YSRCP MP Sensational statements on party leadership ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు

Ysrcp mp raghurama krishnam raju sensational statements on own party leadership

Raghu Rama Krishnam Raju, Raghu Rama Krishnam Raju news, Raghu Rama Krishnam Raju updates, Raghu Rama Krishnam Raju latest, Raghu Rama Krishnam Raju comments, Raghu Rama Krishnam Raju sensational words, Raghu Rama Krishnam Raju new comments, Raghu Rama Krishnam Raju Makes Sensational Comments On YSRCP, Raghu Rama Krishnam Raju, YSRCP, High Command, party posts, Narsapuram MP, Andhra Pradesh, Politics

YSRCP MP Kanumuru Raghu Rama Krishna Raju on Monday said he was never keen on joining the YSRCP and that did he so only after repeated requests from the YSRCP leadership. Talking to media on Monday, he said 'I never sought a ticket from the YSRCP. As a matter of fact, the YSRCP leadership offered the ticket to me. The party leadership requested several times pleading me to join the party.

వైసీపీ అధినాయకత్వంపై సొంత పార్టీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Posted: 06/15/2020 09:27 PM IST
Ysrcp mp raghurama krishnam raju sensational statements on own party leadership

రాష్ట్రంలోని అధికార పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన నేపథ్యంలో సంబరాలను చేసుకునే అవకాశం లేకుండా ఓ వైపు కరోనా కాటువేస్తుండగా, మరోవైపు సొంత పార్టీ ప్రజాప్రతినిథిల్లోనూ అసహనం వెల్లివిరుస్తోంది. ఇటీవల నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తాను మొదటి నుంచి వైసీపీలో కొనసాగుతున్నా.. మధ్యలో వచ్చినవారికే పదవులు దక్కుతున్నాయని.. తనకు మాత్రం మంత్రిపదవి లభించలేదని అసహనం వ్యక్తం చేసిన వీడియో ఇప్పటికే వెలుగుచూసింది. ఈ క్రమంలోనే తాజాగా నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజు కూడా పార్టీ అధిష్టానంపై తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు.

పార్టీ అధిష్టానంపై, పార్టీపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీలోకి వస్తానని బతిమాలి రాలేదని, రమ్మని వాళ్లు పదే పదే బతిమాలితేనా వచ్చానని అన్నారు. తాను వైసీపీ పార్టీకి చెందిన ఎంపీనని.. అయితే తనకే పార్టీ అధినేత, ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కల్పించకపోతే.. ఇక పార్టీలోని దిగువ క్యాడర్ పరిస్థితి ఏంటని.. ద్వితీయశ్రేణి కార్యకర్తలు పరిస్తితి ఎలా అని ఆయన విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజు వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. ఆ పార్టీ ఉన్నత స్థాయి నాయకత్వంపైనా విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి సీఎంను కలిసేందుకు అనుమతి ఇవ్వనుందుకే మీడియా ముందు స్పందిస్తున్నానని చెప్పారు.

ప్రభుత్వం చేపడుతున్న పథకాల్లో అక్రమాలను అధినేత దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం లేకుండా పోతోందని అన్నారు. ఇలా చేస్తే ప్రభుత్వం అప్రతిష్టపాలు కావడం ఖాయమని అభిప్రాయపడ్డారు. మరీముఖ్యంగా ప్రతిష్ఠాత్మక పథకం జగనన్న ఇళ్ల పథకంలో స్థలాల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆయన.. ఈ స్థలాల కొనుగోళ్లలో కూడా అమ్యామ్యాల పరం నడుస్తోందని ఆరోపించారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా.. భూములు కొనుగోలు చేసి పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం చూస్తుంటే.. కమీషన్లతో కడుపు నింపుకుందామని మరికోందరు కాచుకుకూర్చుంటున్నారని ఆయన విమర్శించారు.

తిరుమల భూములు, ఇసుక నల్లబజారుకు.. భూముల కొనుగోళ్ల కమీషన్ సహా పలు అంశాలపై తాను మాట్లాడితే.. అందుకు నోచ్చుకున్న కోందరు తనను విమర్శిస్తున్నారని అన్నారు. పార్టీ అభిమానులు కూడా తనను తప్పుబట్టారని అన్నారు. వీటిలో ఎక్కడ, ఎలా అన్యాయం, అక్రమం రాజ్యమేలుతుందో చెప్పడానికి తాను స్వయంగా ముఖ్యమంత్రికి వివరించేందుకు ఆయన సమయాన్ని కోరానని అన్నారు. అయితే తనకు సమయాన్ని కేటాయించలేదని, అందుకు కూడా కొందరు అగ్రనాయకులే కారణమన్న ఆయన.. పాలకులకు చెప్పాలనుకున్న విషయాలను మరో మార్గం లేక ప్రజలకు మీడియా ముఖంగా చెప్పానన్నారు. 

కాగా తమ పార్టీలో విచిత్రమైన సిద్ధాంతం ఉందన్నారు. ఎవర్నైనా విమర్శించాలని పార్టీ భావిస్తే.. ఆదే సామాజిక వర్గానికి చెందిన నేతలతో విమర్శలు గుప్పిస్తారని ఎద్దేవా చేశారు. ఈ తరహాలోనే తనపై ఎమ్మెల్యే ప్రసాదరాజు చేత కామెంట్లు చేయించారని అన్నారు. అయితే తనను విమర్శిస్తే ప్రసాదరాజుకు మంత్రిపదవి రావచ్చు.. అది రావాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. తనను వైసీపీ పార్టీలోకి రావాలని నేతలు కాళ్లా వేళ్లా బతిమిలాడితేనే తాను వచ్చానని అంతేకానీ.. తాను ఎవరికీ తాను ప్రాధేయపడలేదని అన్నారు. ఇక నరసాపురంలో తాను ఎవరి దయాభిక్షంతో గెలవలేదని, ఎక్కువ మాట్లాడితే తనను చూసే కొందరు ఎమ్మెల్యేలకు ప్రజలు ఓట్లు వేశారని రఘురామ కృష్ణం రాజు అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raghu Rama Krishnam Raju  YSRCP  High Command  party posts  Narsapuram MP  Andhra Pradesh  Politics  

Other Articles