Gunmen Attack Pakistan Stock Exchange In Karachi బుసకొట్టిన ఉగ్రవాదం.. పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంచ్ పై దాడి

Gunmen wage deadly battle at pakistan stock exchange

Karachi attack, pakistan stock exchange, pakistan stock exchange attack, pakistan stock exchange attack today, pakistan news, pakistan latest news, terrorist attack in pakistan

Four heavily armed militants attacked the busy Pakistan Stock Exchange on Monday morning, killing four security guards and a police officer before being shot dead in an exchange of fire. The unidentified militants opened indiscriminate fire and lobbed hand grenades at the main gate of the multi-storey building as they tried to storm it.

బుసకొట్టిన ఉగ్రవాదం.. పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంచ్ పై దాడి..

Posted: 06/29/2020 11:11 PM IST
Gunmen wage deadly battle at pakistan stock exchange

తాము పెంచిపోషిస్తున్న విషనాగు మరోమారు తననే కాటువేసింది. ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన పాకిస్తాన్.. వారిని పెంచిఫోషిస్తోందని ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో అరోపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలు సాక్ష్యాలు కూడా బహిర్గతం అయ్యాయి. ఈ విషయాన్ని పక్కనబెడితే.. తమ పామేనని, తాము అడించినట్టల్లా అడుతోందని పాకిస్థాన్ భావించింది. కానీ ఇదివరకే పలు ఘోర మారణ హోమాలను సృష్టించినా చేష్టలుడికి చూస్తుండిపోయారు. మిలటరీ స్కూలుపై దాడి చేయడం.. ఆర్మీ జోన్ లోకి ప్రవేశించడం ఇలా పలు ఘటనలు పాకిస్థాన్ లోని ఉగ్రవాదులు పాల్పడిన విషయం తెలిసిందే.

అయితే ఉగ్రవాదులు ఏదో ఒక ఘటనకు పాల్పడినప్పుడల్లా ఆ దేశానికి చెందిన సైన్యం వారిపై చర్యలకు ఉపక్రమిస్తుంది. కానీ అంతలోనే చల్లారిపోయిన ఘటనలు కూడా మనకు తెలిసినవే. అయితే తాజాగా కరాచీ నగరంలోని పాకిస్థాన్‌ స్టాక్‌ ఎక్స్చేంజీ(పీఎస్‌ఎక్స్‌) భవనంపై ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడ్డారు. ముష్కరమూక దాడి ఘటనలో ఐదుగురు మృతి చెందినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. వీరిలో నలుగురు స్టాక్స్ ఎక్స్చేంజ్ భద్రతా సిబ్బంది కాగా.. ఒక ఎస్సై ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని సిబ్బందిని ఖాళీ చేయించారు.

స్టాక్ ఎక్స్చేంజ్ లోని పలువురు ప్రత్యక్ష సాక్షలు తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ మధ్యహ్నం సమయంలో ఓ కారులో వచ్చిన నలుగురు ముష్కరులు ఈ ఉగ్రదాడికి పాల్పడ్డారని అన్నారు. కాగా, పీఎస్‌ఎక్స్‌ డైరెక్టర్‌ అబిద్‌ అలీ హబీబ్‌ ఘటన వివరాలపై స్పందిస్తూ.. ఉగ్రవాదులు పార్కింగ్‌ ఏరియా నుంచి లోపలికి ప్రవేశించారని తెలిపారు. తొలుత భవన ప్రధాన ద్వారం వద్ద గ్రనేడ్‌ విసిరడంతోనే ఒక్కసారిగా అలజడి రేగిందని వెల్లడించారు. అనంతరం లోపలికి ప్రవేశించి విచక్షణా రహింతంగా కాల్పులకు తెగబడ్డట్లు పేర్కొన్నారు. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు ముష్కరులు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనను సింధ్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ ఇమ్రాన్‌ ఇస్మాయిల్‌ తీవ్రంగా ఖండించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karachi attack  pakistan stock exchange  pakistan news  terrorist attack  

Other Articles