Cipla Ciplenza for coronavirus treatment కరోనావైరస్ చికిత్సలో సిప్లా నుంచి చౌకైన మందు

Cipla set to launch favipiravir drug for treatment of covid patients

Pharmaceutical major Cipla Drug Controller General of India (DCGI) launch of Favipiravir brand name Ciplenza medical need for Covid-19 treatment mild to moderate symptoms oral anti-viral drug, Cipla, coronavirus treatment, covid treatment durg cipla, cipla covid treatment drug, cipla covid medicine

Indian pharma major Cipla today announced that it has been granted regulatory approval by the DCGI for the launch of Favipiravir under the brand name Ciplenza for treatment of o treat mild to moderate COVID-19 patients. Cipla will commercially launch Ciplenza, a generic version of Favipiravir, in the first week of August priced at ₹68 per tablet.

కరోనా వైరస్ చికిత్సలో సిప్లా నుంచి చౌకైన మందు, ఫవిపిరవిర్.!

Posted: 07/24/2020 11:52 PM IST
Cipla set to launch favipiravir drug for treatment of covid patients

కరోనా వైరస్ మహమ్మారి చికిత్స అంటేనే వేలల్లో ఖర్చు అంటూ గెండెలు పట్టేసుకుంటున్న సామాన్య ప్రజలకు స్వల్ప ఊరట లభించే వార్త వినిపిస్తోంది. ఇక ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లినా లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో భారత ఫార్మా దిగ్గజ సంస్థల్లో ఒకటైన సిప్లా సంస్థ కోవిడ్ రోగులకు శుభవార్తను అందించింది. కరోనా వ్యాధి బారిన పడిన తొలి దశ పేషంట్ల నుంచి వ్యాధి కాసింత తీవ్రంగా వున్న రోగుల వరకు అందరిలోనూ వైరస్ ప్రభావాన్ని తగ్గించడంలో దోహదపడే ఫావిపెరవిర్ జనిరిక్ మెడిసిన్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపింది.

కరోనా వైరస్ ప్రభావిత భాధితుల్లో వైరస్ ను తగ్గించే ఔషధం ఫవిపిరవిర్ ను సిప్లా త్వరలో మార్కెట్ లో ప్రవేశపెట్టనుందని కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) పేర్కొంది. తక్కువ ఖర్చుతో కరోనా ఔషధాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎస్‌ఐఆర్‌ ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. స్ధానికంగా లభ్యమయ్యే రసాయనాలతో ఈ మందును అభివృద్ధి చేసిన సీఎస్‌ఐఆర్‌ ఈ సాంకేతికతను సిప్లాకు బదలాయించింది. ఈ మందు త్వరలో మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని సీఎస్‌ఐఆర్‌ ప్రకటించింది. ఇప్పటికే ఈ మందును తయారు చేసేందుకు తమకు డ్రగ్ కంటోల్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి కూడా అనుమతులు లభించాయని తెలిపింది.

తాము అభివృద్ధి చేసిన సాంకేతికత అత్యంత సమర్థంగా పనిచేస్తుందని, తక్కువ వ్యవధిలోనే ఔషధ తయారీదారులు పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేపట్టేందుకు అనువైందని సీఎస్‌ఐఆర్‌-ఐఐసీఆర్‌ డైరెక్టర్‌ ఎస్‌ చంద్రశేఖర్‌ మండే తెలిపారు. తాజాగా సిప్లా కూడా ఈ ఔషధాన్ని మార్కెట్లోకి తీసుకురానుంది. బెంగళూరుకు చెందిన స్ట్రైడ్స్‌ ఫార్మా ఈ ఔషధాన్ని తయారు చేసినప్పటికీ ఇంకా అనుమతి కోసం ఎదురుచూస్తోంది. కాగా, ఆప్లిమస్‌ ఫార్మాకు ఈ ఔషధాన్ని దేశీయ మార్కెట్లో విక్రయించటానికి, ఎగుమతి చేయటానికి అనుమతి వచ్చింది. ఫవిపిరవిర్‌ ట్యాబ్లెట్‌ తయారీ- విక్రయానికి తమకు కూడా డీసీజీఐ నుంచి అనుమతి వచ్చినట్లు బ్రింటన్‌ ఫార్మా అనే దేశీయ కంపెనీ వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles