Dokka Manikya vara prasad elected as MLC శాసనమండలిలో పెరిగిన వైసీపీ బలం.. ఎమ్మెల్సీగా డొక్కా ఏకగ్రీవం

Dokka manikya varaprasad unanimously elected as mlc

ysrcp mlc dokka manikya vara prasad, YSRCP, mlc dokka manikya vara prasad, dokka manikya vara prasad, AP Legislative Council, Andhra pradesh, Politics

Former Minister Dokka Manikya Vara Prasad had been elected Unanimously as member of Legislative council today, as the post was been vacant since the vara prasad had resinged the post recently.

శాసనమండలిలో పెరిగిన వైసీపీ బలం.. ఎమ్మెల్సీగా డొక్కా ఏకగ్రీవం

Posted: 06/29/2020 10:50 PM IST
Dokka manikya varaprasad unanimously elected as mlc

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం పెరిగింది. శాసనమండలికి జరిగిన జరిగిన ఎన్నికలలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేల కోటాలో ఏపీ శాసన మండలి స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన ఎన్నికయ్యారు. రిటర్నింగ్‌ అధికారి నుంచి ఎమ్మెల్సీగా మాణిక్యవరప్రసాద్‌ ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. దీంతో ఇప్పటి వరకు శాసన మండలిలో 9గా ఉన్న వైసీపీ సభ్యుల సంఖ్య 10కి చేరింది.

తెలుగు దేశం పార్టీకి, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికి డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఆయన స్థానాన్ని.. మళ్లీ ఆయనతోనే భర్తీ చేయడం విశేషం. నాలుగు రోజుల క్రితమే వైసీపీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే ఆ స్థానానికి ఎవరూ నామినేషన్‌ వేయకపోవడంతో మాణిక్యవరప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటికే డొక్కా మాణిక్యవర ప్రసాద్ ను చైర్మన్ అభ్యర్థిగా బరిలో దింపేందుకు కూడా మెల్లిగా వైసీపీ పావులు కదుపుతోందన్న వార్తలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles