Rahul Gandhi Accuses Railways Of Making Profit ప్రధాని మోడీది పేదల వ్యతిరేక ప్రభుత్వం: రాహుల్ ధ్వజం..

Benefitting during a disaster rahul gandhis latest attack on govt

Rahul Gandhi, coronavirus, Railway ministry, anti-poor government, Shramik Special trains

Congress leader Rahul Gandhi, who has been lashing out at the Centre relentlessly, attacked the 'anti-poor' government for what he said was earning a profit during the ongoing coronavirus pandemic. His tweet came after the railways ministry said the Indian Railways generated Rs 429.90 crore revenue through fares collected for Shramik Special trains till July 9.

ప్రధాని మోడీపై రాహుల్ ధ్వజం.. కష్టకాలంలోనూ పిండేస్తోంది..

Posted: 07/25/2020 05:06 PM IST
Benefitting during a disaster rahul gandhis latest attack on govt

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం పేదల వ్యతిరేక ప్రభుత్వమని కాంగ్రెస్ అగ్రనేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు వస్తున్నా పెద్దగా పట్టించుకోకుండా వ్యవహరించడం మోడీ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ఓ వైపు కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంటే.. వలస వచ్చిన ప్రాంతాల్లో పనులు లేక.. కనీసం తిండికి కూడా నోచుకోలేక లక్షలాది మంది వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లే క్రమంలో ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్లును ఉచితంగానే నడిపిస్తున్నామని, ఆయన ప్రభుత్వాలు కార్మికులకు చెల్లించే రైలు చార్జీలను చెల్లిస్తున్నాయని చెప్పినదంతా అబద్దమేనని తాజాగా వెల్లడైందని ఆయన అన్నారు.

కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా పేదల నుంచి డబ్బులు వసూలు చేసిన ఘనత కేంద్రంలోని బీజేపి సర్కారుదేనని అన్నారు, శ్రామిక్ రైళ్లను నడిపి కూడా రైల్వేలను లాభాల్లో ఉంచామని ఆ శాఖ ప్రకటించడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. లాక్‌ డౌన్‌ సమయంలో వలస కార్మికులను వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు.. రాష్ట్రాల వినతి మేరకు కేంద్ర రైల్వేశాఖ శ్రామిక్‌ ప్రత్యేక రైళ్ల ద్వారా నడిపిన విషయం తెలిసిందే. ఈ రైళ్ల ద్వారా జులై 9నాటికి రూ.429.90 కోట్ల ఆదాయం సమకూరినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ ప్రకటనపై రాహుల్‌ తీవ్ర విమర్శలు చేశారు. రైళ్లలో కార్మికులను ఉచితంగానే తీసుకెళ్తున్నామని చెప్పిన ప్రభుతమే.. రూ.429 కోట్ల లాభాన్ని ఆర్జించామని చెప్పడంతో దాని నిజస్వరూపం బయటపడిందని అన్నారు.

‘‘దేశంపై కరోనా మహమ్మారి అనే మబ్బు దట్టంగా కమ్ముకుంది. ప్రజలు అష్టకష్టాలూ పడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం లాభాలను ఆర్జించింది. కరోనా లాంటి విపత్తును లాభంగా మార్చుకుని కేంద్రం సంపాదిస్తోంది’’ అని ట్విట్టర్ వేదికగా తీవ్రంగా రాహుల్ ఆరోపించారు. దేశంలో శ్రామిక్‌ రైళ్లను వలస కార్మికుల కోసం మే 1 నుంచి కేంద్ర ప్రభుత్వం నడుపుతోంది. జులై 9 వరకూ 4,496 ప్రత్యేక రైళ్లను నడిపారు. దాదాపు 6.3 మిలియన్‌ ప్రజలను వారి స్వస్థలాలకు చేర్చారు. తద్వారా ఏకంగా రూ 429.90 కోట్ల రూపాయాలను రైల్వే శాఖ అర్జించింది. ఇక ఇటీవల ఇంధన ధర విషయంలోనూ ప్రభుత్వ నిర్ణయం అలాగే వున్న విషయం ప్రజలు గమనిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు విమర్శించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles