Gangster Vikas Dubey Encountered by police ఎన్ కౌంటర్లో గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే హతం..

Gangster vikas dubey killed while trying to flee custody says up police

vikas dubey, vikas dubey dead, up encounter, up shooting, uttar pradesh, ujjain, social media, kanpur, bikash dubey, vikas, vikas dubey kanpur, vikas dubey arrested, vikas dubey wife, vikas dubey history, stf full form, faridabad, kanpur encounter, uttar pradesh, crime

Gangster Vikas Dubey, accused of shooting dead eight policemen in Kanpur's Bikru village last week, was on Friday morning shot dead, allegedly in an exchange of fire with the police, while being brought to Uttar Pradesh from Ujjain in Madhya Pradesh, a police officer said in Kanpur.

గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే హతం.. పారిపోతుండగా ఎన్ కౌంటర్..

Posted: 07/10/2020 12:22 PM IST
Gangster vikas dubey killed while trying to flee custody says up police

కరడుగట్టిన నేరగాడు, గ్యాంగ్ స్టర్, ఎనమిది మంది పోలీసులను హతమార్చిన కేసులో నిందితుడైన వికాస్‌ దూబే నేరచరిత్రకు పోలీసులు చరమగీతం పాడారు. రోడ్డు ప్రమాద ఘటనను అదనుగా చేసుకుని పారిపోబోయిన వికాస్ దూబేను పోలీసులు ఎన్ కౌంటర్లో హతమార్చారు. గురువారం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిన్‌ నగరంలో పట్టుబడ్డ గ్యాంగ్ స్టర్ వికాస్‌ దూబేను ఉత్తర్ ప్రదేశ్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కాన్పూర్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో పోలీసుల వాహనంలో ఒకటి బోల్తా పడింది. యాధృచికంగా జరిగిన ఈ ఘటనను అదునుగా తీసుకున్న వికాస్ మరోసారి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశారు. పోలీసుల బృందంలోని ఓ పోలీసు నుంచి తుపాకీని లాక్కుని పారిపోయేందుకు యత్నించడంతో అతన్ని పోలీసులు మట్టుబెట్టారు.

ఈ ఘటన కాన్పూర్ లో చోటుచేసుకుంది. వికాస్ దూబేను లొంగిపోవాలని పోలీసులు చేసిన వినతులు ఫలించలేదు. పోలీసుల అదేశాలను, సూచనలను కూడా పట్టించుకోలేదు, పోలీసులు అతడ్ని నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టినా బేఖాతరు చేసిన వికాస్ దూబే.. ఓ పోలీసు అధికారి నుంచి లాక్కున్న తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరపడంతో.. గత్యంతరం లేని పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా ఎదురు కాల్పులు జరపారు. దీంతో వికాస్ దూబేకు రెండు బులెట్లు తగిలాయి. హుటాహుటిన ఆయనను అసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వికాస్ దూబే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా కారు బోల్తా పడ్డ ఘటనలో నలుగురు పోలీసులు గాయపడ్డట్లు కాన్పూర్‌ ఐజీ మోహిత్‌ అగర్వాల్‌ తెలిపారు.

ఈ కేసులో ఇప్పటికే దూబే అనుచరులు కార్తికేయ, ప్రవీణ్‌ అలియాస్‌ బౌవా దూబే గురువారం పోలీసుల ఎన్ కౌంటర్లో హతమయ్యారు. కార్తికేయను బుధవారం అరెస్టు చేశారు. అతడిని ట్రాన్సిట్‌ రిమాండ్‌పై కాన్పుర్‌ తీసుకొస్తున్నప్పుడు మార్గమధ్యంలో వాహనం టైరు పంక్చరైందని కాన్పూర్ జిల్లా ఎస్సీ తెలిపారు. ప్రవీణ్ ను ఇటావా వద్ద జరిగిన ఒక ఎన్ కౌంటర్లో పోలీసులు హతమార్చారు. మొత్తం మీద కాన్పూర్‌ సమీపంలోని బిక్రులో ఎనిమిది మంది పోలీసులు హతమైన నాటి నుంచి వికాస్‌ దూబేతో సహా ఈ కేసుతో సంబంధం ఉన్న ఆరుగురు హతమయ్యారు. అరెస్టుకు ముందుకు వికాస్‌ దూబే పోలీసులకు చిక్కకుండా ముప్పు తిప్పలు పెట్టాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles