3 militants killed in encounter in Kashmir's Shopian జమ్మూ ఎన్ కౌంటర్లో 4 ఉగ్రవాదుల హతం..

3 terrorists killed during encounter in shopians amshipora village in jammu and kashmir

kashmir encounter, shopian encounter, Amshipora encounter, HIzbul Mujahideen, Jaish militants, terror outfit, jammu Police, Army's 62 RR, CRPF

Three militants were killed in an encounter with security forces on Saturday morning in Amshipora village of south Kashmir's Shopian district. The three militants killed in the encounter are believed to belong to the terror outfit Hizbul Mujahideen.

జమ్మూ షోఫియాన్ జిల్లాలో ఎన్ కౌంటర్.. 4 ఉగ్రవాదుల హతం..

Posted: 07/18/2020 06:11 PM IST
3 terrorists killed during encounter in shopians amshipora village in jammu and kashmir

జమ్ము కశ్మీర్ లో ఇవాళ జరిగిన ఎన్ కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. భారత దేశ బలగాలకు ఉగ్రవాదులకు జరిగిన ఎదురు కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ గ్రూపుకు చెందిన నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. దక్షిణ కాశ్మీర్ లోని షోపియాన్‌ జిల్లా అమ్షీపురా ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్‌ జరిగింది. షోపియాన్ జిల్లా కేంద్రానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్షీపురా గ్రామంలో ఉగ్రవాదులు నక్కివున్నారన్న పక్కా సమాచారం అందుకున్న భారత భద్రతా దళాలు అమ్షీపురా గ్రామంలో కార్డన్ సర్చ్ చేపట్టి.. గాలింపు చర్యలు చేపట్టాయి.

సైనికుల రాకను పసిగట్టిన ఉగ్రమూకలు వారి నుంచి తప్పించుకునే క్రమంలో సైనికులపైకి కాల్పులకు తెగబడ్డాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన సైనికులు ఎదురుకాల్పులు జరపడంతో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకా ఆప్రాంతంలో గాలింపు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. జమ్మూకాశ్మీర్ పోలీసులు, ఆర్ఆర్ బలగాలతో పాటు సీఆర్పీఎప్ బలగాలు ఈ ఎన్ కౌంటర్లో పాల్గోన్నాయని అధికారులు తెలిపారు. ఆర్మీ చనిపోయిన ఉగ్రవాదుల వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

కాగా ఆర్మీ అధికారులు మాట్లాడుతూ గత 24 గంటల వ్యవధిలో జమ్మూకాశ్మీర్లో జిల్లాలో జరిగిన రెండో ఎన్ కౌంటర్ ఇదని చెప్పారు. గడిచిన 24 గంటల్లో జమ్మూకాశ్మీర్ లోని కుల్గామ్ జిల్లాలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎదరుకాల్పుల్లో ముగ్గరు జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదలు హతమయ్యారు. నిన్న కుల్గామ్ జిల్లాలో జైష్ ఏ మహమ్మద్ కు చెందిన ఉగ్రవాదులు ఓ ప్రాంతంలో తలదాచుకున్నారన్న పక్కా సమాచారంతో భారత బలగాలు గాలింపు చర్యలు చేపట్టగా, వారిపై కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేశారు ఉగ్రవాదులు. భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమై వారిని హతమార్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kashmir encounter  shopian encounter  HIzbul Mujahideen  militants  jammu Police  CRPF  

Other Articles

Today on Telugu Wishesh