Patanjali under govt scanner over covid drug పతాంజలి కరోనా మందు ‘కరోనిల్’కు కేంద్రం బ్రేకులు..

Baba ramdev ayurvedic corona treatment on hold ministry of ayush asks for details

corona vaccine, baba ramdev, patanjali, Coronil, National Institute of Medical Sciences, Patanjali Yogpeeth, patanjali research centre, ministry of ayush, world's first ayurvedic treatment for Covid-19, world's first ayurvedic treatment for Coronavirus

Baba Ramdev's Patanjali Ayurved rolled out what it said was the world's first ayurvedic treatment for Covid-19 called Coronil and Swasari and claimed all clinical trials for the product were in place, following which Ministry of Ayush directed Patanjali to stop advertising and publicising its claims till the issue is duly examined

పతాంజలి కరోనా మందు ‘కరోనిల్’కు కేంద్రం బ్రేకులు..

Posted: 06/24/2020 04:11 PM IST
Baba ramdev ayurvedic corona treatment on hold ministry of ayush asks for details

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాకు పతంజలి యోగఫీఠ్ తొలిసారిగా ఆయుర్వేద మందు తీసుకువచ్చిందని ప్రముఖ దేశీయ కంపెనీ పతంజలి పేర్కొన్న నేపథ్యంలో వెనువెంటనే ఆయుష్ మంత్రిత్వశాఖ దానికి బ్రేకులు వేసింది. ‘కొరోనిల్‌’ పేరుతో పతంజలి సంస్థ తీసుకువచ్చిన మందును మార్కెట్లోకి తీసుకురాకుండా తాత్కాలికంగా బ్రేకులు వేసింది. తమ సంస్థ కరోనా చికిత్సకు అత్యంత చౌకగా, సామాన్యులకు అందుబాటు ధరలో మందును తీసుకువచ్చిందని ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు బాబా రాందేవ్‌ తెలిపినా.. ఆయుష్ మంత్రిత్వశాఖ మాత్రం ఈ మందును మార్కెట్లోకి తీసుకురావడం, ప్రచారం నిర్వహించడంపై తాత్కాలిక ఆంక్షలను విధించింది.

పతంజలి సంస్థ తీసుకువచ్చిన కరోనిల్ ఆయుర్వేద మందు ఎలా పనిచేస్తుందన్న విషయమై పరీక్షలు జరపాలని.. మందును పరిశీలించి ఆయుష్ మంత్రిత్వశాఖ అనుమతులు జారీ చేసేవరకు ఎలాంటి ప్రచారం నిర్వహించడం కానీ మార్కెటింగ్ చేయడం కానీ చేయరాదని పతంజలీ సంస్థకు ఆయుష్ మంత్రిత్వశాఖ అధికారులు సూచించారు. పతంజలి కరోనిల్ మందును ఎలా తయారు చేశారు.. ఏయే ఔషదాలను ఎంత మోతాదులో వినియోగించారు అన్న వివరాలను కూడా సాధ్యమైనంత త్వరంగా ఇవ్వాలని సూచించామని తెలిపారు. ఈ కరోనిల్ ఔషధం క్లినికల్ ట్రయల్స్ కూడా విజయవంతమయ్యాయని బాబా రాందేవ్ తెలిపిన నేపథ్యంలో ఎక్కడ వాటిని పరీక్షించారు, సాంపుల్ సైజు, రిజిస్ట్రేషన్, పరిశోధించిన సంస్త, దానికి ఎథిక్స్ కమిటీ క్లియరెన్స్ పత్రాలు, రిజల్టు డేటా అన్నింటినీ పంపితే తాము పరిశీలిస్తామని తెలిపారు.

కాగా హరిద్వార్ లోని యోగ్ పీఠ్లో నిర్వహించిన కార్యక్రమంలో బాబా రాందేవ్ కరోనా చికిత్సకు కరోనిల్ మందును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాందేవ్‌ మాట్లాడుతూ.. ఆయుర్వేదంతో కరోనాను నయం చేయవచ్చునని అన్నారు. తమ కరోనిల్ మందుతో మూడు రోజుల పరిశీలనలో 69 శాతం మందికి నెగిటివ్‌ రావడం శుభసూచకం. అలాగే 7 రోజుల్లో వంద శాతం మంది కోలుకున్నారు. మందును తీసుకురావడంలో మా శాస్త్రవేత్తలు చేసిన కృషి అభినందనీయం’ అని రాందేవ్‌ పేర్కొన్నారు. కొరోనిల్‌ మాత్రల ద్వారా 14 రోజుల్లో కరోనాను నయం చేయవచ్చని పతంజలి సంస్థ పేర్కొంది. తమ మందు 5 నుంచి 14 రోజుల్లో కొవిడ్‌ను నయం చేయగలదని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles