First batch of Rafale Jets lands at Ambala airbase భారత్ గడ్డను ముద్దాడిన రాఫెల్ యుద్ద విమానాలు

Rafale fighter jets land at iaf airbase in ambala airbase

Rafale jets, Rafale India, Rafale, Dassault Rafale, India, France, Indian Army, Rajnath Singh, PM Modi, India, France, Ambala Air Base

The first batch of Rafale fighter jets that took off from France on Monday has landed at the Ambala airbase today giving the country's air power a strategic edge over its adversaries in the neighbourhood

అంబాలా వద్ద భారత్ గడ్డను ముద్దాడిన రాఫెల్ యుద్ద విమానాలు

Posted: 07/29/2020 09:15 PM IST
Rafale fighter jets land at iaf airbase in ambala airbase

ప్రతిష్ఠాత్మకమైన రఫేల్‌ యుద్ధ విమానాలు అంబాలాలోని భారత వాయుసేనకు చెందిన ఎయిర్ బేస్ లో ముద్దాడాయి. కాసేపటి క్రితం అంబాలాకు మొదటి విడతలోని ఐదు జెట్ విమానాలు చేరుకున్నాయి. ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన ఈ ఫైటర్ జెట్లు దాదాపు 7 వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత్ అమ్ములపొదిలో చేరాయి. వీటి రాకతో భారత వాయుసేన మరింత బలోపేతం అయ్యింది. వీటికి మిలిటరీ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. 'గోల్డెన్ యారోస్'గా పిలిచే నెంబర్ 17 స్క్వాడ్రన్ లో ఇవి భాగం కానున్నాయి. ఫ్రాన్స్ నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించిన యుద్ద విమానాలు సురక్షితంగా దిగాయి.

రాఫెల్ యుద్ధ విమానాలు అంబాలాలో ల్యాండ్ అయిన వెంటనే భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'లోహ విహంగాలు అంబాలాలో సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. రాఫెల్ విమానాలు మన గడ్డను తాకిన క్షణం తర్వాత భారత మిలిటరీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయింది. మన వాయుసేన శక్తి సామర్థ్యాలు ఈ మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్స్ తో మరింత పెరగనున్నాయి' అని రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. మొత్తం 36 రాఫెల్ జెట్స్ కోసం ఫ్రెంచ్ ఏరో స్పేస్ దిగ్గజం 'డస్సాల్ట్ ఏవియేషన్'తో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. మిగిలిన విమానాలు విడతల వారీగా మనకు అందనున్నాయి.

17వ వైమానిక స్క్వాడ్రన్‌లో రఫేల్‌ యుద్ధ విమానాలు చేరనున్నాయి. ఆగస్టు రెండో విడత భారత్‌కు మరికొన్ని రఫేల్‌ యుద్ధ విమానాలు రానున్నాయి. ప్రపంచంలోని అత్యుత్తమ యుద్ధ విమానాల్లో రఫేల్‌కు స్థానముంది. అనేక మిషన్లు చేపట్టే ఓమ్నిరోల్ విమానంగా రక్షణశాఖ పరిగణిస్తోంది. ఏవియానిక్స్‌, రాడార్లు, అత్యుత్తమ ఆయుధ వ్యవస్థ కలిగిన రఫేల్‌ విమానం దక్షిణ ఆసియాలోనే అత్యంత శక్తిమంతమైన విమానం కావడం విశేషం. ప్రపంచంలోనే  అత్యంత వేగంగా, శత్రు విమానాలకు అందనంత సామర్థ్యంతో ప్రయాణించడం వీటి ప్రత్యేకత. ప్రస్తుతం భారత్ తో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా వద్ద కూడా ఇలాంటి యుద్ధ విమానాలు లేకపోవడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rafale jets  Rafale India  Rafale  Dassault Rafale  India  France  Indian Army  Rajnath Singh  PM Modi  India  France  Ambala Air Base  

Other Articles