2k more Covid deaths, cases rise to 3.5 lakh దేశంలో కరోనా మరణమృదంగం: 24 గంటల్లో 2వేల మరణాలు..

Record jump in covid 19 deaths 2000 fatalities in a day tally tops 3 5 lakh

Coronavirus in india, coronavirus india news, coronavirus latest news, coronavirus news, coronavirus news today, coronavirus update, coronavirus, india, coronavirus cases in india, coronavirus deaths in india, health ministry, Maharashtra, Delhi

India witnessed a massive jump in COVID-19 death toll - over 2,000 fatalities were added in the last 24 hours. A lion's share of the total casualties on Tuesday came from Maharashtra and Delhi. The coronavirus pandemic in India crossed the grim milestone of 3.5 lakh. The states recorded 10,914 fresh infections in the last 24 hours. It took four days to hit 3.5-lakh mark after crossing 3 lakh on June 13.

కరోనా మరణమృదంగం: 24 గంటల్లో 2003.. దేశంలో పన్నెండు వేల మరణాలు..

Posted: 06/17/2020 11:06 AM IST
Record jump in covid 19 deaths 2000 fatalities in a day tally tops 3 5 lakh

(Image source from: Timesofindia.indiatimes.com)

దేశంలో కరోనా మహమ్మారి మరణమృదంగాన్ని మ్రోగిస్తోంది. ఓ వైపు తన వ్యాప్తిని అంతకంతకూ పెంచుకుంటూ వెళ్తున్న క్రమంలోనే మరోవైపు దేశంలో మరణాలను కూడా పెంచేస్తోంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ.. లక్షలాధి మందిని తన ప్రభావానికి గురిచేస్తూ.. లక్షల మంది ప్రాణాలను హరించిన కరోనా మహమ్మారి దేశంలోనూ తన ఉదృతిని శరవేగంగా విస్తరించుకుంటోంది. రోజురోజుకూ తన వ్యాప్తిని కూడా దేశ ప్రజలపై ఉదృతంగా కొనసాగిస్తోంది. ఫలితంగా కరోనా ప్రభావనపడిన దేశాల్లో నాల్గవ స్థానంలో భారత్ నిలిచింది. కాగా క్రితం రోజు వరకు పదివేలకు చేరువలో నమోదైన మరణాల సంఖ్య కేవలం 24 గంటల వ్యవధిలో ఏకంగా పన్నెండు వేలకు చేరుకు చేరడంతో భారత్.. ప్రపంచంలో అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో ఎనమిదవ దేశంగా నిలిచింది.

గత వారం రోజులుగా కరోనా కేసులు వ్యాప్తి ఉదృతంగా కోనసాగుతోంది. వారం ప్రారంభంలో ఎనమిది వేలకు పైబడిన సంఖ్యలో కరోనా కేసులు నమోదు కాగా, ప్రస్తుతం పది వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. దేశంలో క్రమంగా కరోనా వైరస్ మహమ్మారి బారిన బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత వారం రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఏకంగా లక్షకుపైగా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత భయాందోళనకరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇక దీనికి తోడు మరణాలు కూడా మృదంగాన్ని మ్రోగిస్తున్నాయి. ప్రతీ రోజు రెండు వందలకు పైబడిన సంఖ్యలో మరణాలు నమోదు అయ్యే మరణాలు గడిచిన 24 గంటల్లో ఏకంగా అత్యధిక సంఖ్యలో మునుపెన్నడూ లేని విధంగా 2003 మరణాలు సంభవించాయి, ఢిల్లీ, మహారాష్ట్రలోనే అత్యధిక మరణాలు నమోదు కావడం దేశప్రజలను అందోళనకు గురిచేస్తోంది.

దేశంలో అన్ లాక్ 1.0 అమల్లోకి రావడంతో స్థంభించిన జనజీవనానికి చలనం వచ్చింది. కేవలం మాల్స్, బార్లు, ధియేటర్లు, స్టేడియాల్లో ఆటలు ఇలా భారీ సంఖ్యలో జనసమూహం వున్న ప్రాంతాల్లో కార్యకలాపాలు మినహాయించి మిగిలిన అన్ని వ్యవహారాల తలుపులు తెరుచుకున్నాయి, దీంతో కరోనా కేసులు వ్యాప్తి కూడా గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 10,974 పాజిటివ్ కేసుల నమోదుతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ 354,065 కేసులు నమోదయ్యాయి. ఇక తాజాగా గడిచిన 24 గంటల్లో 2003 మంది మరణించడం అందోళన కలిగించే విషయం. దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య పన్నెండు వేల మార్కును దాటాయి. తాజాగా నమోదైన గణంకాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 11,903కి మరణాలు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.

దేశంలో నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల్లో మహారాష్ట్రలోనే అత్యదికంగా నమోదు కావడం గమనార్హం. గడిచిన 24 గంటల వ్యవధిలో మహారాష్ట్రంలో 1409 మరణాలు సంభవించాయి. ఆ తరువాత కరోనా విజృంభన ఢిల్లీ, తమిళనాడు, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలోనూ అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడిన వారిలో గత 24 గంటల వ్యవధిలో పలువురు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని దీంతో మొత్తంగా ఇప్పటి వరకు 1,86.935 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 1,55,227 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. అయితే తొలిసారిగా కరోనా చికిత్స పోందుతున్న వారి కన్నా.. మహమ్మారి బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోంది. రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశాలు వున్నాయని నిపుణులు అంచనాలు ప్రజలను అందోళనకు గురిచేస్తున్నాయి.

కరోనా బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య దేశంలో యాభై శాతానికి పైగా చేరిందని.. ఇది అత్యధికమని ఐఎంసీఆర్ గణంకాలు స్పష్టంచేస్తున్నాయి. మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతూనే వుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మహారాష్ట్రలో ఏకంగా లక్ష మార్కును దాటి కరోనా కేసులు నమోదువుతున్నాయి, తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో మహారాష్ట్రలో 1328 మరణాలు సంభవించాయి, వాటిలో 862 మరణాలు ఏకంగా ముంబై పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. ఇక తాజా మరణాలతో మహారాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 5537గా నమోదు కాగా, మొత్తం కరోనా కేసులు సంఖ్య 1,13,445 నమోదయ్యాయి. దేశంలో నమోదైన కేసుల్లో దాదాపు 41శాతం కరోనా కేసులు మహరాష్ట్ర నుంచి నమోదు కావడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles