HPC nails LG Polymers management for serious lapses విశాఖ గ్యాస్ లీక్: యాజమాన్య నిర్లక్షం.. మానవ తప్పిదం

High power committee nails lg polymers management for serious lapses

coronavirus, covid-19, LG Polymers, YS Jagan, RR Venkatapur, High power committee, Kurnool District, Andhra Pradesh, Crime

The high-power committee, which submitted a 350-page report on Monday to Chief Minister Jagan Mohan Reddy, nailed the LG Polymers for human negligence and security lapses that led to the gas leak killing 13 people and hundreds hospitalised.

విశాఖ గ్యాస్ లీక్.. యాజమాన్య నిర్లక్షం.. మానవ తప్పిదం: హైపవర్ కమిటీ నివేదిక

Posted: 07/06/2020 09:12 PM IST
High power committee nails lg polymers management for serious lapses

విశాఖపట్నం జిల్లాలోని ఆర్ఆర్ వెంకటాపుర్ వద్ద నెలకోన్న ఎల్జీ పాలిమర్స్ గ్యాస్‌ లీక్‌ ఘటన సృష్టించిన విషాదం ఇంకా అక్కడి వారిని వీడటం లేదు. ఇప్పటికీ ఈ ఘటనలో బాధితులుగా వున్న వందలాది మంది స్థానికులు అరోగ్య సమస్యలను ఎదుర్కోంటున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ నుంచి పరిశ్రమలకు పరిమిత సంఖ్యలో కార్మికులతో విధులు నిర్వహించుకునేందుకు అనుమతులు లభించగానే.. ఈ పరిశ్రమలో పనులు ప్రారంభించేందుకు సిద్దమవుతున్న క్రమంలో మే 7న ఈ దుర్ఘటన చోటుచేసుకుని ఏకంగా 13 మంది స్థానికులు మరణించడంలో హృదయాన్ని కలచివేసింది. ఈ ఘటనపై స్థానికంగా తీవ్రఎత్తున దుమారం రేగింది.

ఈ దుర్ఘటనలో వందలాది మంది అసుపత్రి పాలయ్యారు, అయితే వీరికి కూడా అనారోగ్య సమస్యలు జీవితాంతం వెల్లువెత్తే అవకాశాలు వున్నాయన్న వారిలో తీవ్ర అంధోళన నెలకోంది. ఈ నేపథ్యంలో ఎల్జీ పాలిమర్స్ ఘటనపై నియమించిన హైపవర్‌  కమిటీ తన నివేదికను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి సమర్పించింది. ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీక్‌ ఘటన తీరు, కారణాలపై కమిటీ విచారణ జరిపింది. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులతో కూడిన నివేదికను హైపవర్‌ కమిటీ సీఎం జగన్‌కు అందజేసింది. ఎల్జీ పాలీమర్స్ ఘటనలో మానవ తప్పిదాలతో పాటు భద్రతా లోటుపాట్లు కూడా కారణంగా తేల్చింది.

అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి నీరబ్ కుమార్ నేతృత్వంలోని కమిటీ ఈ దుర్ఘటనలో సీఎం జగన్ కు 350 పేజీల నివేదికను సమర్పించింది. సంస్థలో పలు చోట్ల భద్రతా లోటుపాట్లతో పాటు ప్రమాదం జరిగిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తచర్యలపై కూడా ఎలాంటి అవగాహన కల్పించకపోవడం కూడా యాజమాన్య తప్పిదమేనని కమిటీ తేల్చింది, ఈ క్రమంలో పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో లీకైన స్టెరైన్ గ్యాస్.. ఎక్సో థరమిక్ రియాక్షన్ వల్ల ఉత్పన్నమైందని అన్నారు, దీంతో అది క్రమంలో వేడెక్కి గ్యాస్ లా మారి పరిసర ప్రాంతల్లో వ్యాపించి.. 13 మంది మరణానికి, వందలాది మంది బాధితులు అయ్యేందుకు కారణమయ్యిందని కమిటీ తన నివేదికలో పేర్కోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  covid-19  LG Polymers  High power committee  Andhra Pradesh  Crime  

Other Articles