Yadadri Sri Laxmi Narasimha Swamy Temple reopens భక్తులకు యాదాద్రిలో లక్ష్మీనరసింహుడి దర్శనం..

Yadadri sri laxmi narasimha swamy temple reopens for devotees

coronavirus, covid-19, Telangana Tirupati. Yadadri temple, Yadadri Sri Laxmi Narasimha Swamy Temple, Sri Laxmi Narasimha Swamy Temple, karimnagar rajarajeshwari temple, kanaka durga temple, Indrakeeladri, mask mandatory for diety darshan, social distancing darshan, andhra pradesh, Telangana, politics

After nearly 80 days, India's famous Sri Laxmi Narasimha Swamy Temple atop the Yadadri hills here reopened on Monday with new health norms in place to check the spread of coronavirus. The famous shrine was reopened for 'darshan' at 6 am and end at 7:30 pm.

భక్తులకు యాదాద్రిలో లక్ష్మీనరసింహుడి దర్శనం.. భక్తులకు ట్రయల్ రన్

Posted: 06/08/2020 09:04 PM IST
Yadadri sri laxmi narasimha swamy temple reopens for devotees

దేశంలో ఐదవ విడత లాక్ డౌన్ లో భాగంగా యావత్ దేశవ్యాప్తంగా ఆలయాలు, ప్రార్థనా మందిరాల తలుపులు తెరుచుకున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధన ఆలయాలు భక్తుల ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ తిరుపతిగా బాసిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కళకళలాడింది. లక్ష్మీనృసింహస్వామి వారి దర్శనాలు ప్రారంభం కావడంతోనే భక్తులు ప్రత్యేక కైంకర్యపూజలకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. ఇక స్వామివారి దర్శనానికి భక్తులతో పాటు స్థానికులు కూడా పోటీపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొవిడ్‌ నిబంధనలు ఆచరిస్తూ భక్తులు దర్శనానికి క్యూలైన్లలో వేచివున్నారు. భక్తులందరూ మాస్కులు తప్పక ధరించాలన్న నిబంధన కూడా అమల్లోకి వచ్చింంది. ఆలయ నిర్వాహకులు ఉదయం 8.30 గంటల నుంచి ఉచిత లఘు దర్శనాలను కల్పిస్తున్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ దర్శనాలకు స్థానికులతోపాటు ఆలయానికి చెందిన ఉద్యోగులను అనుమతించారు. లాక్ డౌన్‌ నేపథ్యంలో ఆలయంలో భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్టుల తర్వాతే భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నారు. ఇక పదేళ్లలోపు చిన్నారులతో పాటు 65 ఏళ్ల పైబడిన పెద్దలను దర్శనాలకు అనుమతించడం లేదని ఆలయవర్గాలు తెలిపాయి.

స్వామి, అమ్మవార్ల దర్శనాలతోపాటు ప్రసాదాల విక్రయాలకూ ఏర్పాట్లు చేపట్టామని ఈవో గీతారెడ్డి తెలిపారు. ఆన్ లైన్లో రుసుము చెల్లించిన భక్తుల పేరిట పరోక్షంగా ఆర్జిత పూజలు కొనసాగిస్తామని ఆమె వివరించారు. ఆలయంలో ఏర్పాట్లను కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ పరిశీలించారు. అటు...బెజవాడ కనక దుర్గమ్మ ఆలయంలో పలు ఆంక్షలతో భక్తులను దర్శనాలకు అనుమతించారు అధికారులు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముందుగా ట్రయల్ రన్ రూపంలో దర్శనాలు కల్పిస్తున్నారు. అనంతరం సామాన్య భక్తులకు దర్శన భాగ్యం లభిస్తుంది. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో దర్శనాలకు అనుమతించే ముందు భక్తులకు థర్మల్‌ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles