Supreme Court order on migrant workers వలస కార్మికులపై లాక్ డౌన్ కేసులను ఉపసంహరించండీ: సుప్రీం

Supreme court asks govt to end prosecution of migrants

coronavirus, covid-19, Supreme Court, migrant workers, Central government, State governments, prosecution, native places, national lockdown, politics

The Supreme Court said migrant workers should not be prosecuted for trying to reach home amid the national lockdown. A Bench led by Justice Ashok Bhushan directed the Centre and the States to withdraw any complaint or prosecution lodged against migrant labourers who had set out on foot from big cities for their native villages to escape starvation, unemployment and disease during the pandemic.

వలస కార్మికులను పక్షం రోజుల్లో స్వస్థలాలకు పంపండీ: సుప్రీం

Posted: 06/10/2020 02:52 PM IST
Supreme court asks govt to end prosecution of migrants

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా కేంద్రం దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్.. వలస కార్మికులకు శాపంగా పరిణమించిందన్న విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో చేతిలో పనిలేక.. తినడానికి తిండి లేక.. తమ భార్యబిడ్డలకు దూరంగా.. కన్నవారికి ఉన్న ఊరికి దూరంగా బతకాల్సిరావడంతో అనేక మంది వలస కార్మికులు తమ తట్టబుట్టా తలపై పెట్టుకుని నడుచుకుంటూ వందల కిలోమీటర్ల దూరం నడిచిన ఘటనలు నమోదు చేసుకున్నాయి. ఈ క్రమంలో వలస కార్మికులపై పలు రాష్ట్రాల పోలీసులు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని పేర్కోంటూ కేసులు నమోదు చేశారు.

ఈ విషయమై ఇవాళ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వలస కార్మికులకు సానుకూలంగా అదేశాలను జారీ చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు వలస కార్మికుల విషయంలో తాము జారీ చేసిన ఉత్తర్వులను పాటించాలని అదేశించింది. వలస కార్మికుల అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్న వలస కూలీలను గుర్తించి పక్షం రోజుల్లో తరలించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. రాష్ట్రాలు అడిగిన 24 గంటల వ్యవధిలో కేంద్ర రైల్వేమంత్రిత్వశాఖ శ్రామిక్‌ రైళ్లు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సూచించింది.

వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లే ప్రయత్నంలో వారిపై పోలీసులు మోసిన లాక్ డౌన్ ఉల్లంఘనల కేసులు ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. స్వస్థలాలకు చేరుకున్న వలస కూలీలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నాయి, వారికి ఎలాంటి ఉపాధి కల్పిస్తున్నారో వివరిస్తూ హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. దీనికి సంబంధించిన నివేదికను అందజేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు జులై 8కి వాయిదా వేసింది. లాక్ డౌన్‌ విధించిన తర్వాత వలస కార్మికులు కాలినడకన స్వస్థలాలకు బయలుదేరిన ఘటనలు చూసిన సర్వోన్నత న్యాయస్థానం వలస కూలీల అంశాన్ని సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  covid-19  Supreme Court  migrant workers  

Other Articles