Telangana intermiediate supply exams cancelled తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ విద్యార్థులకు గుడ్ న్యూస్..

Ts inter supply exams 2020 cancelled all second year students pass

Education News,TS supplementary examinations,TS Marks memo by July 31,Telangana supplementary examinations cancelled,Telangana supplementary examinations, Supplementary examinations, Telangana inter, supplementary examinations, Re correction, Re counting, sabita indrareddy, TS Marks memo, Inter board

The Telangana state government on Thursday announced the canncellation of second-year intermediate public advanced supplementary examinations (IPASE). The move would benefit 1.47 lakh students, who have failed in the intermediate public examination (IPE) held in March 2020.

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ విద్యార్థులకు గుడ్ న్యూస్..

Posted: 07/09/2020 11:03 PM IST
Ts inter supply exams 2020 cancelled all second year students pass

కరోనా మహమ్మారి కారణంగా పరీక్షలు రద్దు కావడంతో పాటు విద్యార్థులు పై క్లాసులకు ప్రమోట్ అయిపోతున్నారు. పదోతరగతి పరీక్షలు లేకుండానే పాస్ అయినట్లుగా కన్ఫామ్ చేసిన తెలంగాణ విద్యాశాఖ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడిచిన బాటలోనే తెలంగాణ సర్కార్ కూడా పయనిస్తోంది. తాజాగా తీసుకున్న కీలక నిర్ణయమేంటంటే.. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రద్దు చేసింది. ఈ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులందరినీ పాస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు విద్యా శాఖమంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు పరీక్షలు రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. మార్చి 2020లో జరిగిన ద్వితీయ సంవత్సర పరీక్షలో ఫెయిల్‌ అయిన విద్యార్థులందరినీ పాస్‌ చేస్తున్నట్లు మంత్రి ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉత్తీర్ణులైన వారు కంపార్ట్ మెంట్లో ఉత్తీర్ణులైనట్లుగా మార్కుల జాబితాలో పేర్కొంటామని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల 1.47 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. మార్కుల మెమోలను జులై 31 తర్వాత సంబంధిత కళాశాలల్లో పొందొచ్చని మంత్రి తెలిపారు. అయితే రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఫలితాలను పది రోజుల తర్వాత అందజేస్తామని మంత్రి పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles