AP minister family goes self-quarantine క్వారంటైన్ లో ఏపీ మంత్రి కుటుంబం.. ముగ్గరికి పాజిటివ్..

Andhra pradesh minister family goes self quarantine

covid-19, coronavirus, coronavirus, covid-19, lockdown, BC welfare minister, AP minister, Shanker Narayana, corona spread, Andrha pradesh coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates

Andhra pradesh Backward classes welfare minister Shankar Narayana and his family goes self-quarantine after his aunt who was tested corona positive after she dies. The minister is tested negative but goes into self quarantine as three of his family members were tested positive.

ఆంధ్రప్రదేశ్ కరోనా కలకలం.. క్వారెంటైన్ లోకి మంత్రి సహా కుటుంబం

Posted: 06/01/2020 10:54 PM IST
Andhra pradesh minister family goes self quarantine

ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ శాఖ మంత్రి శంకర్‌ నారాయణ ఇంట్లో కరోనా కలకలం చెలరేగింది. మంత్రి కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు కరోనా బారినపడినట్టు తెలుస్తోంది. దీంతో అమాత్యులవారికి కూడా హుటాహుటిన వైద్యాధికారులు పరీక్షలు చేయగా.. ఆయనకు నెగిటివ్ ఫలితం రావడంతో అధికారులు, మంత్రి అనుయాయువులు ఊపిరి పీల్చుకున్నారు. మంత్రికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ రిపోర్ట్‌ వచ్చినట్టుగా వైద్యాధికారులు తెలిపారు. మంత్రి శంకర్‌ నారాయణ మేనత్త కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆమె చికిత్స తీసుకున్నారు.

శనివారం రోజున అమె మరణించారు. ఆమె అనారోగ్యం కారణంగా చనిపోయి ఉంటుందని అందరూ భావించారు. అయితే ఎందుకైనా మంచిదని అనుమానంతో మరణించిన తరువాత అమె మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అమె రిపోర్టులను వైద్యులు షాకయ్యారు. మంత్రి మేనత్తకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. అయితే అప్పటికే అమె అంత్యక్రియలకు మంత్రి కుటుంబసభ్యులు హజరయ్యారు. దీంతో మంత్రితో పాటుగా ఆయన కుటుంబసభ్యులందరికీ వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. మంత్రి శంకర్ నారాయణకు నెగిటవ్ అని తేలింది.

అయితే మంత్రి కుటుంబంలోని ముగ్గురు సభ్యులకు మాత్రం కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మంత్రితో పాటు ఆయన కుటుంబం మొత్తం స్వయం నిర్భంధంలోకి వెళ్లారు. ఇక మంత్రి నివసిస్తున్న అనంతపురం జిల్లా ధర్మవరంలోని సాయినగర్‌ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ జోన్ గా ప్రభుత్వం ప్రకటించారు. కాలనీ అంతా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతం మొత్తాన్ని శానిటైజ్‌ చేశారు. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని సూచించారు. ఈ ప్రాంతవాసులకు ఏ సరుకులు కావాలన్నా మున్సిపల్ సిబ్బంది వాటిని కట్టుదిట్టమైన భద్రత మధ్య అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles