Sandesara scam: ED questions Ahmed Patel కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడి ఇంటిపై ఈడీ దాడి

Sandesara scam ed quizzes senior congress leader ahmed patel

Sandesara scam, Enforcement Directorate, Senior Congress leader, Ahmed Patel, extradition case, Money laundering, Faisal Patel, Irfan Siddqui, Albania, India, Crime, Politics

The Enforcement Directorate arrived at the residence of senior Congress leader Ahmed Patel to question him in a money laundering case. This is the first time that Ahmed Patel has been questioned by any probe agency. Earlier his son Faisal Patel and son-in-law Irfan Siddqui were quizzed multiple times by the agency.

కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ ఇంటిపై ఈడీ దాడి

Posted: 06/27/2020 09:09 PM IST
Sandesara scam ed quizzes senior congress leader ahmed patel

సీనియర్ కాంగ్రెస్‌ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్‌ పటేల్‌ నివాసంపై ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడి చేశారు. ఇవాళ ఉదయం ముగ్గురు సభ్యులున్న అధికారుల బృంధం అహ్మద్ పటేల్ ను విచారించింది. దేశంలోని ఏ దర్యాప్తు సంస్థ ఇప్పటివరకు ఆయను ఏ కేసులోనూ విచారించలేదు. తొలిసారిగా ఆయనను ఇవాళ మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు సంస్థ ఈడీ విచారించింది. వేలకోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన సందేశారా సోదరుల కుంభకోణానికి సంబంధించిన కేసులో ఆయనను ప్రశ్నించనున్నామని అధికారులు తెలిపారు. కాగా, మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం క్రింద ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నమని వారు వివరించారు.

ఈ కేసు విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ అహ్మద్‌ పటేల్ కు గతంలో రెండు సార్లు సమన్లు జారీ చేసింది. అయితే వయోవృద్ధులు తమ ఇళ్లకే పరిమితం కావాలన్న కొవిడ్‌-19 వ్యాప్తి మార్గదర్శకాల అనుసారం.. తాను హాజరు కాలేనంటూ అహ్మద్‌ పటేల్‌ తన అశక్తత వెలిబుచ్చారు. ఆయన విజ్ఞప్తిని అమోదించిన ఈడీ, దర్యాప్తు బృందాన్ని మధ్య ఢిల్లీలోని మదర్‌ థెరిసా క్రిసెంట్‌ వద్దనున్న ఆయన ఇంటికే పంపేందుకు అంగీకరించింది. కాగా ఇదివరకే అహ్మద్ పటేల్ తనయుడు ఫైసల్ పటేల్ సహా అల్లుడు ఇర్ఫాన్ సిద్దిఖీలను ఎన్ ఫోర్స్ మెండ్ డైరెక్టరేట్ పలు పర్యాయాలు విచారించింది, ఆనంతరం అహ్మద్ పటేల్ ను ఇవాళ తొలిసారి విచారించింది.

గుజరాత్ కు చెందిన స్టెర్లింగ్‌ బయోటెక్‌ సంస్థ, ఆంధ్రా బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ.5,383 కోట్ల రుణాలను పొందింది. అనంతరం చెల్లింపులు లేకపోవటంతో దీనిని నిరర్ధక ఆస్తిగా ప్రకటించారు. కాగా, ఈ రుణం విలువ ప్రస్తుతం రూ.14,500 కోట్లకు చేరినట్టు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో సంస్థ యజమానులైన చేతన్ సందేశారా‌, నితిన్‌ సందేశారా సోదరులతో సహా మరికొందరికి భాగస్వామ్యముందని అనుమానిస్తున్నారు. ఈ కుంభకోణం నేపథ్యంలో నిందితులు దేశం దాటి అల్బానియాకు పారిపోయి అక్కడ తలదాచుకున్నారు. ఈ కేసుపై సీబీఐ అక్టోబర్‌ 2017లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. కాగా సందేశారా సోదరులకు చెందిన దాదాపు 9500 కోట్ల ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో అహ్మద్ పటేట్ కు సందేశారా సోదరుల నుంచి లబ్ది చేకూరిందని ఈడీ అనుమానిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sandesara scam  Ahmed Patel  extradition case  ED  Faisal Patel  Irfan Siddqui  Albania  India  Crime  

Other Articles