(Image source from: Dnaindia.com)
దేశంలో కరోనా విజృంభన మరింత వేగాన్ని అందుకుంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ.. లక్షలాధి మందిని తన ప్రభావానికి గురిచేస్తూ.. లక్షల మంది ప్రాణాలను హరించిన కరోనా మహమ్మారి దేశంలోనూ తన ఉదృతిని శరవేగంగా విస్తరించుకుంటోంది. రోజురోజుకు ప్రజల మనుగడనను ప్రశ్నార్థకంగా మారుస్తూ తన ప్రభావనికి గురిచేస్తున్న వైరస్.. ఇక తన వ్యాప్తిని కూడా పెంచుకుంటోంది. దేశంలో జనవరి 30న తొలి కేసు నమోదైన తరువాత 111 రోజులకు లక్ష కేసులు నమోదు చేసుకుంది. ఆ తరువాత తన వేగాన్ని పెంచుకుంటోన్న మహమ్మారి కేవలం 15 రోజుల్లో మరో లక్ష మందిని తన ప్రభానికి గురిచేసి రెండు లక్షల మార్కును దాటింది.
గత కొన్ని రోజులుగా ఏకంగా ఎనమిది వేలకు పైబడిన సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదుఅవుతుండగా, ఇక తాజగా ఇవాళ ఏకంగా తొమ్మిది వేలకు పైబడిన కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో క్రమంగా కరోనా వైరస్ మహమ్మారి బారిన బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అటు దేశవ్యాప్తంగా నమోదవుతున్న మరణాలు కూడా అందోళన కలిగించే స్థాయికి చేరువవుతున్నాయి. ఐదో విడత లాక్ డౌన్ అమల్లోకి రావడంతో దేశంలో అన్నింటికీ సడలింపులు వచ్చాయి. దీంతో కరోనా కేసులు వ్యాప్తి కూడా గణనీయంగా పెరుగుతోంది.
దేశంలో అటు కరోనా పాజిటివ్ కేసులు, ఇటు కరోనా మరణాలు పెరుగుతుండటంతో దేశ ప్రజల నుంచి అందోళన వ్యక్తమవుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలోనే తొమ్మిది వేలకు మించిన కేసులు నమోదయ్యాయి.. మరణాలు కూడా అత్యధిక సంఖ్యలోనే నమోదవ్వడం కలవరం రేపుతోంది. ఇక ఈ మురణాల్లోనూ యాభై శాతానికి పైగా మహారాష్ట్రలోనే సంభవించడం ఆ రాష్ట్రవాసులను భయాందోళనకు గురిచేస్తోంది. ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 9304 పాజిటివ్ కేసుల నమోదుతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ 2,16,919 కేసులు నమోదయ్యాయి.
ఇక దేశంలో నమోదవుతున్న మరణాలు కూడా ఆందోళన కొనసాగిస్తున్నాయి. దేశంలో మునుపెన్నడూ నమోదు కాని స్థాయిలో మరణాలు సంభవిస్తూ ప్రజలను అందోళనకు గురచేస్తున్నాయి. ఇక తాజాగా గడిచిన 24 గంటల్లో 260 మంది మరణించడం అందోళన కలిగించే విషయం. దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 6000 మార్కును దాటింది. తాజాగా నమోదైన గణంకాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 6075కి మరణాలు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. దేశంలో నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల్లో మహారాష్ట్రలోనే అత్యదికంగా నమోదు కావడం గమనార్హం. ఆ తరువాత కరోనా విజృంభన ఢిల్లీ, తమిళనాడు, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలోనూ అత్యధిక కేసులు నమోదయ్యాయి.
ఈ మహమ్మారి బారిన పడిన వారిలో గత 24 గంటల వ్యవధిలో పలువురు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని దీంతో మొత్తంగా ఇప్పటి వరకు 1,04,107 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 1,06,737 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. గత కొన్నిరోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోండగా, రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశాలు వున్నాయని నిపుణులు అంచనాలు ప్రజలను అందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య దేశంలో 48శాతానికి చేరిందని.. ఇది అత్యధికమని ఐఎంసీఆర్ గణంకాలు స్పష్టంచేస్తున్నాయి.
దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో కరోనా ఉదృతి తీవ్రంగా వుంది. ఫలితంగా రోజురోజుకు పెరుగుతున్న కేసులతో దేశంలో మొత్తంగా నమోదైన కేసులు కరోనా వైరస్ బారిన దేశాల జాబితాలో భారత్ ను ఏకంగా ఏడవ ప్రభావిత దేశంగా నిలిపింది. ఈ వరుసలో ఇటీవలే టర్కీని దాటిన భారత్.. కరోనా ప్రభావిత దేశాల జాబితాలోని మరో రెండు దేశాలైన ఫ్రాన్స్, జర్మనీలను కూడ దాటేసింది. లక్షా 88 వేల కేసులతో ఫ్రాన్స్ 8వ స్థానంలో వుండగా, దానిని కూడా భారత్ అధిగమించింది. ఇక భారత్ ముందు ఇటలీ 2 లక్షల 32 వేల కేసులతో 6వ ప్రభావిత దేశంగా వుంది. అయితే మరణాల్లో నిన్నటివరకు 13వ స్థానంలో ఉన్న భారత్ ఇక తాజాగా మరణాలతో 12వ స్థానానికి ఎగబాకింది.
మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతూనే వుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 2682 కేసులు నమోదయ్యాయి, ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనే 1367 పాజిటివ్ కేసులు నమోదు అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది, గత సోమవారం నుంచి మహారాష్ట్రంలో అత్యధిక కరోనా మరణాలు సంభవించడం అందోళనకరం. దేశంలో నమోదైన కేసుల్లో దాదాపు 36శాతం కరోనా కేసులు మహరాష్ట్ర నుంచినమోదు కావడం.. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 62228కు చేరగా, ఏకంగా 2100 మార్క దాటి మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవవధిలో మహారాష్ట్రలో 85 మరణాలు సంభవించాయి. ఇక మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజునే ఏకంగా 8000 మంది కరోనా నుంచి కోలుకుని అసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఆ తరువాత కరోనా ఉదృతి అధికంగా నమోదవుతున్న తమిళనాడులో గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 830 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసులు సంఖ్య 20246కు చేరాయి. ఆ తరువాత దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కాటువేస్తోంది. ఇక్కడ నిన్న ఒక్కరోజునే 1000 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, దీంతో మొత్తం కరోనా కేసులు సంఖ్య 17 వేల 386కు చేరగా, గడిచిన 24 గంటల్లో 13 మరణాలు సంభవించడంతో మొత్తంగా 316 మంది కరోనా బారిన పడి మరణించారు. ఆ తరువాత గుజరాత్ లోనూ కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ రాష్ట్రంలో నమొత్తం కేసులు సంఖ్య 15,562కి చేరగా, ఏకంగా 942 మంది అసువులు బాసారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more