్తున్నారు.  మాజీ మంత్రి వై.ఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో కీలక అనుమానితులను అధికారులు విచారిస్తున్నారు. పులివెందులకు చెందిన వైసీపి రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి కడపలో సీబీఐ విచారణకు హాజరయ్యారు. కడప ఎంపీ వై.ఎస్‌ అవినాష్‌ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని కూడా సీబిఐ విచారించడం గమనార్హం.

అవినాష్ రెడ్డికి అత్యంత కీలకమైన వ్యక్తిగా వున్న నేతపై కూడా వైఎస్ వివేకా కుమార్తె సునీత అనుమానం వ్యక్తం చేశారు. ఆయన పేరును కూడా అమె వివేకా హత్య కేసులో అనుమానితులుగా పేర్కోన 15 మంది జాబితాలో పొందేపర్చారు. దీంతో శివశంకర్‌ రెడ్డి పేరు కూడా ఉండటం గమనార్హం. దీంతో ఇవాళ సీబీఐ ఆదేశాల మేరకు విచారణకు హాజరయ్యారు. వివేకా హత్య జరిగిన రోజు సంఘటనా స్థలంలో వై.ఎస్‌ కుటుంబ సభ్యులతోపాటు దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి కూడా ఉన్నారు. సాక్ష్యాలు తారుమారు చేయడానికి ఈయన కూడా సహకరించారని అప్పట్లో విమర్శలు వచ్చాయి.

గతంలో శివశంకర్‌ రెడ్డిని ఐదు రోజులపాటు వరుసగా సిట్‌ విచారించింది. నేరచరిత్ర కలిగిన శంకర్‌ రెడ్డిపై వివేకా కుమార్తె సునీత అనుమానం వ్యక్తం చేశారు. దీంతో సీబీఐ అధికారులు అతన్ని లోతుగా విచారణ చేస్తున్నారు. వై.ఎస్‌ కుటుంబ సభ్యులతో ఎలా పరిచయం.. వివేకా హత్య జరిగిన రోజు సమాచారం ఎలా వచ్చింది? అనే దానిపై సీబీఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వివేకా హత్య జరిగిన తర్వాత కొందరు అనుమానితులతో శివశంకర్‌ రెడ్డి మాట్లాడినట్లు వివేకా కుమార్తె హైకోర్టుకు విన్నవించారు. ఫలితంగా ఇతన్ని లోతుగా విచారణ చేస్తే కీలక సమాచారం లభ్యమయ్యే వీలుందని సీబీఐ భావిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles