Ts Govt guidelines for Bonalu festival పూజారులేత్తేరు బోనాలు.. ఘటాలకు అనుమతి లేదు: ప్రభుత్వం

Telangana government guidelines for ashada bonalu festival

coronavirus, COVID 19, Telangana government guidelines, Ashada Masam Bonalu, Grama Devathala Bonalu, Mahankali Bonalu, Bonalu 2020, coronavirus Bonalu, Covid-19 Bonalu, Bonalu Celebrations, Hyderabad COVID 19, Bonalu festival, Telangana bonalu

Since the Telugu New Year Ugadi till now all the festivals are being celebrated in their homes by the people of the country. Yet another festival Ashada Masam Bonalu is celebrated in Telangana by bringing all the relatives together. But as corna pandemic shivers the govt issues new guidelines for celebration of Bonalu.

పూజారులేత్తేరు బోనాలు.. ఘటాలకు అనుమతి లేదు: ప్రభుత్వం

Posted: 06/22/2020 11:47 PM IST
Telangana government guidelines for ashada bonalu festival

కరోనా మహమ్మారి దెబ్బకు మానవ జీవితం అస్తవ్యస్తమైంది. అలాయ్ భలాయ్ అనే రోజులు కాస్తా.. అమడ దూరం వుండి మాట్లాడండీ అనే పరిస్థికి వచ్చింది. ఎక్కడికీ వెళ్లలేని.. ఏ వేడుకా చేసుకోలేని పరిస్థితులు దాపురించాయి. ఇంట్లో చిన్నారుల పుట్టిన రోజుకు కూడా బంధువుల సంగతి పక్కనబెట్టినా.. కనీసం తాతా, పెదనాన్న, చిన్నాన్న, అత్తయ్య ఇలా ఎవరూ హాజరులేకుండా.. అందుబాటులోకి వచ్చిన వీడియో కాలింగ్ లో చూపిస్తూ సెలబ్రేట్ చేసుకోవాల్సిందే తప్ప.. వచ్చి నోట్లో కేక్ పెట్టి తినిపంచి అప్యాయతను పంచే పరస్థితులు కనుమరుగయ్యాయి.

ఇక పెళ్లిళ్లలో కూడా కేవలం ముఖ్యమైన బంధజనం తప్ప పెద్ద సంఖ్యలో బంధుగణాన్ని అహ్వానించే రోజులు పోయాయి. కరోనా తన ఉద్దృతి అంతకంతకూ పెంచుకుంటూ విలయతాండవం చేస్తుండటంతో ఎంత కావాల్సిన వారైనా దూరంగా వుంచాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక చావులకు కూడా 20 మందికి మించి అధికారులు అనుమతించడం లేదు. ఎంత ప్రజాభిమానం వున్నా, బంధుజనం వున్నా.. ఇంట్లో కూర్చోనే కన్నీళ్లను వదలాల్సిందే తప్ప. మరుభూమికి వెళ్లలేని దుస్థితి వచ్చింది. ఇక ఇదే తరహాలో తెలంగాణ ప్రజలు ఎంతో సంబరంగా జరుపుకునే గ్రామదేవతల బోనాల ఉత్సవాలు కూడా ఈ సారి కళతప్పుతోంది.

ప్రతీ ఏటా ఎంతో వైభవంగా జరుపుకునే పండుగలు కూడా భక్తులు లేక, డప్పు చప్పుళ్లు లేక, పోతరాజులు, ఘటాల ఊరేగింపులు, పలహారం బండ్లు లేకుండా సాదాసీదాగా జరగనున్నాయి. ఈ సారి బోనాల పండుగకు పూజారులే బోనాలు ఎత్తనున్నారు. ప్రభుత్వమే అన్ని ఆలయాల్లో పట్టువస్త్రాలను సమర్పించనుంది. ఇప్పటికే ఉగాది, శ్రీరామ నవమి, గుడ్ ఫ్రైడే, రంజాన్ పండగలను ఇళ్లలో ఉండే జరుపుకున్నారు. ఇక తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకునే ఆషాడ బోనాలకు కూడా భక్తులను అనుమతించడం లేదు. బోనాలను కూడా భక్తులు ఈసారి ఇళ్లల్లోనే జరుపుకోవాల్సి వస్తోంది. ఈ మేరకు బోనాల వేడుకలకు తెలంగాణ ప్రభుత్వ మార్గదర్శకాలను విడుదల చేసింది.

హైదరాబాద్లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల్లో 73శాతం కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బోనాల పండగను ఎప్పటిలానే నిర్వహిస్తే వైరస్ మరింత విజృంభించే అవకాశముందని ప్రభుత్వం భావించింది. బోనాలు, ఘటాల ఊరేగింపు వంటి కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొంటారని.. అలా జరిగితే కరోనా కేసులు మరింత ఎక్కువ అయ్యే అవకాశముందని అధికారులు ప్రభుత్వానికి సూచించారు. ఈ నేపథ్యంలో బోనాల పండగను ఇళ్లల్లోనే జరుపుకోవాలని జంట నగరాల ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

బోనాల మార్గదర్శకాలు ఇవే :-

 

* ఈ నెల 25న గోల్కొండలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

* గోల్కొండ బోనాల వేడుకల్లో 10 మంది మాత్రమే పాల్గొంటారు.

* అన్ని దేవాయాల్లోనే ప్రభుత్వమే పట్టువస్త్రాలు సమర్పిస్తుంది.

* ఈసారి పూజారులు మాత్రమే ఆలయాల్లో బోనాలు నిర్వహిస్తారు.

* గటాల ఊరేగింపునకు ఎలాంటి అనుమతి లేదు.

* ప్రజలంతా తమ మొక్కులను ఇళ్లల్లోనే చెల్లించుకోవాలి

* ఉత్సవాలను టీవీలు, సోషల్ మీడియాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles