DGCA to inspect all Boeing B737s of Indian airlines దేశీయ విమానాల‌పై న‌వంబ‌ర్ 24 వ‌ర‌కు ఆంక్ష‌ల కొన‌సాగింపు

Dgca extends domestic flight restrictions fare brackets to november 24

COVID-19, coronavirus, Civil Aviation Ministry, Capping on Fares, Domestic Flights, lockdown: DGCA, Civil Aviation Ministry Extends Capping on Fares of Domestic Flights, Coronavirus lockdown: DGCA extends restrictions on domestic flights, DGCA extends fare capping, Government extends domestic airfare capping for 3 months, Govt extends airfare price cap order till November 24, domestic flights, domestic flights restrictions extended, dgca, flights schedule today, international flights

The Centre has extended restrictions on domestic flights till November 24 from August 24 earlier. In a notification late Friday, the Directorate General of Civil Aviation (DGCA) said that flight capacity curbs - as per which airlines are only allowed to deploy 45 per cent of the pre-COVID capacity on domestic routes - and fare brackets have been extended for three more months with a month left to go for the earlier deadline.

దేశీయ విమానాల‌పై న‌వంబ‌ర్ 24 వ‌ర‌కు ఆంక్ష‌ల కొన‌సాగింపు

Posted: 07/25/2020 07:06 PM IST
Dgca extends domestic flight restrictions fare brackets to november 24

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి జడలు విప్ప కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దేశీయ విమానాలపై ఆంక్షలను పోడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దేశీయంగా లాక్ డౌన్ విధించిన తరువాత మే 25 నుంచి దేశీయ విమానాలు పలు ఆంక్షల నడుమ తమ సేవలను అందించేందుకు పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఐ) అదేశాలను జారీ చేసింది. అయితే ఆ ఆంక్షలు ప్రస్తుతం దేశీయంగా కోవిడ్ ప్రభావం పెరుగుతున్న క్రమంలో నవంబర్ 24 వరకు పొడిగించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్లో దేశీయ విమాన ఛార్జీలపై గ‌తంలో విధించిన నియంత్ర‌ణ కూడా నవంబర్ 24 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు అమలులో ఉంటుందని తెలిపింది. కరోనా వ్యాధి వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో మార్చి 25 న దేశీయ విమానాలను నిలిపివేశారు. ఈ ఏడాది దీపావళి నాటికి దేశీయ విమానాల సంఖ్య గ‌తంతో పోలిస్తే 55 – 60 శాతానికి చేరుకుంటుందని తాను ఆశిస్తున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరి ఇటీవల వెల్లడించారు. దేశీయ వాయు రవాణాలో నిరంతర మెరుగుదల ఉందని ఆయన అన్నారు,

మే 25 న విమానాలలో ఎక్కిన 30,000 మంది ఫ్లైయర్స్ తో పోల్చితే.. జూలై ఆరంభంలో ఇది రెట్టింపు అయ్యిందని పేర్కొన్నారు, రెండు నెలల సస్పెన్షన్ తర్వాత ఈ రంగాన్ని దశలవారీగా తిరిగి ప్రారంభించడం ప్రారంభమైంది. దేశీయ రంగాన్ని మరింతగా పెంచే ప్రయత్నంలో భాగంగా, గతంలో అనుమతించిన 33% విమాన కార్యకలాపాల సామర్థ్యాన్ని 45% కి పెంచాలని మంత్రిత్వ శాఖ గత నెలలో క్లియర్ చేసింది. మే 21 న ఆమోదించిన ఉత్తర్వులలో దేశీయ విమానాలను కేంద్రం ఆమోదించినా.. వేసవి షెడ్యూల్ లో మూడో వంతుకు పరిమితం చేసింది. దేశీయ విమాన ఛార్జీలపై గ‌తంలో విధించిన నియంత్ర‌ణ కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles