Coronavirus pandemic getting worse: WHO మరింత తీవ్రమవుతున్న కరోనా: డబ్ల్యూహెచ్ఓ

Coronavirus who says pandemic getting worse globally

World, Coronavirus pandemic, WHO, coronavirus cases worldwide, coronavirus vaccine, coronavirus cure, coronavirus cases india, covid-19, WHO on coronavirus. Coronavirus, WHO, coronavirus cases, corona vaccine, coronavirus deaths, coronavirus india, covid-19, Johns Hopkins University

The World Health Organization warned against complacency and urged countries to continue their efforts to curb the spread of the novel coronavirus as the pandemic was getting worse globally. There are more than 71.21 lakh coronavirus cases worldwide. Covid-19 has killed over 4.06 lakh people.

మరింత తీవ్రమవుతున్న కరోనా మహమ్మారి: ప్రపంచ ఆరోగ్య సంస్థ

Posted: 06/09/2020 06:23 PM IST
Coronavirus who says pandemic getting worse globally

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి మరింత తీవ్రరూపం దాల్చుతుందని, ఈ క్రమంలో ప్రపంచ దేశాలు దానిని నియంత్రించేందుకు మరిన్నీ కఠిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ అరోద్య సంస్థ సూచించింది. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా ఈ మహమ్మారి అల్లకల్లోలం సృష్టించే పరిస్థితి ఉందని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. యూరోప్ దేశాల్లో కరోనా తగ్గుముఖం పట్టిందని గణంకాలు స్పష్టం చేస్తూ కాసింత ఊరట కల్పిస్తున్న తరుణంలోనే.. ఉ్తతర, లాటిన్ అమెరికా ఖండాలతో పాటు దక్షిణాసియా దేశాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని అందోళన వ్యక్తం చేసింది.

కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిందన్న తరుణంలోనే కొత్త ప్రాంతాలకు విస్తరిస్తూ మరింత తీవ్రరూపం దాల్చుతుండటం అందోళన కలిగిస్తోందని. డబ్ల్యూహెచ్ఓ సంస్థ పేర్కోంది. ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల వ్యవధిలో నమోదైన కేసుల్లో అత్యధికం కేవలం 10 దేశాల నుంచే ఉన్నాయని సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గడచిన 9 రోజుల్లో లక్షకు పైగా కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఒక్క రోజులో అత్యధికంగా 1,36,000 కేసులు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. ఆఫ్రికా దేశాల్లో కరోనా మహమ్మారి రోజురోజుకీ తన ప్రభావాన్ని వ్యాప్తి చేసుకుంటోందని టెడ్రోస్‌ పేర్కొన్నారు. చాలా దేశాల్లో కేసులు వెయ్యికి తక్కువగానే ఉన్నప్పటికీ.. రోజురోజుకీ కొత్త ప్రాంతాలకు విస్తరిస్తుండటం అందోళనకరమని తెలిపారు.

అయితే, ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో వైరస్‌ ప్రభావం క్రమంగా తగ్గుతుండడం ఊరట కలిగిస్తోందన్నారు. కానీ, ఈ దేశాల్లో ప్రజలు ఇక నుంచి ఎంతమేర నిబంధనలకు కట్టుబడి ఉంటారన్నది సవాల్‌గా మారిందన్నారు. అనేక దేశాల్లో సామూహిక నిరసనలు కొనసాగుతుండడం పట్ల విచారం వ్యక్తం చేశారు. వీటి వల్ల ప్రజలు నిబంధనలు అతిక్రమిస్తున్నారని.. ఇది మారోమారు మహమ్మారి విజృంభించేందుకు కారణమవుతుందని హెచ్చరించారు. అమెరికాలో ఆఫ్రో-అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా వ్యక్తవుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జాతి సమానత్వం దిశగా సాగే పోరాటానికి డబ్ల్యూహెచ్‌ఓ మద్దతు ఉంటుందని టెడ్రోస్‌ హామీ ఇచ్చారు. కానీ, నిబంధనలు పాటిస్తూ నిరసనలు వ్యక్తం చేయాలని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles