Newly-married couple, 100 others quarantined పెళ్లిపై కాటువేసిన కరోనా.. వధూవరులు సహా అతిధుల క్వారంటైన్

Newly married couple 100 others quarantined as kin test corona positive

Newly-married couple, 100 wedding Guest quarantine, corona positive, CISF jawan, Brother in Law, Chhindwara coronavirus, Covid-19, Madhya Pradesh

Just a few hours after their marriage was solemnized, a young couple in Chhindwara district of MP was institutionally quarantined along with 100 other family members and contacts. Reason: The bride's CISF staffer brother-in-law tested positive for coronavirus the day of the wedding.

పెళ్లిపై కాటువేసిన కరోనా.. వధూవరులు సహా అతిధుల క్వారంటైన్

Posted: 05/28/2020 06:59 PM IST
Newly married couple 100 others quarantined as kin test corona positive

పెళ్లంటే పందిళ్లు సందళ్లు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు మూడేముళ్లు ఏడే అడుగులు.. వేదమంత్రోచ్చరణలు, శ్రాస్తోక్తంగా పాగే కార్యాలు, విందు బోజనాలు. బావ బామ్మరుదుల సరదాలు, హడావిడులు, కొత్త పలకరింపులు.. పలకరింపులు తీపి గురుతులు, ఇవన్నీ పెళ్లింట్లో కనబడే దృశ్యాలు. కానీ కరోనా నేపథ్యంలో లాక్ డౌన్‌ అమల్లో ఉన్నా.. ఇకపై లేకపోయినా.. పరిమితమైన బంధుగణం, మిత్రజనంతో అంటే కేవలం పదుల సంఖ్యతోనే పెళ్లి తతంగం కానిచ్చేస్తున్నారు. అందుకు కారణాలు ఏంటంటే కరోనా మహమ్మారి ఎక్కడి నుంచి ఎలా కాటువేసినా.. వధూవరులు సహా ఎవరే దాని ప్రభావానికి గురికావద్దన్నది ఉద్దేశ్యం.

కరోనా కాలంలో మాస్కులే పెళ్లి పత్రికలు.. కరోనా లక్షణాలు లేకపోతే మాత్రమే ఆహ్వానితులు అన్న ఆంక్షలు.. బందుమిత్రులందరూ ఆహ్వానితులే అన్న పదాలకు బదులు..ఇంటి నుంచ ఒక్కరు మాత్రమే అదీ యుక్తవయస్కులు మాత్రమే ఆహ్వానితులని మరీ ముహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. ఇంత జాగ్రత్తలు తీసుకున్నా.. పెళ్లన్నాక.. ఎవరు మాత్రం ఆంక్షలను పాటిస్తారు.? ఎంతవరకంటూ ఆంక్షల నడుము బౌతిక దూరం పాటిస్తూ కార్యక్రమంలో ఎలాంటి సందడి లేకుండా వుంటారు. నాలుగో విడత లాక్ డౌన్ లో పెళ్లిళ్లకు ఒకే చెప్పిన కేంద్రం.. బంధువుల సంఖ్యను కూడా ఇరవై నుంచి యాభైకి చేసింది.

ఈ మాత్రం చాలుగా.. ఇంకా కోంచెం చెలరేగిపోనా అనుకునే మనవాళ్లు.. వధువు తరపున యాభై, వరుడి తరపున యాభై మంది వచ్చి కళ్యాణం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత కానీ వధువు అక్క భర్తకు కరోనా సోకిందని తెలియడంతో పెళ్లి జరిగిన నూతన వధూవరులతో పాటు పెళ్లికి హాజరైన బంధుగణం అంతా క్వారెంటైన్ తరలివెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా 100 మంది క్వారెంటైన్ కేంద్రానికి తరలించారు అధికారులు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఛింద్వారా జిల్లాలో చోటుచేసుకుంది.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లు ఇలా వున్నాయి. చింద్వారాలో ఓ నూతన జంట కరోనా సమయంలో ఒక్కటయ్యారు. అయితే వారి వివాహానికి వధువు సోదరి భర్త.. చింద్వారా సమీపంలోని జున్నార్థియో ప్రాంతానికి చెందిన వ్యక్తే.. ఢిల్లీలో కేంద్ర పరిశ్రమల భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) విభాగంలో విదులు నిర్వహిస్తున్నాడు. అతను ఈ నెల 20నే చింద్వారాకు వచ్చాడు. ఆ తరువాత పరేస్యా ప్రాంతంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆ తరువాత అక్కడి నుంచి చింద్వారాకు వివాహం నిమిత్తమై చేరుకున్నాడు. 26వ తేదీన వివాహానికి హాజరైన తరువాత కొన్ని గంటల వ్యవధిలోనే అతనిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అతన్ని అసుపత్రికి తరలించామని పురపాలక సంఘ కమీషనర్ రాజేష్ సాహీ తెలిపారు.

దీంతో వివాహానికి వచ్చిన బంధువులతో పాటు నూతన వధూవరులను కూడా క్వారెంటైన్ కేంద్రానికి తరలించామని తెలిపారు. కాగా బాధితుడు ఢిల్లీ నుంచి చింద్వారాకు చేరుకుంటున్న సమయంలో జిల్లా సరిహద్దుల్లో ప్రవేశిస్తుండగా అధికారులు స్క్రీనింగ్‌ పరీక్షలు జరిపి అనుమతించారు. అయితే అతనిలో కరోనా వైరస్‌ సోకినట్లు ఎలాంటి సంకేతాలు కనిపించకపోవడంతో జిల్లాలోకి అనుమతించామని చెప్పారు. కొద్దిరోజులుగా అతనిలో కరోనా లక్షణాలు కనిపించడంతో.. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించామని దీంతో కరోనా పాజిటివ్ అని తేలడంతో వైరస్‌ సోకినట్లు నిర్ధారణైందని కలెక్టర్‌ సౌరభ్‌ సుమన్‌ తెలిపారు. అతను కలిసిన ప్రైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తింస్తున్నామని.. ఇక పెళ్లివారందరినీ మూడు ప్రభుత్వ క్వారెంటైన్‌ కేంద్రాలకు తరలించామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Newly-married couple  quarantine  corona positive  Covid-19  Madhya Pradesh  

Other Articles