Telangana reports 129 Cororna Cases in 24 hours తెలంగాణలో కరోనా విజృంభన.. మూడు వేల మార్కు దాటిన కేసులు..

Covid 19 update with 129 cases telangana reaches 3000 mark

coronavirus, coronavirus in Telangana, Telangana coronavirus cases, coronavirus cases in Telangana, coronavirus count in india, india coronavirus count, Tabilghi Jamat Telangana, Tabilghi jamat Telangana cases, Nizamudding event Telangana, Delhi coronavirus cases, Delhi Nizamuddin coronavirus cases, coronavirus india, coronavirus update, coronavirus in india, coronavirus cases, coronavirus cases india, coronavirus update india, coronavirus news, COVID-19, COVID 19 update, coronavirus in ts, coronavirus Hyderabad, Telangana

The coronavirus positive cases in Telangana State have hit a new high with health authorities on Wednesday reporting 129 Covid-19 positive cases and Four fatalities. The cumulative tally of Covid-19 infections so far in Telangana State has also reached the 3000 mark.

తెలంగాణలో కరోనా విజృంభన.. మూడు వేల మార్కు దాటిన కేసులు..

Posted: 06/04/2020 11:57 AM IST
Covid 19 update with 129 cases telangana reaches 3000 mark

(Image source from: english.sakshi.com)

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. రోజురోజుకూ రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు అందోళన కలిగిస్తున్నాయి. వీటికి తోడు మరణాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. తెలంగాణవాసులను ఎంతో కలవరానికి గురిచేస్తున్న మరణాలు ప్రతీ రోజు రాష్ట్రంలో సంభవిస్తుండడం అందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, పోలీసుల సమిష్టి కృషితో రాష్ట్రంలో తగ్గినా.. మళ్లీ పెరుగుతున్న కేసులు, మరణాలు రాష్ట్ర ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. దీంతో ఇటు ప్రభుత్వ, రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, వైద్యాధికారులు, డాక్లర్లు ఎంతగానో శ్రమిస్తున్నా.. ఉపశమనం లభించే వాతావరణం మాత్రం అప్పుడే కనిపించడం లేదు.

ఈ ఏప్రిల్ మాసంలో గణనీయంగా తగ్గిన కేసులు మే నెల 7 నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోన్నాయి. కాగా ఈ నెలలో రాష్ట్రంలో నమోదైన కేసులన్నీ రమారమి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే. గ్రేటఱ్ పరిధిలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. నగరం చుట్టూరా కరోనా మహమ్మారి మాటు వేయడం అందోళన రేపుతోంది. అయితే గ్రేటర్ లో కరోనా నియంత్రణకు కఠినమై చర్యలు తీసుకున్నా.. వ్యాప్తి మాత్రం అగడం లేదు. ఇవాళ తాజాగా నమోదైన కేసులలోనూ అత్యధిక కేసులు గ్రేటర్ కు పరిధిలోనివే కావడం గమనార్హం.

ఫలితంగా తెలంగాణలో అంతకంతకూ పెరుగుతున్న కేసులు తాజాగా మంగళవారం నాటి నుంచి ఇవాళ్లి సాయంత్రం వరకు నమోదైన కేసులతో కలిపి మొత్తంగా మూడు వేల మార్కును అధిగమించాయి, తాజాగా రాష్ట్రంలో 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ లో ఇదివరకు ఎన్నడూ నమోదు కాని అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవాళ గ్రేటర్ పరిధిలో ఏకంగా 108 కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు రాష్ట్రంలోని ఎనమిది జిల్లాలో కరోనా వ్యాప్తి చెందడం ప్రభుత్వానికి సవాల్ లా పరిణమించింది.

రంగారెడ్డి జిల్లాలో 6, కుమరం భీం జిల్లాలో ఆరు, అసిఫాబాద్ జిల్లాలో 6, మేడ్చల్ జిల్లాలో 2, రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు కరోనా కేసులు నమెదు అయ్యాయి. దీంతో పాటు యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున కరోనా సోకినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసులు మొత్తంగా 3020కి చేరింది. ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యిందిని రాష్ట్ర వైద్య అరోగ్యశాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో మరణాల సంఖ్య మళ్లీ పెరిగింది. రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో ఏగడుగురు కరోనా బారిన పడి అసువుల బాసారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 99కి చేరింది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా పెరుగుతుండటం అందోళనకర పరిణమం.

తాజాగా నమోదైన ఇవాళ నమోదైన 129 కేసులతో మొత్తంగా రాష్ట్రంలో 3020 కేసులు నమోదయ్యాయి, ఇక ఇవాళ రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా అధికంగానే సంభవించాయి, ఇవాళ ఏకంగా నలుగురు కరోనా బారిన పడి చికిత్స పోందుతూ అసువులు బాసారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా 99కు చేరింది. కరోనా బారినపడిన బాధితులు కోలుకొని మొత్తంగా 15256 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1365 యాక్టివ్‌ కేసులు వున్నాయని వారంతా గాంధీ అసుపత్రిలో చికిత్స పోందుతున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇక వీరిలో 2572 మంది రాష్ట్రావాసులు కాగా, 448 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారని ఆరోగ్యశాఖ పేర్కోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles