man duped on sale of luxury car at cheapest rate లగ్జరీ కారు కోసం వెళ్లి బుట్టలోపడ్డ వ్యాపారవేత్త.. 3 నెలలకు షాక్.!

Man promised mercedes for rs 2 lakh realised he was duped after 3 months

mercedes benz at rs 2 lakh, mercedes sale, luxury car at cheap rate, bengaluru man duped for 2 lakhs, Khaleel, Khalil sharif, Khaleel shareef, Coronavirus, covid 19, lockdown, Dastagir, Khaleel shareef, mercedez benz, luxury car, bangalore, karnataka, crime

A Bengaluru-based man, wanting to purchase a high-end luxurious automotive at a comparatively cheaper price obtained duped by a fraud. Even when he didn’t get supply of the promised Mercedes after paying Rs 78,000, he waited for 3 months, pondering the vendor was caught up due to the lockdown.

లగ్జరీ కారు కోసం వెళ్లి బుట్టలోపడ్డ వ్యాపారవేత్త.. 3 నెలలకు షాక్.!

Posted: 07/09/2020 11:12 PM IST
Man promised mercedes for rs 2 lakh realised he was duped after 3 months

ఆశ పడితే తప్పులేదు.. కానీ అత్యాశకు పోతే మాత్రం ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఆనేక సందర్భాల్లో అరచేతిలో వైకుంఠం చూపిన కేటుగాళ్లు పంగానామాలు పెట్టి మరీ బొమ్మ చూయిస్తుంటారన్న విషయం తెలిసిందే. అయినా జాగ్రత్తగా వ్యవహరించకుండా ముందుకెళ్తే.. ఉన్నది పోయే.. ఉంచుకున్నది పోయే అన్న పరిస్థితులు ఉత్పన్నం కాక తప్పదని మరోమారు కూడా రుజువైంది. ఈ రోజుల్లో సాధారణమైన కారు కోనాలంటేనే ఏకంగా లక్షలు వెచ్చించాల్సిందే. అదే లగ్జరీ కారు అంటే ఇక లక్షల్లో ఖర్చుచేయాల్సిందే. కానీ కేవలం రెండు మూడు లక్షల రూపాయలకే అత్యంత ఖరీదైన లగ్జరీ కారు సొంతం అవుతుందంటే.. అదెలా అని అలోచించాల్సింది పోయి.. గుడ్డిగా నమ్మి చేతిలో డబ్బులు పోశాడు.

ఆనక విషయం తెలిసి నాలుక కరుచుకున్నా తన చేజారిన లక్ష్మిని తిరిగి పోందడం ఎంత కష్టమో తెలియనిది కాదు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. ఓ వ్యక్తి కొత్త లగ్జరీ కారు కొనేందుకు చూస్తూ ఓ మోసగాడి చేతిలో చిక్కి శల్యమయ్యాడు. ఔరా అని అలోచించకుండా.. దొరికిందే ఛాన్స్ అంటూ కారుచౌకగా మంచి లగ్జరీ కారు వస్తుందని, తన చేజారి పోతుందేమోనని అడ్వాన్స్ అమౌంట్ అంటూ భారీగా ముట్టజెప్పాడు. మోసం చేసేవాడు తన పెట్టుబడిగా పెట్టే మాయమాటలతో బుట్టలో పడ్డాడు. అరుదైన అవకాశం.. ఇది తొలగినన్ దోరకదు అనుకున్నాడు. అయితే లాక్ డౌన్ కారణంగా మూడు నెలల పాటు వేచి చూసిన తరువాత కానీ అతనికి తాను మోసపోయానన్న విషయం అర్థం కాలేదు.

బెంగళూరులోని జీవన్ బీమానగర్ లోని గ్యారేజి, సర్వీస్ స్టేషన్ కు తరచూ వస్తూవుండే ఖలీల్ షరీప్.. తనకు మంచి లగ్జరీ కారు కావాలని చెప్పాడు. ఇంతలో అదే గ్యారేజి యజమాని బంధువుగా పరిచయమైన దస్తగిర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దాంతో తన వద్దనున్న లగ్జరీ కారును విక్రయిస్తున్నానని మాటల్లో చెప్పాడు. తన వద్దనున్న 2006 మోడల్ కు చెందిన మెర్సడీజ్ బెంజ్ కారును అత్యంత చౌకగా కేవలం రెండు లక్షల పాతిక వేలకు బేరం పెడుతున్నానని చెప్పాడు. అరే అదెలా.. తనకు విషయం ఎందుకు చెప్పలేదని, గ్యారేజీ ఓనర్ పై అసహనం వ్యక్తం చేసిన ఖలీల్ షరీప్.. తాను లగ్జరీ కారు కోసం తిరుగుతున్నాని చెప్పాడు.

దీంతో కారు బేరంపై ఇద్దరూ మాట్లాడుకున్నారు. మార్కెట్లో తన కారుకు మంచి ధర వస్తున్నా కాసింత డబ్బు అవసరం వుండటంతో తాను తక్కువ ధరకే విక్రయిస్తున్నానని నమ్మబలికాడు. తనకు ప్రస్తుతం రూ.2.25లక్షలు అవసరమని చెప్పాడు. కాసేపటి వరకూ ఇద్దరి మధ్య బేరసారాలు జరిగాయి. మొత్తానికి కారును చూడకుండానే రూ.2లక్షలకు మెర్సిడిజ్ బెంజ్ కారు భేరాన్ని ఖాయం చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా కారు కొనుగోలుకు అడ్వాన్స్ గా గూగుల్ పేలో మార్చి 11న రూ.78వేల అడ్వాన్స్ ఇచ్చాడు. రెండ్రోజుల్లో కారు ఇచ్చేస్తానని చెప్పిన దస్తగిర్ ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది.

లాక్ డౌన్ ముగిసేంత దస్తగిర్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అందలేదు. మూడు నెలల లాక్ డౌన్ తర్వాత షరీఫ్ గ్యారేజి వద్దకు వెళ్లి దస్తగిర్ గురించి ఎంక్వైరీ చేశాడు. తన వద్ద నుంచి అడ్వాసుగా డబ్బులు తీసుకుని కూడా కారును తనకు అప్పగించలేదని.. పైగా గత మూడు నెలలుగా కనీసం ఫోన్ కూడా స్విచ్ఛాప్  చేశాడని నిలదీశాడు. దీంతో ఖలీల్ షరీఫ్ చెప్పినదంతా విన్న గ్యారేజీ ఓనర్ తాను దస్తగిర్ నుంచి డబ్బులు తిరిగి ఇప్పించేస్తానని హామీ ఇచ్చి పంపించేశాడు. మరో వారం రోజుల తరువాత వచ్చినా దస్తగిర్ రాలేదన్న సమాధానమే వినిపించడంతో.. తాను మోసపోయానని గ్రహించిన ఖలీల్ షరీఫ్ .. గ్యారేజీ ఓనర్ చెప్పినా.. అతనిపై కూడా నమ్మకం కుదరకపోవడంతో పోలీసులకు పిర్యాదు చేశాడు. దీంతో దస్తగిర్ చేతిలో తాను కొత్తగా మోసపోలేదని.. తన నెంబర్ 30 అని, తనకన్నా ముందుగా ఏకంగా 29 మంది మోసపోయారని తెలుసుకుని విస్మయం వ్యక్తం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Coronavirus  covid 19  lockdown  Dastagir  Khaleel shareef  mercedez benz  luxury car  bangalore  karnataka  crime  

Other Articles