Mulling reduction of syllabus: HRD minister అప్పటి వరకూ విద్యా సంస్థలు, పాఠశాలలు తెరుచుకోవా..?

Hrd minister says centre planning to reduce school syllabus

HRD Ministry, Ramesh Pokhriyal 'Nishank', school syllabus, lockdown, Coronavirus, Covid-19, schools reopen, educational institutions, school working hours, nation news

Union Minister of Human Resource Development Ramesh Pokhriyal 'Nishank' has said that the Centre is 'planning to reduce the syllabus and instructional hours for schools in the next academic year.

అప్పటి వరకూ విద్యా సంస్థలు, పాఠశాలలు తెరుచుకోవా..?

Posted: 06/10/2020 03:18 PM IST
Hrd minister says centre planning to reduce school syllabus

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆకస్మాత్తుగా విధించిన లాక్ డౌన్ తో దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు అన్ని మూతపడ్డాయి. అయితే ఐదో విడత లాక్ డౌన్ నేపథ్యంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు కూడా పలు సడలింపులు ఇవ్వడంతో మార్చి 22 నుంచి స్థంబించిన జనజీవనం ఇక సాగడం ప్రారంభమైంది. దుకాణాలు, ఆ తరువాత బస్సులు, రైళ్లు, విమానాలు ఇలా ఒక్కొక్కటిగా అన్ని తమ సేవలను అందిస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా కేసులు మళ్లీ దేశంలో విజృంభిస్తున్నాయి. దీంతో ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు మరోమారు కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం.. ప్రభుత్వ ఉద్యోగులలో కేవలం 20శాతం మందికి మాత్రమే కార్యాలయాలు వచ్చేవిధంగా అనుమతించింది, మిగిలిన వారిని ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతించింది.

దేశంలోని విద్యాసంస్థలు, పాఠశాలల కోసం కూడా తెరుస్తారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ కూడా దీనిపై స్పందించింది. దేశంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల స్కూల్స్, పాఠశాలలు అన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి ఎప్పుడు తగ్గుతుందో.? స్కూల్స్ ఎప్పుడు రీ-ఓపెన్ చేస్తారో అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.! అయితే తాజాగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆగస్టు 15 తర్వాతే స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్ చేస్తామని చెప్పారు.

దీంతో పాటు విద్యాసంస్థలు తెరిచినా.. వాటి పనివేళలతో పాటు కరో్నా నివారణ, నియంత్రణ చర్యలను పాటించేలా చర్యలు తీసుకునేలా అదేశాలను జారీ చేస్తామన్నారు. దేశానికే అత్యంత కీలకంగా మారిన మానవ వనరులకు వైరస్ బారిన పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇక రానున్న విద్యాసంవత్సరంలో పాఠ్యాంశాల సిలబస్ ను కూడా తగ్గించేందుకు తాము చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలతో పాటు మేధావులు, విద్యావంతుల నుంచి కూడా సలహాలు సూచనలు స్వీకరిస్తున్నామని కేంద్ర మానవ వనరుల మంత్రి రమేష్ పోక్రియాల్ అన్నారు.

ఇక ఇదే విషయంపై టీఎస్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ స్పందించారు. తెలంగాణలో ప్రైవేట్ స్కూల్స్ ఇప్పట్లో తెరిచే ఆలోచన లేదని ఆయన తేల్చి చెప్పారు. దసరా వరకు స్కూళ్లు తెరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మూడు నెలలు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చూసిన తర్వాత స్కూళ్ళు, పాఠశాలలు తెరవడంపై ఆలోచిస్తామన్నారు. స్కూళ్లలో శానిటైజేషన్ నిబంధనలు, భౌతిక దూరం పాటించడం వంటివి కష్టతరమని చెప్పుకొచ్చారు. కాగా, జులై 1 నుంచి 15వ తేదీ వరకు సీబీఎస్‌ఈ, ఐసీఎస్ఈ/ఐఎస్‌సీ ఎగ్జామ్స్ జరగాల్సి ఉండగా.. జులై 26న నీట్, జూలై 18 నుంచి 23 వరకు జేఈఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles