Coronavirus | MHA unveils rules for Unlock 2 అన్ లాక్ 2.0 మార్గదర్శకాలు ఇవే: రాత్రిపూట కర్ప్యూ యధాతథం..

Covid 19 unlock 2 will retain most curbs curfew to be eased

Coronavirus, Coronavirus India updates, Coronavirus Live Updates, India coronavirus deaths, India coronavirus cases, coronavirus,covid-19, lockdown, unlock 2 guidelines, night curfew, home ministry, MHA,what s open whats closed, restrictions, Unlock 2, Covid

The Ministry of Home Affairs (MHA) late on Monday announced fresh guidelines for Unlock 2. The restrictions will, however, be strictly enforced in containment zones till July 31. Metro rail services, schools, colleges, gymnasiums, auditoriums, bars, swimming pools, entertainment parks, theatres, assembly halls and similar places will continue to remain shut across the country.

అన్ లాక్ 2.0 మార్గదర్శకాలు ఇవే: రాత్రిపూట కర్ప్యూ యధాతథం.. విద్యాసంస్థల బంద్

Posted: 06/30/2020 01:11 PM IST
Covid 19 unlock 2 will retain most curbs curfew to be eased

దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న వేళ అన్ లాక్ 1.0 మార్గదర్శకాలు ముగింపు నేపథ్యంలో కేంద్రం తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. అన్ లాక్ 1.0 నుంచే స్థంభించిన జనజీవనానికి నూతన జవసత్వాలు వచ్చినట్టుగా ప్రజలు సంచారం ప్రారంభమైంది. అంతకుముందు మార్చి 23 నుంచి సంపూర్ణ లాక్ డౌన్ నేపథ్యంలో ఇళ్లకు మాత్రమే పరిమితమైన ప్రజలు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక ఇవాళ్టితో అన్ లాక్ 1.0 ముగియునున్న తరుణంలో కేంద్రం అన్ లాక్ 2.0 మార్గదర్శకాలను కల్పించింది. అయితే జులై 31 వరకు కంటైన్‌మెంట్‌ జోన్లలో కేంద్రం లాక్ డౌన్‌ పొడిగించింది. ఈ మేరకు కేంద్రప్రభుత్వం అన్‌లాక్‌ -2 విధివిధానాలను ప్రకటించింది.

అన్ లాక్ 2.0తో జాతీయ, రాష్ట్రీయ రహదారులపై రాకపోకలు సాగించే వాహనాలకు, ప్రజలకు ఎలాంటి కోవిడ్ అనుమతులు అవసరం లేదని పేర్కోంది. ఈ తరుణంలో విద్యా సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, విద్యార్థులు వెళ్లే ఏ విధమైన కార్యకాలపాలకు అనుమతి మాత్రం లభించలేదు. కేంద్ర, రాష్ట్ర శిక్షణా సంస్థలకు జులై 15 నుంచి కార్యకలాపాలకు అవకాశం కల్పించింది. అలాగే, హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకే అంతర్జాతీయ ప్రయాణికులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. మెట్రో రైళ్లు, థియేటర్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌పై నిషేధం కొనసాగనుంది. సామాజిక, రాజకీయ, మతపరమైన కార్యకలాపాలపైనా నిషేధం కొనసాగుతుందని స్పష్టంచేసింది. బుధవారం నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. రాత్రిపూట కర్ఫ్యూని రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5గంటలకు సడలించింది.

అన్ లాక్ 2.0 కీలక మార్గర్శకాలివే..

 

* పాఠశాలలు, విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్ల నిర్వహణపై నిషేధం కోనసాగింపు

* జనసమూహంతో కూడుకున్న ఏ సమావేశానికి అనుమలు లేవు

* దేశీయ విమానాల సర్వీసులను మరింత విస్తరణ

* పరిమిత స్టాపులతో నడిచే రైళ్ల విస్తరణ

* ఆన్ లైన్, దూరవిద్యా విధానాల కొనసాగింపుకు అనుమతి

* విదేశాల్లో చిక్కుకున్న వారిని తీసుకొచ్చేందుకు అవకాశం

* రాత్రి 10 నుంచి ఉదయం ఐదు వరకు కర్ప్యూ కొనసాగింపు

* కర్ప్యూ సమయంలో రహదారులపై వాహనాలను, ప్రజలను అడ్డుకోవద్దు

* ప్రయాణ సమయం మొత్తం ప్రయాణికులు మాస్క్‌ ధరించాల్సిందే.

* బయట ప్రదేశాల్లో ప్రతిచోటా 6 అడుగుల దూరాన్ని పాటించాలి.

* దుకాణదారులు కేంద్ర మార్గదర్శకాల మేరకు ఏర్పాట్లు చేయాలి.

* కేంద్ర, రాష్ట్ర విధివిధానాలను అన్ని కంపెనీలు, సంస్థలు విధిగా పాటించాల్సిందే.

* అవకాశం మేరకు ఇంటి నుంచి పనిచేసేందుకే ప్రయత్నించాలని కేంద్రం సూచన

* షిఫ్ట్‌ మారే సందర్భంలో భౌతికదూరం పాటించేందుకు చర్యలు తీసుకోవాలి

* పని ప్రదేశాలు, ఎక్కువమంది సంచరించే ప్రాంతాలను నిత్యం శానిటైజ్‌ చేయాలి.

* భారీ సంఖ్యలో జనం గుమిగూడంపై నిషేధం

* వివాహ, వివాహ సంబంధ కార్యక్రమాలకు 50మందికే అనుమతి

* అంత్యక్రియల్లో పాల్గొనేందుకు 20మందికి మాత్రమే అనుమతి

* బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధం, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు

* బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, పొగాకు ఉత్పత్తులు తీసుకోవడం నిషేధం

* కేంద్రం, రాష్ట్రాల విధివిధానాలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు, జరిమానా

* తప్పుడు సమాచారం ఇచ్చినా.. శిక్షకు గురికావాల్సి ఉంటుంది

* అలసత్వం ప్రదర్శించిన వారు ఐపీసీ ప్రకారం కఠిన చర్యలు తీసుకొనేందుకు శిక్షార్హులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles