High Court orders to stop demolition of old Secretariat పాత సచివాలయం భవనం కూల్చివేత ఆపండి: హైకోర్టు

High court orders to stop demolition of old telangana secretariat complex

telangana secretariat, secretariat hyderabad, secretariat telangana, hyderabad secretariat, telangana new secretariat, new secretariat telangana, outer ring road hyderabad, new secretariat, Telangana Secretariat new building, Secretariat new building design, Telangana Secretariat, TS new Secretariat building, Telangana new Secretariat building design

After hearing the Public Interest Litigation petition, which was filed two days ago, against the demolition work of old secretariat building complex, the Telangana High Court orders the state officials to stop the demolition work.

పాత సచివాలయం భవనం కూల్చివేత ఆపండి: హైకోర్టు

Posted: 07/10/2020 02:11 PM IST
High court orders to stop demolition of old telangana secretariat complex

తెలంగాణకు కొత్త సచివాలయ భవనాన్ని నిర్మించాలని తలపెట్టిన కేసీఆర్ ప్రభుత్వం గత ఏడాది జూన్ 17న శంఖుస్థాపన చేసిన నాటి నుంచి అడ్డంకులు తగులుతూనే వున్నాయి. ఇక తాజాగా పాత సచివాలయాన్ని కూల్చేందుకు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు నుంచి అనుమతులు లభించడంతో పాత సెక్రటేరియట్ భవన కూల్చివేత పనులు యుద్ద ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో మరోమారు అడ్డంకులు ఏర్పడ్డాయి. రాష్ట్రోన్నత న్యాయస్థానం తెలంగాణ పాత సచివాలయ భవనాల కూల్చివేత పనులను నిలిపివేయాలని తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. అయితే సోమవారం వరకు మాత్రమే ఈ పనులను నిలిపివేయాలని న్యాయస్థానం అదేశాలు జారీ చేసింది.

అయితే, పాత సచివాలయ భవనాల కూల్చివేత పనులు నిలిపి వేయాలని ఈ రోజు హైకోర్టులో మరో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లైంది. కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ భవనాలను కూల్చివేస్తున్నారని  ప్రొఫెసర్ పీఎల్‌ విశ్వేశ్వరరావు హైకోర్టులో లంచ్ మోషన్ పిల్ దాఖలు చేశారు. దీని వ‌ల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడి,  ఆ ప్రాంతంలో దాదాపు ల‌క్ష‌ల మంది పీల్చే స్వ‌చ్ఛ‌మైన గాలి కలుషితం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధ‌న‌ల‌ను ప‌ట్టించుకోకుండా భవనాలను కూల్చివేస్తున్నారని చెప్పారు. ఈ పిటీషన్ పై ఇవాళ విచారించిన న్యాయస్థానం సోమవారం వరకు తాత్కలికంగా కూల్చివేత పనులు నిలిపివేయాలని అదేశాలు జారీ చేసింది.

పిఎల్ విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటీషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన అనుమతుల నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆదివారం అర్థరాత్రి నుంచే కూల్చివేత పనులు ప్రారంభించింది. సచివాలయం వైపు వెళ్లే అన్ని మార్గాలను మూసివేసి వాహనాలను మళ్లించారు. ఏకంగా సెక్రటేరియట్ నుంచి కిలో మీటరు పరిధి వరకు పోలీసుల అంక్షలు కొనసాగుతున్నాయి. కాగా తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పనులు నిలిచిపోనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles