TS SSC Exams 100 percent results this Year పదో తరగతి పరీక్షల్లో ఈ సారి వంధశాతం ఉత్తీర్ణత.. గ్రేడింగ్ ఇలా..

100 percent results in telangana ssc exam this year

High Court of Telangana, ts ssc exams 2020, ts ssc 2020 exams, ts 10th exams 2020, cm kcr, telangana 10th 2020 results, telangana 10th exams, SSC exams, tenth students, telangana government, High Court, GHMC SSC Students, CM KCR, telangana, Politics

After Chief Minister KCR has announced that the TS SSC 2020 examinations would not be conducted this year. Now the Teachers estimate that this will lead to 100 percent result in the state as there will be no student left with abscent in school internal and formative tests.

పదో తరగతి పరీక్షల్లో ఈ సారి వంధశాతం ఉత్తీర్ణత.. గ్రేడింగ్ ఇలా..

Posted: 06/09/2020 09:51 PM IST
100 percent results in telangana ssc exam this year

(Image source from: Indianexpress.com)

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆకస్మాత్తుగా విధించిన లాక్ డౌన్ లో తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మధ్యలోనే వాయిదా పడ్డాయి. అయితే ఈ పరీక్షలను నిర్వహణలో రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు విధించిన ఆంక్షల నేపథ్యంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం.. పరీక్షలను రద్దు చేసింది. కరోనా వ్యాప్తి అధికంగా వున్న గ్రేటర్ హైదరాబాద్ సహా రంగారెడ్డి, మల్కాజ్ గిరి ప్రాంతాల్లోని విద్యార్థులకు సప్లిమెంటరీ సమయంలో పరీక్షలను నిర్వహించాలని, ఇక వాటిని కూడా రెగ్యూలర్ పరీక్షలుగానే పరిగణించాలన్న అదేశాలు జారీ చేసింది. వీటిని పరిశీలించిన ప్రభుత్వం పరీక్షల నిర్వహణ కన్నా ఇంటర్నల్ మార్కుల ఆధారంగా వారిని ప్రమోట్ చేయడం ఉత్తమమని భావించి పరీక్షలను రద్దు చేసింది. ఈ తరుణంలో విద్యార్థులకు గ్రేడింగ్ ఎలా నిర్వహిస్థారు.. పరీక్షల ఫలితాలు ఎప్పుడిస్తారు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

పదో తరగతి పరీక్షల ఫలితాలను మరో పక్షం రోజుల్లో ప్రకటించనున్నారు. అయితే ఈ సారి ఎక్కువ మంది విద్యార్థులకు ఎ1 గ్రేడ్‌ దక్కే అవకాశం ఉంది. పాఠశాల స్థాయిలో నిర్వహించే ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలను ఆధారంగా చేసుకుని ఈ సారి పదవ తరగతి గ్రేడ్లను విద్యాశాఖ ప్రకటించనుంది, కాగా, ఈ పాఠశాల స్థాయిలో కనీస మార్కులు సాధించని వారు అత్యంత అరుదుగా ఉండటమని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. ఒక్క ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ పరీక్ష రాసిన విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతారని అంటున్నారు. పాఠశాలలు నిర్వహించే నాలుగు పరీక్షలను రాయకుంటే తప్ప ఫెయిల్‌ అయ్యే అవకాశం లేదని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో గత ఏడాది ఉత్తీర్ణత సగటు 93 శాతం ఉండగా.. సప్లిమెంటరీలో పాసైన వారిని తీసుకుంటే 98కి పెరిగింది. ఈ సారి 100 శాతం ఉత్తీర్ణులయ్యే అవకాశం కనిపిస్తోంది.

అంతర్గత పరీక్షలలో 20 మార్కులకు హిందీలో 4 వస్తే పాసైనట్లే. హిందీలో వందకు 20 మార్కులు, మిగిలిన అయిదు సబ్జెక్టుల్లో 35 మార్కులు వస్తే ఉత్తీర్ణులైనట్లుగా పరిగణిస్తారు. ఎఫ్‌ఏ పరీక్షలు 20 మార్కులకు నిర్వహిస్తారు. అంటే అప్పుడు హిందీలో4 మార్కులు వస్తే వందకి 20వస్తాయి. మిగిలిన సబ్జెక్టుల్లో 20కి 7 మార్కులు వస్తే అప్పుడు 35 మార్కులు దక్కుతాయి. ఆ మార్కులు వచ్చిన వారు ఉత్తీర్ణులైనట్లే. ఇక ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌లు నాలుగు నిర్వహిస్తారు. వాటిని ఎఫ్‌ఏ-1, 2, 3, 4గా పిలుస్తారు. ఇవి ప్రతి రెండు నెలలకు ఒకసారి జరపుతారు. వీటిల్లో వచ్చిన మార్కులనే ఇప్పుడు ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఒక్కో పరీక్షను 20 మార్కులకు నిర్వహించి తదుపరి 5 మార్కులకు కుదిస్తారు.

వీటితో పాటు ప్రాజెక్టు వర్క్ కు 5 మార్కులు, నోట్ బుక్స్ కు మార్కులు ఉంటాయి. ఇంకా తరగతి గది స్పందనకు 5 మార్కులు ఉంటాయి.. అలా 5+5+5+5 మొత్తం 20 మార్కులకు ఒక ఎఫ్‌ఏ నిర్వహిస్తారు. సంవత్సరంలో 4 ఎఫ్‌ఏలు నిర్వహిస్తారు అంటే 20+20+20+20=80 మార్కులు. వాటిని సరాసరి చేసి 20 మార్కులకు కుదిస్తారు. ఆ ప్రకారం ఒక్కో సబ్జెక్టులో 20 మార్కులకు ఎన్ని వచ్చాయో లెక్కించి వాటిని ఫిబ్రవరిలో ప్రభుత్వ పరీక్షల విభాగానికి పంపుతారు. ఇలా వీటిని కూడా వందకు లెక్కించి దానిని మార్కులుగా పరిగణిస్తారు. ఇలా మొత్తం క్రోడికరించిన తరువాత వారికి వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్ లను ప్రకటిస్తారు. దీంతో ఈ సారి రాష్ట్రంలో వంద శాతం ఉత్తీర్ణత సాథ్యపడుతుందని అద్యాపక బృందాలు తెలుపుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles