TRAI says mobile number will remain 10 digits 11 అంకెల ఫోన్ నెంబర్.. క్లారిటీ ఇచ్చిన ట్రాయ్..

10 digit mobile numbers to continue no shift to 11 digits trai

trai, mobile numbers, 10 digit mobile number, 11 digit mobile number, no change in mobile numbers, clarification trai, mobile numbers, mobiles, telecom

Telecom Regulatory Authority of India (TRAI) has said that as per its recommendations the country will continue with 10-digit numbering for mobile telephone services and it has categorically rejected shifting to 11-digit mobile numbering plan.

11 అంకెల ఫోన్ నెంబర్.. క్లారిటీ ఇచ్చిన ట్రాయ్..

Posted: 06/01/2020 11:01 PM IST
10 digit mobile numbers to continue no shift to 11 digits trai

దేశంలోని వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన 4జీ సర్వీసులు కూడా అధునీకరించబడుతున్న రోజలివి. ఇక త్వరలోనే 4జీ టెక్నాలజీ పోయి 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఇక స్మార్ట్ ఫోన్ అంటే సోషల్ స్టేటస్ సింబల్ అన్న నానుడి పోయి మినిమమ్ కమాండిటీగా మారిపోయింది. దేశంలోని కూలీల నుంచి రైతుల వరకు అందరూ స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. దీంతో దేశంలో ఏకంగా 130 కోట్ల మందిలో ఏకంగా 30 కోట్ల మందికి పైగా స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. దీంతో ఫోన్ నెంబర్ల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి.

మొబైల్ ఫోన్ నెంబర్లు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశంలోని ఫోన్ వినియోగదారులందరికీ అందుబాటులో్కి మరిన్ని ఫోన్ సర్వీసులు తీసుకువచ్చేందుకు పది అంకెల మొబైల్ నెంబర్ ఇకపై 11 నెంబర్లుగా మారుతుందని వార్తలు వినిపించాయి. ఈ మేరకు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా పలు సూచనలు చేసిందని కూడా వార్తలు వినిపించాయి. ఇప్పటి వరకు ఏ జిల్లాలో ఉన్నా, ఏ రాష్ట్రమైనా మొబైల్ ఫోన్ నెంబరుకు వుంటే అంకెలు మాత్రం కేవలం 10 మాత్రమే. అయితే ఈ విషయంలో తాజాగా ట్రామ్ క్లారిటీ ఇచ్చింది. ఇకపై కూడా మొబైల్ ఫోన్ నెంబర్లకు కేవలం పది అంకెలు మాత్రమే వుంటాయని చెప్పింది.

ప్రస్తుతం వున్న నెంబర్లు ఇకపై కూడా కంటిన్యూ అవుతాయి. ఇక నుంచి మన దేశంలో విడుదల చేయబోయే ఫోన్ నంబర్ల సంఖ్యను 11కు పెంచుతున్నట్టు వచ్చిన వార్తలను ట్రాయ్ ఖండించింది. 10-అంకెల నెంబర్ విధానం కొనసాగుతుందని స్పష్టం చేసింది. 'మొబైల్ సేవల కోసం 11 అంకెల నంబరింగ్ ప్లాన్‌ను ట్రాయ్ సిఫారసు చేసినట్లు కొన్ని మీడియా సంస్థలలో వార్తలు వచ్చాయి. దేశంలో 10-అంకెల నెంబర్ విధానం కొనసాగుతుంది. మేము 11-అంకెల నంబరింగ్ ప్లాన్‌కు మార్చబడుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండిస్తున్నాం' అని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles