Nigerian scientists discover COVID-19 vaccine: Report శాస్త్రవేత్తల అద్భుతం.. కరోనా వాక్సీన్ కనుగొన్న నైజీరియా.!

Nigerian scientists claim to have discovered covid 19 vaccine

Coronavirus vaccine, Nigerian covid 19 vaccine, Nigerian Universities Scientists, COVID 19 Research Group, Oladipo Kolawole, vaccine update, corona vaccine, coronavirus pandemic, covid vaccine, latest news of vaccine, coronavirus latest update, Coronavirus vaccine status, covid 19 vaccine, Nigerian scientists

A team of Nigerian scientists claimed to have discovered a unique vaccine that may help prevent the novel coronavirus infection. The discovery of the vaccine was announced by Nigerian Universities’ Scientists, under the aegis of COVID-19 Research Group.

శాస్త్రవేత్తల అద్భుతం.. కరోనా వాక్సీన్ కనుగొన్న నైజీరియా.!

Posted: 06/22/2020 11:09 PM IST
Nigerian scientists claim to have discovered covid 19 vaccine

ప‌్ర‌పంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి ఇప్పటికే మన దేశీయ సంస్థలు ఔషదాన్ని కనుగోన్నాయి. దీంతో కరోనా పేరు వినగానే భయాందోళన చెందుతున్న పలు నగరాలవాసులకు కొంత ఊరట లభించినట్లు అయ్యింది. గ్లెన్ మార్క్ సంస్థ స్వల్ప, మధ్యస్థ సాయి కరోనా ఉద్దృతికి గురైన రోగులకు నోటి ద్వారా తీసుకునే మందులను కనుగోనగా, హెటిరో, సిప్లా సంస్థలు కరోనా ఉధ్దృతి అధికంగా వున్న రోగులకు ఇంజక్షన్ రూపంలో మందును తీసుకువచ్చింది. ఇదిలావుండగానే ఆఫ్రికా ఖండంలోని నైజీరియా మాత్రం అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రపంచంలోని అగ్రదేశాలతో పాటు అనేక దేశాలు కరోనాకు వాక్సీన్ రూపోందించేందుకు పోటీపడుతున్న క్రమంలో నైజీరియా దానిని సుసాధ్యం చేసి అద్భుత అవిష్కరణను తమ దేశప్రజల ముందుకు తీసుకువచ్చింది.

ఈ మేరకు నైజీరియా విశ్వవిద్యాలయం ఒకటి.. తాము వ్యాక్సిన్ క‌నుగొన్న‌ట్టు శుక్ర‌వారం ప్ర‌క‌టించాయ‌ని స్థానిక మీడియా ద్వారా తెలిసింది. అయితే భార‌త్‌, అమెరికా, బ్రిట‌న్‌, ఫ్రాన్స్‌, జ‌ర్మ‌నీ, జ‌పాన్‌, చైనా, ఆస్ట్రేలియా స‌హా అనేక దేశాలు వ్యాక్సిన్ కోసం విస్తృతంగా ప‌రిశోధ‌న‌లు చేస్తున్న తరుణంలో నైజీరియా ఒక అడుగు ముందుకేసీ ఈ వాక్సీన్ ను కనుగొనింది. అగ్రరాజ్యంతో పాటు వైద్యరంగంలో అగ్రస్థానంలో నిలిచే పలు దేశాలు కోట్ల‌లో ధ‌నం వెచ్చిస్తూ వాక్సీన్ ను తయారు చేసే పనుల్లో నిమగ్నమై వున్నాయి.  ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్ర‌కారం 13 వ్యాక్సిన్ల‌ను మ‌నుషుల‌పై ప్ర‌యోగిస్తున్నారు. 120 సంస్థ‌లు వాక్సీన్ క‌నుగొన‌డంలో నిమ‌గ్న‌మ‌య్యాయి.

ఆఫ్రికాలో ఆఫ్రిక‌న్ల కోసం ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశామ‌ని అడిలెక్ యూనివ‌ర్సిటీలో మెడిక‌ల్ వైరాల‌జీ, ఇమ్యునాల‌జీ, బ‌యో ఇన్ఫ‌ర్మేటిక్స్ ప్ర‌త్యేక నిపుణుడు, డాక్ట‌ర్ ఒల‌డిపో కొల‌వోల్ ప్ర‌క‌టించార‌ని ది గార్డియ‌న్ నైజీరియా తెలిపింది. ఈ ప‌రిశోధ‌న‌కు ఆయ‌నే  నేతృత్వం వ‌హించారు. ఈ వాక్సీన్ అంద‌రికీ అందుబాటులోకి వ‌చ్చేందుకు క‌నీసం 18 నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని ఒల‌డిపో అన్నారు.  మ‌రిన్ని ట్ర‌య‌ల్స్‌, విశ్లేష‌ణ అవ‌స‌ర‌మ‌ని, వైద్య అధికార వ‌ర్గాల నుంచి అనుమ‌తుల రావాల్సి ఉంటుంద‌ని పేర్కొన్నారు. సార్స్ కొవ్‌2 జీనోమ్ కోసం ఆఫ్రికా మొత్తం విస్తృతంగా అన్వేషించామ‌ని ఆయ‌న‌ వెల్ల‌డించారు.

వ్యాక్సిన్ క‌నుక్కోవ‌డం వాస్త‌వ‌మేన‌ని  ప్రీసియ‌స్ కార్న‌ర్ స్టోన్ వ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ జూలియ‌స్ ఒలోక్ సైతం తెలిపారు. తాము కరోనా వైరస్ మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొన్న మాట నిజ‌మేనన్నారు.  తాము చాలాసార్లు ప్ర‌యోగాలు చేసి విశ్లేషించామని.. వాక్సీన్ రూపోందించామని ఒలోక్ తెలిపారు. అయితే తాము కనుగోన్న వాక్సీన్ ఆఫ్రిక‌న్లే ల‌క్ష్యంగా త‌యారు చేశామన్నారు. ఇత‌రులు సైతం ఉప‌యోగించొచ్చునని.. ఇది ప‌నిచేస్తుందని తెలిపారు. తమ దేశ శాస్త్రవేత్తల అంకిత‌భావానికి వ‌చ్చిన ఫ‌లిత‌మే ఇదని ఆయన కొనియాడారు. చాలామంది శాస్త్ర‌వేత్త‌లు ఇందుకోసం ఎంత‌గానో  శ్ర‌మించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా  ఈ వ్యాక్సిన్ అవ‌స‌రం ఎంతో ఉంది. అందుకే మేం దీనిపై దృష్టిపెట్టామని ఆయ‌న వివ‌రించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Coronavirus  vaccine  Nigeria  covid 19 vaccine  Oladipo Kolawole  Adeleke University  Africa  Africans  

Other Articles

Today on Telugu Wishesh