Sachin Pilot camp releases video of loyalist MLAs తన వర్గం ఎమ్మెల్యేలతో సచిన్ పైలట్ వీడియో..!

Sachin pilot camp releases video of loyalist mlas relaxing in hotel as rajasthan crisis intensifies

Rajasthan political crisis, Sachin Pilot loyalist MLAs, Sachin Pilot loyalist MLAs Manesar, Ashok Gehlot loyalist MLAs, Ashok Gehlot loyalist MLAs Jaipur, Sachin Pilot, Ashok Gehlot, loyalist MLAs, Manesar, Haryana, Jaipur, Rajasthan, Congress, Politics

Amid the deepening political crisis in Rajasthan, Deputy Chief Minister Sachin Pilot's camp on Monday (July 13) released a video of around 15 MLAs relaxing at a hotel in Haryana's Manesar. The 10-second video was released by Pilot camp hours after the Congress announced a second legislature party meet

రాజస్థాన్ లో రాజకీయ క్రీడ.. తన వర్గం ఎమ్మెల్యేలతో సచిన్ పైలట్ వీడియో..!

Posted: 07/14/2020 02:15 PM IST
Sachin pilot camp releases video of loyalist mlas relaxing in hotel as rajasthan crisis intensifies

రాజస్థాన్ లోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంలో అలజడి రేగుతోంది. రాష్ట్రంలో రాజకీయం సంక్షోభం గంట గంటకూ మారుతోంది. కాంగ్రెస్ యువనేతల భుజాలపై తుపాకులు పెట్టి.. కాంగ్రెస్ అధిష్టానంతో పాటు ప్రభుత్వాలను బీజేపి టార్గెట్ చేస్తోందన్న అరోపణలు రావడంతో దాన్ని బీజేపి ఖండించేకన్నా ముందుగానే రాజస్థాన్ ఉఫముఖ్యమంత్రి సచిన్ పైలైట్ ప్రకటన చేశారు. తాను బీజేపీలో చేరడం లేదని ప్రకటించిన ఆయన.. ముఖ్యమంత్రి బలం, బలగాన్ని టార్గెట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తనకంటూ ఓ వర్గం వుందని వారి మద్దతుతో ప్రభుత్వాన్ని కూల్చుతానని సవాల్ విసురుతున్నారు.

ఈ మేరకు తన వర్గం ఎమ్మెల్యేలతో ఓ వీడియోను విడుదల చేశారు. తనతో కలిసి వచ్చేందుకు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పిన పైలట్ విడుదల చేసిన ఈ వీడియోలో 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కనిపిస్తుండడం గమనార్హం. పైలట్ కార్యాలయం విడుదల చేసిన ఈ వీడియోలో సచిన్ కూడా కనిపించలేదు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రస్తుతం హర్యానాలోని మనేసర్ లో ఓ రిసార్ట్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సచిన్ పైలట్ వర్గం బలం తక్కువగా వుందని.. ప్రభుత్వానికి ఢోకా మాత్రం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే తన వర్గం తనకుందని, తనకు 30 మంది ఎమ్మెల్యేలు మద్దుతు వుందని సచిన్ వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది.

మరోవైపు, సచిన్ ఫైలట్ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి.. తన వర్గం ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలు నడిపినా.. తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని అశోక్ గెహ్లాట్ వర్గం ప్రకటించింది. తమ ప్రభుత్వానికి 109 మంది ఎమ్మెల్యేల మద్దతు వుందని తేల్చిచెప్పింది. ఈ మేరకు వారంతా నిన్న జరిగిన సీఎల్పీ సమావేశానికి హాజరయ్యారని కూడా ముఖ్యమంత్రి గెహ్లాట్ వర్గం ప్రకటించింది. గెహ్లాట్ వర్గ ఎమ్మెల్యేలు జైపూర్‌ శివారులో ఉన్న రిసార్టులో మకాం వేశారు. ఇవాళ అక్కడే మరోమారు సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. నిన్న జరిగిన సమావేశానికి డుమ్మా కొట్టిన పైలట్, ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు మాత్రం ఈ సమావేశానికి హాజరు కావడం అనుమానమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles