Ravi Prakash Gets Anticipatory Bail టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ కు ముందస్తు బెయిల్

Tv9 former ceo ravi prakash gets anticipatory bail in ed case

High Court, Ravi Prakash, Enforcement Directorate, anticipatory bail

In a sort of relief for V Ravi Prakash, former chief executive officer of popular Telugu television channel TV9, the Telangana high court on Friday granted anticipatory bail to him in connection with a case filed by Enforcement Directorate authorities. The high court felt that there were too many cases field against Ravi Prakash by different agencies with regard to single issue.

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ కు ముందస్తు బెయిల్

Posted: 07/17/2020 09:07 PM IST
Tv9 former ceo ravi prakash gets anticipatory bail in ed case

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కు ఊరట లభించింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసులో రవిప్రకాశ్ కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. రవిప్రకాశ్ పై ఒక్కటే కేసుకు సంబంధించిన పలు కేసులు నమోదయ్యాయని భావించిన న్యాయస్థానం ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులలో ఆయనపై విచారణ కొనసాగాలని అభిప్రాయపడిన న్యాయస్థానం అందుకు ఆయన అరెస్టు అవసరం లేదని కూడా తేల్చిచెప్పింది. టీవీ 9 సంస్థ నుంచి అక్రమంగా నిధులను డ్రా చేసి మళ్లించారన్న అరోపణలపై రవిప్రకాశ్‌ సహా మరో ఇద్దరు టీవీ 9మాజీ ఉద్యోగులపై కేసులు నమోదయ్యాయి.

రవిప్రకాశ్, మరో ఇద్దరు టీవీ9 మాతృ సంస్థ అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ నుంచి 2018 సెప్టెంబర్‌ నుంచి 2019 మే వరకు రూ.18 కోట్ల నిధులను అనుమతుల్లేకుండా ఉపసంహరించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు గతంలో బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2019  అక్టోబర్‌లో కేసు నమోదైంది. దాని ఆధారంగా ఈడీ వర్గాలు ఎన్ ఫోర్స్ మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఈసీఐఆర్‌) నమోదు చేశాయి.  కేసులో తనను అరెస్టు చేయకుండా బెయిల్‌ మంజూరు చేయాలని రవిప్రకాశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. రూ.లక్ష చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని, ప్రతి శనివారం ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాలని షరతు విధించింది. దర్యాప్తు కొనసాగించవచ్చునని ఈడీకి హైకోర్టు అనుమతిచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High Court  Ravi Prakash  Enforcement Directorate  anticipatory bail  

Other Articles