Rare bird sighted for the first time in Telangana కాగజ్ నగర్ అడవుల్లో అరుదైన విహంగం.. 'రూఫస్ బెల్లీడ్'

Telangana a rare eagle spotted in kagaznagar forest division

Kagaznagar Forest, Rare Eagle, penchikalpet forest, nallamala forest, kumaram bheem district, juvenile Rufous bellied eagle, Telangana

The sighting of a Rufous-bellied eagle at Palarapu cliff in Kagaznagar forest division left bird watchers and wildlife enthusiasts excited since the eagle has been spotted for the first time in Telangana.

కుమరం భీం అడవుల్లో అరుదైన విహంగం.. ‘రూఫస్ బెల్లీడ్‘

Posted: 07/15/2020 12:58 AM IST
Telangana a rare eagle spotted in kagaznagar forest division

ప్రకృతిలో ఎన్నో అరుదైన జంతువులు, పక్షులు, పూల మొక్కలు, కీటకాలు ఉంటాయి. రూపంలో కొన్ని అందంగా ఉంటే.. మరికొన్ని భయానకంగా ఉంటాయి. పక్షి జాతిలో ఎన్నో రకాల పక్షలు మనం చూస్తుంటాం.. అప్పుడప్పుడు మన కంటికి కనిపించని అరుదైన పక్షులు కూడా తారసపడుతుంటాయి. ఇక సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఈ తరహా అందాలు ఎన్నో చూస్తున్నాం. తాజాగా తెలంగాణలోని కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో అరుదైన విహాంగం దర్శనమిచ్చింది. ఇధి గద్ద జాతికి చెందిన రూఫస్ బెల్లీడ్ అనే అరుదైన పక్షిగా గుర్తించారు.

దీనికి పొడవైన రెక్కలు, తోకతో ఆకర్షించేలా ఉన్న ఈ పక్షి జిల్లాలోని పెంచికల్‌పేట మండలం నందిగాం అటవీ ప్రాంతంలోని పాలరాపుగుట్ట ప్రాంతంలో కనిపించింది. ఈ అరుదైన పక్షిని వీక్షించగానే స్థానిక అటవీ అధికారులు వెంటనే దానిని కెమెరాల్లో బంధించారు. తెలంగాణ ప్రాంతానికి ఈ పక్షి వలస రావడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. సాధారణంగా ఎక్కువ పచ్చదనం వున్న ప్రాంతాల్లోనే ఈ జాతి పక్షలు వుంటాయి. అటు కేరళ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని నల్లమల అడవుల్లో ఆవాసం ఏర్పర్చుకునే ఈ విహాంగం ఏకంగా తెలంగాణకు రావడం ఇక్కడి పచ్చని సంపద వృద్ది చెందిందని చెప్పేందుకు సంకేతంగా పరిగణిస్తున్నారు అధికారులు.

అంతేకాదు ఈ తరహా పక్షులు చాలా అరుదుగా ఉంటాయని.. తెలంగాణ ప్రాంతానికి ఈ పక్షి వలస రావడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. ఈ పక్షులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లితోపాటు అసోం, పశ్చిమ కనుమలలో కనిపిస్తుంటాయని పెంచికల్‌పేట అటవీ రేంజ్ అధికారి వేణుగోపాల్ తెలిపారు. ఈ రూఫస్ బెల్లీడ్ పక్షి పిల్ల అని.. రూపస్ బెల్లీడ్ అడల్ట్ పక్షుల్లో రెక్కలు మరింత దట్టంగా వుంటాయని చెప్పారు. ఈ పక్షులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లితోపాటు అసోం, పశ్చిమ కనుమలలో కనిపిస్తుంటాయని తెలిపారు. కాగా.. సంతానాన్ని అభివృద్ధి చేసుకోవటానికి..ఆహారం సమృద్ధిగా ఉండటం కోసం..వాతావరణ అననుకూలత నుంచి తప్పించుకోవడం కోసం పక్షలు వలసలు వెళ్లటం సర్వసాధారణం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles