Coronavirus is airborne, say 239 experts గాలి నుంచి కూడా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారి

Coronavirus can be transmitted through air claim 239 scientists

coronavirus, covid-19, coronavirus symptoms, air borne, coronavirus transmission, coronavirus symptoms, scientists, WHO, OPen letter lockdown, covid-19 india, Coronavirus treatment, Health, Coronavirus, Covid-19, airborne transmission, World Health Organization, WHO, coronavirus transmission, Coronavirus symptoms, corona in India

Amid a frightening rise in new Covid-19 cluster infections, 239 experts have written an open letter to the WHO, outlining evidence showing that smaller airborne particles containing the virus can infect people, The experts said, the coronavirus is borne through air and can infect people when inhaled.

గాలి నుంచి కూడా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారి: శాస్త్రవేత్తలు బృందం

Posted: 07/06/2020 08:51 PM IST
Coronavirus can be transmitted through air claim 239 scientists

కొవిడ్-19 వైరస్ గతంలో ఏ వైరస్ కూడా ఇంతటి ప్రభావవంతమైనది కాదని తెలుస్తోంది. ఈ వైరస్ ఎన్నో రకాలుగా రూపాంతరం చెందుతుందన్న వివరాలతో ఖంగుతింటున్న ప్రజలు.. దీని లక్షణాల జాబితాను కూడా పెంచుతూ పోతున్నారు. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో పాటు ఇటీవల వెన్నునొప్పి, కడుపు నొప్పి, దద్దుర్లు, మోకాలి కింది భాగంలో నొప్పి వంటి లక్షణాలను కూడా చేర్చారు. ఆ తరువాత ఇక తాజాగా వాంతులు, విరోచనాలు, జలుబు, ముక్క కారడం కూడా ఈ వైరస్ లక్షణాలలో చేర్చారు. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా కోటి 12 లక్షల మందిని ఈ మహమ్మారి తన ప్రభావానికి గురిచేసి వారిలో ఏకంగా ఐదు లక్షల మందిని కబళించి వేయడానికి కారణాలపై ఓ వైపు అధ్యయనాలు కోనసాగుతూనే వున్నాయి.

ఈ క్రమంలో చేతులకు సానిటైజర్ రాసుకోవడం..  ముఖానికి మాస్క్ లు ధరించడం, వంటి చర్యలు చేపట్టాలని ప్రపంచ దేశాల్లోని ప్రముఖులు ఇప్పటికే ఆయా దేశాల ప్రజలకు కోరుతున్నారు. కాగా తాజాగా 32 దేశాలకు చెందిన 239 మంది వైద్య నిపుణుల బృందం చేసిన తాజా అధ్యయనాల్లో కరోనా మహమ్మారి గాలి నుంచి కూడా సోకుతుందని అందుకు తమ వద్ద ఆధారాలు కూడా వున్నాయిని అన్నారు. ఈ మేరకు తమకు లభించిన ఆధారాలతో త్వరలోనే ఓక ఆరోగ్య సంబంధమైన పత్రికలో పూర్తి కథనాన్ని ప్రచురించేందుకు కూడా తాము సుముఖత వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. గాలి నుంచి కరోనా వ్యాధి సంక్రమిస్తుందని చెప్పడానికి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న దాంట్లో నిజం లేదని కూడా వైద్య నిపుణుల బృందం స్పష్టం చేసింది.

ఈ మేరకు వైరస్ సంక్రమించే విధానాల్లో గాలి నుంచి కూడా వ్యాప్తి చెందుతుందన్న విషయాన్ని పోందుపర్చాలని, ఇక దీంతో పాటు తమ సైంటిపిక్ జర్నల్ లో తమ లేఖను కూడా ప్రచురించేందుకు ప్రణాళిక సిద్దం చేయాలని కోరింది. కరోనా బాధితులు తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు వెలువడే తుంపర్లు గాలిలోని చిన్న అణువుల్లోకి ప్రవేశించి ఒక గది వంటి నిర్దేశిత ప్రాంతంలో తిరుగుతూ వైరస్‌ను వ్యాప్తి చేస్తాయని శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. గాలిలో ఉండే చిన్న చిన్న అణువుల ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందని అని చెప్పడానికి తమ వద్ద ఆధారాలు వున్నాయని శాస్త్రవేత్తల బృందం పేర్కోంది. వైరస్‌ వ్యాప్తి కట్టడికి సంబంధించిన సూచనలు, సిఫార్సులను సవరించాలని డబ్ల్యూహెచ్‌ఓకు సూచించింది.

గాలి ద్వారా వైరస్ వ్యాపి చెందుతుందని అనడానికి బలమైన ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్‌ఓ ఇప్పటికీ చెబుతూ వస్తోంది. వైద్య ప్రక్రియల అనంతరం వెలువడే ఐదు మైక్రాన్ల కంటే చిన్న కణాల ద్వారా మాత్రమే వైరస్‌ వ్యాపించే అవకాశం ఉందని తెలిపింది. ఇది చాలా అరుదుగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో గాలి ద్వారా వైరస్ వ్యాపించదని పరోక్షంగా చెప్పింది. అయితే గాలి ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందన్న వార్తల నేపథ్యంలో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే కోటికి పైగా ప్రజలను తన బాధితుల్ని చేసుకున్న ఈ మహమ్మారి.. ఇంకా ఎంత మందిని తన బారిన వేసుకుంటోందనని అంటున్నారు. ఇన్నాళ్లు ధైర్యంగా వున్నవారు కూడా ఇక జాగ్రత్తులు పాటించాల్సిందేనని అంటున్నారు. ముఖ్యంగా కార్యాలయాలు, పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు సహా గాలి, వెలుతురు తక్కువగా ఉండే ప్రదేశాల్లో కట్టడి సవాల్ గా పరిణమించే ప్రమాదం ఉంది. దీంతో గదుల ఆకారంలో గాలి అక్కడే సంచరించకుండా బలమైన ఫిల్టర్లు, అల్ట్రా వాయిలెట్ బల్బులు ఏర్పాటు చేయాల్సిన అవసరం వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles