JanaSena urges AP govt to cancell 10th exams విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా.. పరీక్షలు రద్దు చేయండీ: జనసేనాని

Pawan kalyan urges andhra govt to cancell 10th exams

Pawan Kalyan, YSRCP Government, 10th class students, 10th class exams, 10th results, coronavirus, JanaSena, Twitter, Andhra Pradesh, Politics

Janasena chief Pawan Kalyan urges Andhra Pradesh government to cancel 10th class exams and appeals not to play with the lives of students.

పదో తరగతి పరీక్షలను రద్దు చేయండీ.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా.?: పవన్ కల్యాణ్ ధ్వజం

Posted: 06/15/2020 10:14 PM IST
Pawan kalyan urges andhra govt to cancell 10th exams

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పలు రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానాలనే ఆంధ్రప్రదేశ ప్రభుత్వం కూడా అవలంభించి పదో తరగతి విద్యార్థులకు పరీక్షలను రద్దు చేయాలని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. పరీక్షల పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం మానుకోవాలని ఆయన హితువు పలికారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రకటించిన విధ్యార్థుల ఇటర్నల్ మార్కులను ప్రామాణికం చేసుకుని వారికి గ్రేడింగ్ విధానంలో ఫలితాలను వెలువరించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఓ వైపు కరోనా మహమ్మారి రోజురోజుకూ తన ఉదృతిని కొనసాగిస్తున్న క్రమంలో సముచిత నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.

కాలసర్పంలా కరోనా మహమ్మారి బుసకొడుతున్న తరుణంలో చిన్నారుల అటు పరీక్షలతో కుస్తీ పడుతూ.. కంటికి కనిపించని శత్రువుతోనూ యుద్దం చేయాల్సివస్తుందని.. అలాంటి పరిస్థితులు వారికి కల్పించవద్దని కోరారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుపై పరీక్షలు అనే కత్తి పెట్టి ఆపదలోకి నెట్టవద్దని .. వారి ప్రాణాలతో చెలగాటం ఆడటం మంచిది కాదని అన్నారు. ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడా పరీక్షలు నిర్వహిస్తున్న దాఖలాలు లేవని, డిగ్రీ, పీజీ ఉన్నతమైన వృత్తి సంబంధిత పరీక్షలతో పాటు ప్రవేటు, ఉద్యోగ పరీక్షలు సైతం రద్దు అయ్యాయని ఈ సందర్భంగా పవన్‌ గుర్తు చేశారు.

ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసిన ఆయన.. ఏపీలో 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని, ప్రజా రవాణా పూర్తి స్థాయి అందుబాటులో లేని ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రుల కోరిక, చిన్నారుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్ కోరారు. ఈ విషయంపై విద్యావంతులు, వైద్య నిపుణులతో పలు దఫాలు చర్చించిన తరువాతే ఈ డిమాండ్‌ని ప్రభుత్వం ముందు ఉంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం విఙ్ఞతతో పిల్లల యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకొని సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  YSRCP Government  10th exams  coronavirus  JanaSena  Andhra Pradesh  Politics  

Other Articles