10th class students to be promoted in Telangana పదో తరగతి విద్యార్థులందరూ ఉన్నత విద్యకు అర్హులే..!

Ts ssc exams 2020 cancelled 10th class students to be promoted sans exams in telangana

High Court of Telangana, ts ssc exams 2020, ts ssc 2020 exams, ts 10th exams 2020, cm kcr, telangana 10th 2020 results, telangana 10th exams, SSC exams, tenth students, telangana government, High Court, GHMC SSC Students, CM KCR, telangana, Politics

Chief Minister KCR has announced that the TS SSC 220 examinations would not be conducted this year. Following the Hyderabad High Court order, the exams now have been cancelled. All the TS 10th Standard students would be promoted to next class without any examinations this year

పదో తరగతి పరీక్షలు రద్దు.. విద్యార్థులందరూ ప్రమోట్..!

Posted: 06/08/2020 09:12 PM IST
Ts ssc exams 2020 cancelled 10th class students to be promoted sans exams in telangana

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆకస్మాత్తుగా విధించిన లాక్ డౌన్ లో తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మధ్యలోనే వాయిదా పడ్డాయి. అయితే ఈ పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు అనుమతి కోరుతూ ప్రభుత్వం విన్నవించిన నేపథ్యంలో హైకోర్టు అనుమతులు ఇచ్చినా.. ప్రభుత్వం సమర్పించే నివేదిక మేరకు ఈ విషయంలో తుది నిర్ణయాన్ని గత శనివారం ప్రకటించింది. కరోనా వ్యాప్తి వేగంగా విస్తరిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ పురపాలక సంఘంలో విద్యార్థులకు పరీక్షల నుంచి మినహాయింపు కల్పించింది. నగరంలో కరోనా శరవేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకుంది.

జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షకు అనుమతించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో తప్ప మిగతా పిల్లలందరికీ సోమవారం నుండి పరీక్షలు జరగనున్నాయి. గ్రేటర్ పరిధిలోని విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షకు అనుమతించాలని ఆదేశించింది. సప్లిమెంటరీ ఉత్తీర్ణులను కూడా రెగ్యులర్ గా గుర్తించాలని పేర్కొంది. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని, విద్యాశాఖను అదేశించింది. దీంతో ఆదివారం పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఇక సోమవారం రోజున మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.

పరీక్షల సందర్భంగా విద్యార్థులకు కరోనా సోకితే బాధ్యులెవరని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో, పరీక్షలను నిర్వహించడం కంటే... విద్యార్థులను ప్రమోట్ చేయడం ఉత్తమమని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంతో పరీక్షలను పూర్తిగా రద్దు చేసింది. పరీక్షలతో సంబంధం లేకుండానే విద్యార్థులను ప్రమోట్ చేశారు. ఇంటర్నల్స్, అసెస్ మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులను పాస్ చేశారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో మొత్తం 5,34,903 మంది విద్యార్థులు తదుపరి క్లాసులకు వెళ్లనున్నారు. ఇంటర్నల్స్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడులను నిర్ణయించనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పదో తరగతి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పెద్ద టెన్షన్ తొలగిపోయింది. మరోవైపు, డీగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles