Sachin Pilot welcome to join, say BJP రాజస్థాన్ రాజకీయం: సచిన్ పైలట్ ఉద్వాసనకు అమోదం.! బీజేపి గాలం

Rajasthan government crisis meeting of ministers at gehlots residence concludes

Sachin Pilot sacked, Sachin Pilot BJP, Ashok Gehlot status, rebellion in Rajasthan, Rajasthan Congress crisis, Rajasthan floor test, Rajasthan Assembly, Gulab Chand Kataria, Rajasthan political crisis, Sachin Pilot loyalist MLAs, Sachin Pilot loyalist MLAs Manesar, Ashok Gehlot loyalist MLAs, Ashok Gehlot loyalist MLAs Jaipur, Sachin Pilot, Ashok Gehlot, loyalist MLAs, Manesar, Haryana, Jaipur, Rajasthan, Congress, Politics

Amid the deepening political crisis in Rajasthan, Deputy Chief Minister Sachin Pilot removed from the post of Rajasthan Deputy Chief Minister and Rajasthan Congress chief. Chief Minister Ashok Gehlot accused the BJP of conspiring against his government.

రాజస్థాన్ రాజకీయం: సచిన్ పైలట్ ఉద్వాసనకు అమోదం.! బీజేపి గాలం

Posted: 07/15/2020 12:51 AM IST
Rajasthan government crisis meeting of ministers at gehlots residence concludes

రాజస్థాన్ లోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం రసకందాయంలో పడింది. రాష్ట్రంలో రాజకీయం సంక్షోభం గంట గంటకూ మారుతోంది. రాజస్థాన్ ఉఫముఖ్యమంత్రి సచిన్ పైలైట్ తన వర్గం ఎమ్మెల్యేలకు చెందిన వీడియోను రాజస్తాన్ పర్యాటక శాఖ మంత్రి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేసిన వెంటనే ఆయనను ఉపముఖ్యమంత్రిగా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి పదవుల నుంచి తప్పించింది. అబ్బే నేను కాంగ్రెస్ పార్టీ గురించి ఓ చిన్న మాట కూడా వ్యతిరేకంగా అనకుండానే ఇలా జరిగిందేంటి అని అనడం సచిన్ పైలట్ వంతైంది. ఇంతలో ఆయన ఉద్వాసనను కూడా గవర్నర్ అమోదించడం కూడా జరిగిపోయింది. ఇలా ఒకదాని తరువాత మరోకటి శరవేగంగా కదులుతున్నాయి.

ఇవాళ సచిన్ పైలెట్ వర్గం నుంచి కుటుంబం (ఫ్యామిలీ) అన్న క్యాప్షన్ తో 15 ఎమ్మెల్యేలతో కూడిన వీడియోను రాజస్థాన్ పర్యాటక శాఖ మంత్రి విశ్వేందర్ సింగ్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేసిన తరువాత రాజస్థాన్ రాజకీయాలు పరిణమాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వర్గం అధిష్టానం అశీస్సులతో సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన సచిన్‌కు ఉద్వాసన పలుకుతూ తీర్మానం చేసిన తర్వాత గహ్లోత్‌ నేరుగా గవర్నర్‌ నివాసానికి చేరుకున్నారు. అక్కడ సచిన్‌, మంత్రులను తొలగించాలనుకుంటున్న నిర్ణయాన్ని ఆయనకు తెలియజేశారు. సీఎం అశోక్‌ గహ్లోత్‌ ప్రతిపాదనకు గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా ఆమోదం తెలిపారు. అలాగే ఇద్దరు మంత్రులు విశ్వేందర్‌ సింగ్‌, రమేశ్‌ మీనాల తొలగింపునకు కూడా ఆమోదముద్ర వేశారు.

అంతకుముందు మీడియాతో మాట్లాడిన గహ్లోత్‌.. ‘‘చివరకు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఈ కుట్ర ఆరు నెలలుగా జరుగుతోంది. ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసేందుకు భాజపా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. దేశవ్యాప్తంగా భాజపా ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిదికాదు. 30 మంది ఎమ్మెల్యేలు కలిసి పార్టీని ఏర్పాటు చేయలేరు. పార్టీ ఫిరాయింపుల చట్టం ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి’’ అంటూ పరోక్షంగా తిరుగుబాటు ఎమ్మెల్యేలను హెచ్చరించే ప్రయత్నం చేశారు. ఇక సచిన్‌ వర్గంలోని రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు ముకేశ్‌ భాకర్ ను కూడా పదవి నుంచి తొలగించారు. పార్టీ అంతర్గత ఎన్నికల్లో గెలిచి పదవిలోకి వచ్చిన తనను గహ్లోత్‌ ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు.

సచిన్ ఫైలట్ వర్గానికి బీజేపి గాలం..!

 

సచిన్‌ పైలట్ ఢిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర కాంగ్రెస్‌ తీర్మానించిన మరుక్షణం ఆయనపైకి బీజేపి గాలం విసిరింది. సచిన్‌ పైలట్ ను‌ బీజేపీలోకి ఆహ్వానిస్తున్నట్లు ఆ పార్టీ నేత ఓం మథూర్‌ ప్రకటించారు. అంతేకాకుండా బీజేపి విధానాలు నచ్చినవారు ఎవరైనా పార్టీలోకి రావొచ్చని ఆయన‌ స్పష్టంచేశారు. అయితే ముఖ్యమంత్రి గహ్లోత్‌ తనకు సంపూర్ణ మద్దతు ఉందని ప్రకటించిన నేపథ్యంలో అసెంబ్లీలో బలనిరూపణ ద్వారా తన మెజారిటీని నిరూపించుకోవాలని మథూర్‌ సూచించారు. రాజస్థాన్‌ ప్రభుత్వంలో ఏర్పడిన సంక్షోభం సమయంలో బీజేపి బహిరంగంగా స్పందించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles