AP govt slashes charges for COVID-19 tests by private labs ప్రైవేటు ల్యాబ్ లలో కరోనా పరీక్షలు.. ఫీజుపై ప్రభుత్వ నియంత్రణ

Andhra pradesh govt slashes charges for covid 19 tests by private labs

coronavirus, covid-19 tests, corona virus test fees, private labs, check on corona test fees, vijayawada, Anantapur, Kakinada, Andhra pradesh, Politics

Andhra Pradesh Health Ministry said that the government has reduced the rates of the COVID-19 tests conducted by private laboratories from Rs 4,500 to Rs 2,900. The lowering of rates for the tests would provide a relief to the people.

ప్రైవేటు ల్యాబ్ లలో కరోనా పరీక్షలు.. ఫీజుపై ప్రభుత్వ నియంత్రణ

Posted: 06/13/2020 11:58 PM IST
Andhra pradesh govt slashes charges for covid 19 tests by private labs

దేశంలో కరోనా ప్రభావితం బారిన పడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్న క్రమంలో పరీక్షలన్నీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహించాలంటే ఇబ్బందలు ఏర్పడుతున్న క్రమంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ల్యాబ్ ల్లో కూడా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అనుమతులు మంజూరి చేసింది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఉన్న ల్యాబ్ లు ముందుకు రావాలని ఈ సందర్భంగా ప్రభుత్వం సూచించింది. ఎన్ఏబిఎల్, (NABL), ఐసిఎంఆర్ (ICMR) గుర్తించిన ల్యాబ్ ల కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మార్చి 28న ఐసీఎంఆర్ కొన్ని ప్రభుత్వ, మరికొన్ని ప్రైవేట్ ల్యాబ్ లకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, రంగరాయ మెడికల్ కాలేజీ (కాకినాడ), సిద్ధార్థ మెడికల్ కాలేజీ (విజయవాడ), ప్రభుత్వ మెడికల్ కాలేజీ (అనంతపురం), గుంటూరు మెడికల్ కాలేజీల్లో మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ ల్యాబుల్లో కరోనా పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.

కరోనా మహమ్మారి అంటే ప్రజల్లో నెలకొన్న భయాన్ని ప్రైవేటు ల్యాబ్ లు క్యాష్ చేసుకోవడానికి వీల్లేకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. కరోనా పరీక్షలకు వసూలే చేసే రుసుముపై చెక్ పెట్టింది. కరోనా పరీక్ష కోసం ఒక్కో రోగి నుంచి కేవలం రూ.2900 మాత్రమే బిల్లు వసూలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకు సిద్ధంగా ఉన్న, ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్న ల్యాబ్‌లు ముందుకు రావాలని కోరింది. కాగా, కరోనా ప్రభావం అధికంగా వున్న మహారాష్ట్రలో మాత్రం అక్కడి ప్రభుత్వం మరింత తక్కువ ధరకు కరోనా పరీక్షలను నిర్వహిస్తోంది. కేవలం ఒక్కో రోగి నుంచి రూ.2200 మాత్రమే వసూలు చేస్తోంది. అయితే ఇళ్లకు వచ్చి సాంపిళ్లు తీసుకెళ్తే మాత్రం రూ.2800 చెల్లించాలని తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  covid-19 tests  private labs  Andhra pradesh  Politics  

Other Articles